Breaking News

Chakali Ailamma: ఆత్మగౌరవ ప్రతీక!

Published on Thu, 09/26/2024 - 09:50

ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్య ఐలమ్మ.

ఉమ్మడి నల్లగొండజిల్లా (నేటి జనగాం జిల్లా) పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య – ఐలమ్మలకు ఆరుగురు సంతానం. వారిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం. కులవృత్తితో బతకలేక పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది ఐలమ్మ. అదే విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది.

అప్పుడే వెట్టి గొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చి... 1940–44 మధ్య కాలంలో విసునూరులో దేశ్‌ముఖ్‌లు, రజాకర్ల అరాచకా లపై ఎదురుతిరిగి ఎర్రజెండా పట్టి ఆంధ్రమహాసభ (సంఘం)లో చేరింది ఐలమ్మ.  దీంతో రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. ఆమె కౌలుకు తీసుకున్న భూమిలో కాపు కొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండా లను పురమాయించారు. ‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలిగేది’ అంటూ తన పంటను దోచుకోవడానికి వచ్చిన దొరగూండాలతో పలికింది ఐలమ్మ.

సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా కోర్టులో తీర్పువచ్చింది. ఐలమ్మ భూపోరాటం సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తి నిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. బడుగులను ఆదుకోవడమే ఆమెకు నిజమైన నివాళి! – ఆలేటి రమేష్‌, రజక విద్యార్థి సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి

ఇవి చదవండి: మహాలక్ష్మి కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)