Breaking News

నాకే ఇన్ని కష్టాలా...? అంతా మన వల్లే.. !

Published on Thu, 06/05/2025 - 15:59

భక్తుడు తన జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది!!... భగవంతుడు తనకు సన్నిహితంగా ఉన్నవారిని అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు!!...  ’కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు... ఇవన్నీ ఆ పరీక్షలో భాగాలే! వాటిని ఒకటి తరువాత మరొకటి ఇస్తూ ఉంటాడు ‘నన్ను అట్టే అంటిపెట్టుకుని ఉంటాడా! లేదా విసుగుతో నన్ను దూరం చేసుకుంటాడా?’ అని అయన చూస్తూ ఉంటాడు!!... ఒకసారి పరీక్షలో ఉత్తీర్ణులం అయ్యాక మరొక పరీక్ష ఉండటం... లేకపోవడం ఆయన ఇష్టం...!

కానీ ఒకసారి విఫలం అయ్యాక మాత్రం మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు!  ఎందుకంటే అప్పటికే మన సామర్థ్యం అయనకు తెలిసిపోతుంది కనుక, ఈ విషయం మనం చక్కగా గ్రహించి కష్ట నష్టాలు వచ్చినపుడు దైవాన్ని నిందించక, మరువక, విడువక ఆయనపై విశ్వాసంతో సహనం వహించాలి. అప్పుడే అయన తన అనుగ్రహాన్ని  పుష్కలంగా అందిస్తాడు!!...

ఎలా వచ్చిన కష్ట నష్టాలు అలా పోతాయి. అయితే మన విశ్వాసం, సహనం ఎలా ఉండాలంటే పరీక్ష పెట్టీ పెట్టీ ఆయనే విసుగు చెందిపోవాలి...అంతేకానీ నేను రోజూ పూజలు, అభిషేకాలు చేస్తున్నాను, నాకు ఈ పని కావాలి, ఆ పని జరగాలి, లేకపోతే ఎందుకు అని అనుకోరాదు. అంతా బాగున్నప్పుడు అదంతా మన వల్లే అనుకుని పొంగిపోయి, సౌఖ్యాలు కలుగనపుడు మాత్రం దైవాన్ని నిందించటం తగదు, దానికంటె మనలో విశ్వాస లోపం ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. 

ఇదీ చదవండి: ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా?

కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నట్లు అనిపించవచ్చును, కానీ ఎక్కడో ఏదో మూలన చిన్న సందేహం మిగిలిపోయిందేమో అని చూసుకోవాలి. పాత్రలో నీరంతా బయటకు పోవడానికి పాత్రంత రంధ్రం అవసరం లేదు... చిన్న రంధ్రం ఉంటే చాలు  పాత్రలో నీరంతా బయటకు పోవడానికి, కనుక  ఆ చిన్న రంధ్రం ఎక్కడుందో కనుక్కుని దానిని మూసివేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నిందిస్తూ కూర్చోకూడదు. దైవనింద వల్ల మరింత పాపం చుట్టుకుంటుంది తప్ప సమస్యలు తీరిపోవు! విశ్వాసమే అసలైన పరిష్కారాన్ని ఇస్తుంది.

చదవండి: Bakrid 2025 త్యాగాల పండుగ : ‘తఖ్వా’ అంటే..
 

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)