Breaking News

అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌ తప్పనిసరి..!

Published on Sun, 04/26/2026 - 12:39

ఎన్నో రైళ్ల జర్నీలు చేసి ఉంటారు. కానీ చైనాలో ఆ ప్రదేశంలోని రైలు జర్నీ ఓ ప్రత్యేక అనుభూతి మాత్రమే కాదు, ఆస్ప్రతిలో ఉన్నామా అనే భావన వస్తుంది. ఆ రైలు ఎక్కిన ప్రతి ఒక్కరు ఆక్సిజన్‌ మాస్క్‌ ధరించి తీరాల్సిందే. లేదంటే కష్టం. ఎందుకంటే..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గమైన చైనా క్వింగ్‌హై-టిబెట్ రైల్వేలో కచ్చితంగా ఆక్సిజన్‌ మాస్క్‌ ధరించి ప్రయాణించాలి. ఆ రైలు "ఆసుపత్రి తరహా" ఏర్పాటుతో వస్తుంది. ఈ అసాధారణ ప్రయాణం మిమ్మల్ని టిబెట్ రాజధాని అయిన లాసా వరకు తీసుకువెళుతుంది.  దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైగా పొడవైన ఈ రైలు మార్గంలో అధిక భాగం సముద్ర మట్టానికి సుమారు 4 వేల మీటర్ల (13,123 అడుగులు) ఎత్తులో ప్రయాణిస్తుంది. 

దీనిలోని అత్యంత ఎత్తైన ప్రదేశం టాంగ్‌గులా కనుమ వద్ద 5,072 మీటర్ల(16,640 అడుగులు) ఎత్తుకు చేరుకుంటుంది. ఈ ఎత్తులో, సముద్ర మట్టంతో పోలిస్తే గాలిలో సుమారు 40 శాతం తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా సునాయాసంగా చేయడానికి, అలాగే అధిక ఎత్తులో ప్రయాణించేలా సహాయం చేయడానికి రెండు ప్రధాన ఆక్సిజన్‌ వ్యవస్థలను రూపొందించారు.

మొదటిది డిస్పర్షన్ ఆక్సిజన్ సిస్టమ్. ఈ వ్యవస్థ రైలులోని ఎయిర్ కండిషనింగ్‌లో అదనపు ఆక్సిజన్‌ను కలుపుతుంది, తద్వారా ప్రతి కోచ్ లోపల మొత్తం ఆక్సిజన్ స్థాయి సుమారు 23.5 శాతానికి పెరుగుతుంది. రైలు సాధారణంగా గోల్ముద్ (2,829 మీ) చేరుకున్న తర్వాత ఈ వ్యవస్థను ప్రారంభిస్తుంది.

రెండవది డైరెక్ట్ ఆక్సిజన్ అవుట్‌లెట్ సిస్టమ్. ఇది ప్రయాణికులు తమ సీట్ల దగ్గర ఉన్న అవుట్‌లెట్‌లకు అనుసంధానించబడిన చిన్న పైపుల ద్వారా ఆక్సిజన్‌ను పీల్చుకోవడానికి అనుమతిస్తుంది. హార్డ్ స్లీపర్ కంపార్ట్‌మెంట్లలో, ప్రతి బెర్త్‌కు దాని పక్క గోడల వెంబడి ఆక్సిజన్ అవుట్‌లెట్‌లు అమర్చబడి ఉంటాయి.

హార్డ్ సీట్ కోచ్‌లలో, ఆక్సిజన్ అవుట్‌లెట్‌లు క్యారేజీ గోడల వెంబడి క్రమమైన విరామాలలో లేదా కొన్నిసార్లు సీట్ల కిందకూడా అమర్చబడి ఉంటాయి. ప్రతి అవుట్‌లెట్‌ను సుమారు 4 నుంచి 6 మంది ప్రయాణికులు పంచుకుంటారు. సాఫ్ట్ స్లీపర్ కంపార్ట్‌మెంట్లలో, ప్రతి బెర్త్‌కు మంచం దగ్గర దాని స్వంత ఆక్సిజన్ అవుట్‌లెట్ ఉంటుంది.

ఈ  రైలు మార్గం ప్రకృతి సౌందర్యానికి నెలవు..
కింగ్‌హై-టిబెట్ రైలు ద్వారా లాసా చేరుకునే ప్రయాణం చాలా అందమైనది, ప్రత్యేకమైనది. ఈ రైలు బీజింగ్, షాంఘై, చెంగ్డూ, షినింగ్ వంటి నగరాల నుంచి టిబెట్‌లోని లాసా వరకు వెళుతుంది.

ఈ ప్రయాణంలో, ప్రయాణికులు మార్గం పొడవునా ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. వారు విశాలమైన నీలి ఆకాశాన్ని,తెల్లని మేఘాలను చూస్తారు. గాడిదలు, గొర్రెల మందలతో కూడిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. 

ఈ రైలు కున్లూన్ పర్వత శ్రేణితో సహా మంచుతో కప్పబడిన పర్వతాలు, యాంగ్జీ వంటి ప్రధాన నదుల గుండా కూడా వెళుతుంది. ఈ ప్రయాణం హోహ్ షిల్ నేషనల్ నేచర్ రిజర్వ్ వంటి మారుమూల సహజ ప్రాంతాల గుండా సాగుతుంది.

సాఫ్ట్ స్లీపర్, హార్డ్ స్లీపర్, హార్డ్ సీట్ల కోసం 

ఢిల్లీ నుంmr లాసాకు ప్రయాణిస్తుంటే, బీజింగ్ మీదుగా విమానంలో వెళ్లవలసి ఉంటుంది. దీనికి సుమారుగా రూ. 55,000 ఖర్చవుతుంది. బీజింగ్ నుంచి లాసాకు రైలులో వెళ్లాలి. ధర మీరు ఎంచుకునే సీటు రకంపై ఆధారపడి ఉంటుంది.

మూడు రకాల సీట్లు ఉన్నాయి. సాఫ్ట్ స్లీపర్ అత్యంత సౌకర్యవంతమైన ఎంపిక, దీనిలోని ప్రతి క్యాబిన్‌లో నాలుగు బెర్త్‌లు ఉంటాయి. కంపార్ట్‌మెంట్లు విశాలంగా ఉంటాయి. లాక్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. టేబుల్, టీవీ స్క్రీన్, లగేజీ పెట్టుకునే స్థలం, ఆక్సిజన్ అవుట్‌లెట్‌ల వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయి. పై బర్త్‌కు సుమారుగా  రూ. 675, కింది బంక్‌కు రూ. 700 ఖర్చవుతుంది.

తరువాతది హార్డ్ స్లీపర్. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో ఆరు బెర్త్‌లు ఉంటాయి, దిండ్లు, దుప్పట్లు అందించబడతాయి. గోప్యత కోసం తలుపు ఉండదు, మరియు స్థలం ఇరుకుగా ఉంటుంది. ధరలు పై బర్త్‌కు రూ. 425 మధ్య బర్త్‌ రూ. 440, కింది బంక్‌కు రూ. 450 నుంచి ప్రారంభమవుతాయి.

హార్డ్ సీట్లు అత్యంత చౌకైన సుదీర్ఘ ప్రయాణానికి మాత్రమే సాధారణ సీటింగ్‌ను అందిస్తాయి. దీనికి సుమారుగా రూ. 212 ఖర్చవుతుంది.

 

(చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!)

 

 

#

Tags : 1

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)