నిర్మలా సీతారామన్‌ (ఆర్థిక మంత్రి) రాయని డైరీ

Published on Sun, 02/01/2026 - 01:16

మంచి టీమ్‌కి హెడ్‌గా ఉండటం, మంచి హెడ్‌ కింద టీమ్‌లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్‌లోని వాళ్లు టీమ్‌లో ఉంటూనే హెడ్‌గా పని చేయాలి, హెడ్‌గా ఉన్నవాళ్లు హెడ్‌గా ఉంటూనే టీమ్‌లో పని చేయాలి. అప్పుడే మంచి హెడ్, మంచి టీమ్‌ తయారవుతారు! మునుపటి 8 బడ్జెట్‌లు కూడా నాకు ఇదే నేర్పించాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నా 9వ బడ్జెట్‌. ఆర్థిక మంత్రిగా మాత్రమే ఇది నా బడ్జెట్‌. అసలు కసరత్తంతా నా టీమ్‌ది. కనుక, బడ్జెట్‌ సమర్పణ కూడా అదృశ్యంగా నా టీమ్‌దే అవుతుంది. సెక్రెటరీలు ఆరుగురు, అడ్వైజర్‌ ఒకరు... మొత్తం ఏడుగురు అపర చాణక్యులు!

బడ్జెట్‌లో ఏముందో ఇంకొన్ని గంటల్లో దేశ ప్రజలకు తెలిసిపోతుంది. బడ్జెట్‌ను తయారు చేయటంలో నా టీమ్‌ కష్టం ఎంతుందో చెప్పాలంటే మాత్రం అది బడ్జెట్‌ ప్రసంగాన్ని మించిన ప్రసంగమే అవుతుంది! టీమ్‌లోని అనురాధా ఠాకూర్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ. బడ్జెట్‌ రూమ్‌లోకి ప్రవేశించిన తొలి మహిళ! నేటి బడ్జెట్‌కు ప్రాథమిక రూపశిల్పి. హల్వాను అడుగంటకుండా ఉడికించటంలోని వివిధ స్థాయుల సన్నని మంటల గురించి తెలిసిన నిపుణురాలు. ఇంట్లో మనుషుల్ని కదిలించకుండానే ఇంటి గదుల్ని, గోడల్ని పునర్నిర్మించగల నేర్పరి.

అజయ్‌ సేuЇ ఫైనాన్స్‌ సెక్రెటరీ. గ్రాండ్‌ మాస్టర్‌! బడ్జెట్‌ టీమ్‌లోని సెక్రెటరీలందరికీ కెప్టెన్‌. ‘ఆర్థిక లోటు’ వార్నింగ్‌ సిగ్నల్‌ ఎర్రగా వెలిగి ఆరిపోతున్నా కూడా చలించని శాంత మనస్కుడైన పైలట్‌! అరవింద్‌ శ్రీవాత్సవ రెవిన్యూ సెక్రెటరీ. బడ్జెట్‌లో కొత్త ముఖం. ముక్కులు
పిండకుండా, బుగ్గలు పుణికి పన్నులు వసూలు చేయగల టాక్స్‌ కలెక్టర్‌. బడ్జెట్‌ స్పీచ్‌లో పార్ట్‌–బి ఆయనదే. పన్నుల పెంపు, తగ్గింపు ఉండేది ఆ పార్ట్‌లోనే. డిన్నర్‌ బిల్లుని సమానంగా పంచే ధర్మరాజు. ఒకరెవరైనా అదనంగా ఆర్డర్‌ చేసి ఉంటే, వారికి అదనంగా ‘వడ్డించే’ నియమబద్ధుడు.

ఉమ్లున్మాంగ్‌ ఉవల్నామ్‌ ‘ఎక్స్‌పెండిచర్‌’ సెక్రెటరీ. ప్రభుత్వాన్ని దేనినీ కొననివ్వరు. ఏం అడిగినా సరే, ‘ఇప్పుడు కాదు బాస్‌’ అనేస్తారు.
అనంత నాగేశ్వరన్‌ ఛీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌. డేటా డిటెక్టివ్‌. సంక్లిష్టమైన ప్రపంచ గందరగోళాన్ని ‘ఆర్థిక సర్వే’గా అనువదిస్తారు. గాలివానలు సహాయకరంగా ఉంటాయా, లేక మనం తుపానులోకి వెళ్లబోతున్నామా అన్నది ఆర్థిక శాఖకు చెబుతారు. వర్షం వచ్చే ముందు మీ గొడుగు విరిగిపోయిందన్న విషయాన్ని కూడా కచ్చితంగా మీకు గుర్తు చేస్తారు.

నాగరాజు ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రెటరీ. బ్యాంకుల వైద్యుడు. బ్యాంకుల ఆరోగ్యాన్ని పరిరక్షించటం కోసం, మీరు ‘టీ’ తాగి చేసిన డిజిటల్‌ చెల్లింపులు లోప భూయిష్ఠంగా లేకుండా చూసుకునేది ఆయనే. అరుణిష్‌ చావ్లా ఇన్వెస్ట్‌మెంట్‌లు, పబ్లిక్‌ అసెట్‌ల కార్యదర్శి. ప్రభుత్వ కంపెనీల వాటాల కోసం కొనుగోలుదారులను వెతికి పెడతారు. వెతికి పడతారు. ఆయనొక ఇ–బే వేలం పవర్‌ సెల్లర్‌. ప్రభుత్వానికి లాభం వస్తుందంటే ఎవరి చేతనైనా ఏదైనా కొనిపించేస్తారు.

నిజంగా, ఎంత గొప్ప టీమ్‌! కాకపోతే, ఇలాంటి టీమ్‌ ఉన్న ప్రతి లీడర్‌కీ ఎదురయ్యే సమస్య ఒకటే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి కూర్చున్నప్పుడు డైనింగ్‌ టేబుల్‌ మీద ఉన్నవి ఇడ్లీ, వడ మాత్రమే అయినా ఆ రెండిట్లోంచి కూడా ఒక దానిని ఎంపిక చేసుకోలేక సతమతం అవటానికి తగినంత సమయాన్నింకా చేతిలో మిగిల్చే ఉంచుతారు! నాదీ ఇప్పుడు అటువంటి సమస్యే. ఏ కలర్‌ శారీ బాగుంటుందా అని ఆలోచిస్తూ, తెరిచి ఉన్న అల్మరా ముందు నిలబడి పోవటం అన్నది నాకు ఏనాడూ సమయం దొరకని పని. కానీ ఇవాళ నా టీమ్‌ నా చేత ఆ పనిని చేయించబోతున్నట్లే ఉంది!  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)