Breaking News

అయతొల్లా ఖమేనీ (ఇరాన్‌ సుప్రీం) రాయని డైరీ

Published on Sun, 06/22/2025 - 00:42

అహంకారం మంచి విషయం. కానీ, ఎవరు అహంకరిస్తున్నారు అనే దానిని బట్టి అది మంచి విషయం అవునా కాదా అనేది ఉంటుంది! అహంకారం, జాతి రక్షకుడికి దేవుని అనుజ్ఞ. అదే అహంకారం, జాతులను తుడిచి పెట్టేందుకు సైతాను ఆజ్ఞ. ‘‘ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. అతడిని కాపాడటం కూడా మా చేతుల్లోనే ఉంది...’’ అంటోంది అమెరికా! 

ఎంత అహంకారం?! ఎవర్ని ఎవరు కాపాడతారన్నది యుద్ధం చేతుల్లో ఉంటుందా? సర్వశక్తి సంపన్నుడైన అల్లాహ్‌ తలంపులో ఉంటుందా? ఎవరి దారిన వాళ్లుండేవాళ్లను నొప్పించే పనులే జరిగాయి ఈ లోకంలో ఇంతవరకు! ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముస్లిం ప్రపంచం ప్రతి దేశంలోనూ గాయపడి ఉంది. 

ముస్లిములను షియాలుగా, సున్నీలుగా; ముస్లింలను అరబ్బులుగా, అరబ్బులు కానివారిగా వేరు చేసి, ఐక్యతను చెడగొట్టి యావత్‌ ముస్లిం జాతినే తుడిచిపెట్టేందుకు అగ్రరాజ్య సైతాన్, జెరూసలేంలో తిష్ఠవేసుకుని ఉన్న ‘జియోనిస్టు పిల్ల సైతాను’తో కలిసి ముస్లిం దేశాల మీదమీదకు వస్తోంది.

పాలస్తీనా, లెబనాన్, యెమెన్, సిరియాలలో ఇరాన్‌ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందనీ, ఆ ఉగ్రవాదుల నుంచి ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను తన మీద వేసుకున్నాననీ అమెరికా చెబుతోంది! 

అసలు ఎవరి నుండి రక్షించుకోవడానికి ఇరాన్‌ ఈ ‘ఉగ్రవాద’ కవచాలను ఏర్పరచు కోవలసి వచ్చిందో, ముందు అది చెప్పాలి అమెరికా. అంతకన్నా ముందు, ‘ఉగ్రవాదులు’ అనటం మాని ‘ధర్మయుద్ధ సైనికులు’ అనటం అమెరికా నేర్చుకోవాలి.

ఖమేనీ ఆధునిక హిట్లర్‌ అంటోంది జియోనిస్ట్‌ పిల్ల సైతాన్‌ ! తన పెదనాన్న పెద్ద సైతాన్‌ ను మించిన హిట్లర్‌ ఎవరున్నారు? గ్వాంటనామో, అబుగ్రై»Œ  జైళ్లలో అమెరికా చేసిన నేరాలెన్ని! అక్కడి ఖైదీలకు చూపిన నరకాలెన్ని? స్వతంత్రంగా ఉన్న ఏ దేశాన్ని చూసినా బుసకొట్టకుండా ఉందా ఈ పెద్ద సైతాన్‌ ?! సిరియా అంతర్యుద్ధం మొదలైందీ, అంతం కాకుండా ఉన్నదీ ఎవరి వల్ల? ఈ రెండు సైతాన్‌ల వల్లనే కదా!

‘‘తగాదా తీర్చటానికి తాను సిద్ధంగా ఉన్నాను’’ అని రష్యా అంటోంది! మిత్రులైన వాళ్లు కూడా సర్దుబాటు చేయటానికే చూస్తారేమిటి?! రష్యా పూర్తిగా ఇరాన్‌ వైపు ఉండలేదా, బహిరంగంగా. 

అయినా, దేవుడితో సైతాను తగాదా పడుతున్నప్పుడు అది దేవుడికి, సైతానుకు మధ్య తగాదా ఎలా అవుతుంది? సైతానును కదా రష్యా హెచ్చరించాలి, ‘‘నువ్వు నోరు తెరవకు. దేవుడితో ఘర్షణ పడితే నెత్తిపై ఒక్కటి పడుతుంది...’’ అని!

పిల్ల సైతాను తల పైన కర్రతో కొట్టకుండా ఇరాన్‌ కు నచ్చచెబుతాననీ, ఆత్మరక్షణకు తప్ప మరి దేనికీ కర్రలను దగ్గర పెట్టుకోకుండా ఇరాన్‌ ను ఒప్పిస్తాననీ రష్యా అనటం మధ్యవర్తిత్వం అవుతుంది కానీ, స్నేహం అవుతుందా? 

చైనా రహస్యంగా కొన్ని ఆయుధాలు పంపింది. ఒకరికి సహాయం చేస్తే తెలియకూడదని అంటారు. స్నేహం కూడా ఎవరికీ తెలియకుండా చేయాలా? ఏమైనా, ఇరాన్‌ ఒంటరి పోరాటమే చేయాలి. 

వికారమైన ఆ పిల్ల సైతాన్‌ ని ఈ భూమి మీద లేకుండా చేసేంతవరకు అన్ని ఇస్లాం దేశాల తరపున, అల్లాహ్‌ పేరిట ఇరాన్‌  పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆఖరి ఆయుధం వరకు, ఆఖరి ఆయుధం తర్వాత కూడా!

బంకర్‌కు దగ్గర్లో భూమి బద్దలైనట్లుగా పెద్ద చప్పుడు! అమెరికా తన దుర్మార్గమైన యుద్ధాన్ని మొదలు పెట్టినట్లే ఉంది!   

సర్వజ్ఞుడైన అల్లాహ్‌కు సత్యమేమిటో తెలుసు. నా ప్రియమైన ఇరాన్‌కు అల్లాహ్‌ రక్షణ తప్పక ఉంటుంది.ఆయన ఇరాన్‌  చేయి విడువడు. నా ఆత్మ ఇరాన్‌ ను వీడదు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)