Breaking News

ఉద్యోగులను నిరాశపరిచింది..

Published on Wed, 07/24/2024 - 08:49

ఆదాయపన్ను శ్లాబ్‌లలో పెద్ద మార్పులు లేవు. నేషనల్‌ పెన్షన్‌ స్కీమును యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెసులుబాటు ఉండాలని కోరుకుంటున్నారు. ఐదు లక్షల ఆదాయానికి పన్ను నుండి మినహాయింపు కావాలని కోరుకుంటున్నారు. కానీ మూడు లక్షల దగ్గరనే ఆగిపోయింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును రద్దు చేసి, పాత పెన్షన్‌ స్కీమును పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. కానీ ఎటువంటి మార్పులూ లేవు. నిత్యావసర సరుకుల ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో అందుక నుగుణంగా ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో కూడా మార్పులు చేయాలి.

బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్‌ తర్వాత మీడియాలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ... ఈ బడ్జెట్‌ మధ్యతరగతి వారికి చేయూతనిస్తుందన్నారు. కానీ బడ్జెట్‌లో మధ్యతరగతికి వెసులుబాటు కల్పించే ప్రతిపాదనలేమీ కనిపించలేదు. ఈ బడ్జెట్‌ కూడా మాటల బడ్జెట్‌గానే కనిపించింది. 

విద్యారంగానికీ, శిక్షణ –ఉపాధి రంగానికీ కలిపి లక్షా 48 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 3 శాతమేనన్న మాట!  విద్యారంగం ఒక్కదానికి మాత్రమే కేటాయింపులు చూస్తే 2.5 శాతం లోపే ఉంటాయి. బడ్జెట్‌ ప్రసంగంలో ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు ఒక్క మాట కూడా లేదు. దీన్ని బట్టి విద్య పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆసక్తీ లేనట్లు కనిపిస్తోంది. విద్య ప్రైవేటీకరణ యథేచ్ఛగా జరిగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈ బడ్జెట్‌ ద్వారా తెలుస్తోంది.

– అలుగుబెల్లి నర్సిరెడ్డి, వ్యాసకర్త తెలంగాణ శాసనమండలి సభ్యులు

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)