Breaking News

ప్రత్యామ్నాయంలేని ప్రేమ యాత్రలు

Published on Thu, 07/16/2026 - 08:41

దేవుని వరమైన మెస్సీయాను, ఆ మెస్సీయ అనబడే క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా ఎవరిని ఊహించనైనా ఊహించలేము. ప్రేమకు ప్రతిరూపం అయినా ఆయన ప్రేమయాత్రలకు కూడా ప్రత్యామ్నాయాలు కనుగొనలేము. యేసు జీవితాన్ని ఆయన ప్రేమ సంబంధ పాదయాత్రలను వేరు చేసి ఎన్నడూ చూడలేము. తల్లిదండ్రులకు లోబడుతూ పెద్దలైన మనుష్యులు దయయందును, దేవుని దయయందును వర్ధిల్లిన బాల్యజీవితం యేసుది.

బాలయేసు కార్టూన్‌ చిత్రాలలో ఆయన పాత్ర తీరుతెన్నులు ఆకాశంలో విహరించక పిల్లలను నైతిక విలువలతో అలరించడమే కాక పెద్దల పర్యవేక్షణలో సత్ప్రవర్తనతో మెలిగేలా ్రపోత్సహించడం విశేషం. అన్ని భాషల్లోని నవలా నాయకులు లేదా సినిమా, టీవీ కథానాయకుల (ప్రోటోగనిస్ట్స్‌) పాత్రల సృష్టిలో, ఈనాటి నేటి ఏఐ ఆధారిత వీడియోల ముఖ్య ప్రధాన పాత్రలలో వాటి ఉన్నతమైన వైవిధ్య విధాన రూపకల్పనలలో, మరి ముఖ్యంగా ‘హీరోహోదా’ కోసం యేసు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన బోధలు, మాటలను పోరాటపటిమ స్ఫూర్తిని వాడుతూ డబ్బు చేసుకుంటున్న నిర్మాతలకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి కొదువలేదు.

వ్యక్తి పూజకు చోటిచ్చేలా సంతోషానందాలు ఇవే అనుకొనే భ్రమలలోనే అమాయక యువత చిక్కుకొని తమ విలువైన సమయం వెచ్చిస్తూ వినోదం కొనుక్కొనే వేళలలోనే ఇట్టి నయా ప్రేక్షకులను తెరనాయకులు థియేటర్లలో ఆకస్మికంగా వారిని దర్శించడం కంటె కూడా... బాధితులను, రోగులను, బీదలను, వృద్ధులను, నిరుపేద విద్యార్థులను ఆదుకొనేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరామర్శించటం ఆదరించడం నిజమైన నాయకుల సహజ స్వాభావిక దైవిక లక్షణంగా అది ఎంచదగ్గదే. మేలైన రీతులలో వారిని గుర్తించదగ్గదే. ఎక్కడో మారుమూల పల్లెలతో పాటుగానే, నిలువనీడ లేనివారై ΄÷ట్ట చేతపట్టుకొని వచ్చి నగరాలను నిర్మించే వలస కార్మిక శ్రమజీవులు ఎక్కడున్నా వారి గుడారాల చెంతనే వారిని పరామర్శిస్తూ వారికి న్యాయసంబంధ సేవలందించడం క్షేత్రస్థాయి పర్యటనే.

నిజానికి బీదలు, రోగులు, ఖైదీలను దైవిక ప్రేమతో పరామర్శించి వారికి ధైర్యం నూరిపోస్తే ఇలా క్రియరూపాన ఆ గొప్పదైన ప్రేమను అంతటా కనబరిస్తే మీరు నన్నే ప్రేమించినట్టు అని యేసే స్వయంగా చెప్పడం విశేషం. గొప్ప గొప్ప నాయకులకే చెల్లును పాదయాత్రలు అంటూ అవి వారికే పరిమితం చేయక ఇలా ఎవరికి వారు అనుకోక వ్యక్తుల మేలు కోరి వ్యక్తిగతంగా దూర భారాలను లెక్కచేయక యేసును బట్టి యేసు ప్రేమతో యేసు మెప్పు పొందేలా ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు.

భవిష్యద్దర్శనం వాస్తవంలోనే నిలబెట్టి గెలిపిస్తుంది. కలల్లో ఊహల్లో సంచరిస్తూ గాల్లోతేలియాడడం కాక నేలమీదనే హుందాగా నిలబడడం నాయకత్వం. నడక నాయకత్వ లక్షణం కూడానూ. సకాలంలో స్పందించేలా నేరుగా వచ్చి అతి దగ్గరగా సమస్యలను వాటి ప్రభావ విపత్తులను చూసేలా వాటి పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా కృషి చేసేలా ఇలా సామాన్య జనంబాట పడుతూ దీనజనుల పరామర్శకు, బాధితుల ఓదార్పుకు నాయకుడనేవాడు తన పాదాలను నమ్ముకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ఇలాంటి వీరే యేసువలె విజయ సృష్టికర్తలుగా, తిరుగులేని నాయకులుగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకోగలుగుతారు.
– జేతమ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)