బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
Breaking News
Yoga కూర్చొని కూడా బరువు తగ్గొచ్చు
Published on Sat, 05/17/2025 - 11:33
‘దండాసనం’ (Dandasana or Staff Pose) అని పిలువబడే స్టాఫ్ పోజ్ వెన్నెముక, కాళ్ళు, తుంటి భాగంలో బలాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం కూర్చున్న భంగిమలో ఉంటుంది. యోగా ప్రారంభకులకు అనుకూలమైన అభ్యాసంగా ఉపయోగపడుతుంది.
ఎలా చేయాలంటే.
మ్యాట్ పైన కూర్చొన, కాళ్ళు ముందు చాపి కూర్చోవాలి. తొడ కండరాలను స్ట్రెచ్ చేయాలి. పాదాలను ముందుకు వంచాలి.
వెన్నెముకను నిటారుగా ఉంచాలి.
భుజాలను వెడల్పుగా చేస్తూ, నిటారుగా ఉంచాలి. ∙చేతులను హిప్ బాగానికి రెండు వైపులా నేల మీద నిటారుగా ఉంచాలి.
ఈ భంగిమలో 5–15 శ్వాసలోపలకు తీసుకొని, వదలాలి, ఈ సమయంలో శ్వాసపై పూర్తి దృష్టి పెట్టాలి.
ఇదీ చదవండి : బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
ప్రయోజనాలు..
∙ఈ ఆసనం ద్వారా వెన్నునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ∙చేతులు, తొడ కండరాలలో ఒత్తిడి రిలీజ్ అవుతుంది. దీర్ఘ శ్వాసల వల్ల ఛాతీ భాగం స్ట్రెంథెన్ అవుతుంది. ఇతర యోగా భంగిమలకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఈ భంగిమ రోజూ సాధన చేయడం ద్వారా శారీరక బరువు పట్ల అవగాహన పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆహారంవైపు దృష్టి మరలి, అధికబరువు సమస్య తగ్గుతుంది.
ఈ భంగిమలో తొడ, మోకాలి భాగాలు ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే యోగా పట్టీని ఉపయోగించవచ్చు. కూర్చోవడంలో ఇబ్బంది పడుతుంటే, సపోర్ట్ కోసం ఒక పలచటి దిండును ఉంచవచ్చు. మొదట్లో కాళ్ళను నిటారుగా ఉంచలేకపోతే ఆందోళన పడనక్కర్లేదు. మెల్లగా అభ్యాసనం ద్వారా కాళ్లు నిటారుగా వస్తాయి.
ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!
Tags : 1