Breaking News

కోరి తెచ్చుకున్న యుద్ధం!

Published on Mon, 09/29/2025 - 10:36

కొడుకైన కుమారస్వామిని శంకరుడు ముద్దాడడాన్ని చూసిన బాణాసురుడు, కుమారస్వామి అదృష్టానికి   ఈర్ష్యపడ్డాడు. తండ్రి లేని కారణం చేత తనకు ఆ అదృష్టం కలగకపోవడాన్ని గురించి బాధపడి, శంకరుడు తనకు తండ్రి వంటివాడు కాబట్టి, శంకరుడి నుండి ఆ ప్రేమను పొందాలని నిర్ణయించుకున్నాడు. తలచినదే తడవుగా కఠోరమైన తపస్సు చేసి శివుని నుండి, తాను శివపార్వ తులకు పుత్రుడు కావాలనే వరం కోరాడు. శంకరుడు సరే అన్నాడు. అగ్నిదేవుడు పాలించే శోణిత నగరానికి పక్కనే ఒక నగరాన్నీ, నెమలి టెక్కెమునూ బాణుడికి ఇచ్చాడు. ముల్లోకాలను, అష్టదిక్కులలోని రాజులను అవలీలగా జయించి, గణాధిపత్యాన్ని కూడా సాధించి ప్రమథులకు నాయకుడయ్యాడు బాణుడు. కొంతకాలం యుద్ధాలు లేక పోవడంతో ఏమీ తోచక యుద్ధానికి అవకాశాన్ని కల్పించమని శంకరుడినే కోరాడు.

మనసులో నవ్వుకున్న శంక రుడు, ‘నీ రథానికి ఉన్న నెమలి టెక్కెము విరిగి నేలపై పడడాన్ని నీవు నీ కన్నులతో ఎప్పుడు చూస్తావో అప్పుడు యుద్ధం జరుగుతుంది’ అన్నాడు. ఆనందంతో మంత్రి కుంభాండునికి జరిగినదంతా చెప్పాడు బాణుడు. అలా చెబుతూండగానే బాణుడి రథపు నెమలి టెక్కెము సగానికి విరిగి పడింది. ఆనందంలో తేలిపోతున్న బాణుడి విపరీతపు మనఃస్థితిని నాచన సోమన ‘ఉత్తర హరివంశము’, పంచమాశ్వాసంలో, ఇలా వర్ణించాడు:

విఱిగిన బొంగె నద్దనుజ వీరవరుండు మనంబు లోపలన్‌/వెఱపును ఖేదము న్వెఱగు విస్మయముం బొడ
మంగ మంత్రియి/ట్లెఱిగి యెఱింగి మారి దనయింటికి రమ్మను వాని కేమియుం/గఱపిన నొప్పునే, విధి వికారము దప్పునె, యిట్లు ద్రిప్పునే. 

తెలిసి తెలిసి మృత్యువును తన ఇంటికి రమ్మని పిలిచేవాడికి ఏం చెప్పి మనసు మళ్ళించ గలం? దైవవశంగా జరగవలసిన కీడు జరగకుండా ఆగదు కదా! పరిస్థితులు ఒక్కసారిగా ఇలా మారిపోయాయి కదా! – అని బాణుడి మూర్ఖత్వాన్ని తలుచుకుని మంత్రి కుంభాండుడు బాధపడడం ఈ పద్యం భావం.  

చదవండి: తల్లి కాబోతున్న సింగర్‌, మెటర్నిటీ ఫోటో షూట్‌ పిక్స్‌ వైరల్‌

– భట్టు వెంకటరావు

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)