Breaking News

పొగతాగడం మానేస్తే ఎన్ని లాభాలో తెలుసా? దెబ్బకి మానేస్తారు!

Published on Sat, 05/31/2025 - 11:21

 పొగాకు వినియోగం అనేక రకాలుగా జరుగుతుంటుంది. ఉదాహరణకు సిగరెట్, బీడీ, చుట్ట, హుక్కా, పైప్, వేపింగ్‌... ఇలాంటి  పొగ పీల్చేవీ; వాటికి తోడు జర్దా, ఖైనీలంటూ ముసుగులో  పొగాకు నమిలేవీ ముక్కుతో పీల్చే నశ్యం వంటివి... ఇలా ఎన్నెన్నో రూపాల్లో  పొగాకు వినియోగం జరుగుతుంటుంది. వీటితో ఎన్ని రకాల  క్యాన్సర్లు వస్తాయో తెలుసుకుంటే పొగాకు గురించి తలచుకుందామన్నా భయమేస్తుంది. 

 

 పొగలో ఉండే విషాలివే... 

  • పొలోనియమ్‌ : రేడియోధార్మిక పదార్థాల్లోని రేడియో యాక్టివ్‌ మెటీరియల్‌ క్యాన్సర్‌కు కారణమవుతుందన్న విషయం తెలిసిందే. సిగరెట్‌ పొగలో ఈ రేడియో ధార్మిక పదార్థం ఉంటుంది. అది క్యాన్సర్‌ కారకం. 

  • బెంజీన్‌ : మనం రోజూ వాడే పెట్రోలు, గ్యాస్‌లలోంచి వెలువడే అత్యంత వ్యర్థపదార్థమిది.  

  • ఫార్మాల్డిహైడ్‌ : సిగరెట్‌  పొగలోని ఫార్మాల్డిహైడ్‌ అనే రసాయనాన్ని మృతదేహాలను సంరక్షించేందుకు వాడతారు. అనేక జువాలజీ ల్యాబ్‌లలో జీవుల మృతదేహాలను గాజుకుప్పెల్లో భద్రపరిచేందుకు వాడే రసాయన పదార్థం ఫార్మాల్డిహైడ్‌ ద్రావణమే. 

  • వినైల్‌ క్లోరైడ్‌ : ప్లాస్టిక్‌ పైపులు,  ప్లాస్టిక్‌ పదార్థాలు తయారు చేయడానికి వినైల్‌ క్లోరైడ్‌ వాడతారు. సిగరెట్‌ తాగడం అంటే ఈ ప్లాస్టిక్‌ను దేహంలోకి తీసుకోవడమే. ఇది కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే అంశాల్లో ఒకటి.  

 

ఎన్ని రకాల క్యాన్సర్లు  వస్తాయంటే... 
నోటి ద్వారా  పొగపీల్చే ΄ పొగాకుతో నోటి (ఓరల్‌) క్యాన్సర్లు, గొంతు (ఓరో ల్యారింగ్స్, ఓరో ఫ్యారింగ్స్, హై΄ోఫ్యారింగ్స్‌) క్యాన్సర్లు, పొగ నేరుగా వెళ్లే ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్లు ప్రధానంగా వచ్చే అవకాశముంది. దీంతో పాటు పరోక్షంగా కడుపు క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్లు, బ్లాడర్‌ క్యాన్సర్లతో పాటు మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్‌ గ్రంథికి వచ్చే క్యాన్సర్లు ముఖ్యం. పొగ కారణంగా వచ్చే క్యాన్సర్లు దేహంలోని ఏ భాగాన్నీ వదిలిపెట్టవంటే అది అతిశయోక్తి కాదు.
 

పొగాకు తెచ్చిపెట్టే మరికొన్ని వ్యాధులు.. 
΄ పొగతాగడం కేవలం క్యాన్సర్లనే కాకుండా...  చాలా రకాల వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. గుండె΄ోటు, రక్త΄ోటు, పక్షవాతంతో ΄ాటు మధుమేహమూ వచ్చేలా చేస్తుందీ అలవాటు. మామూలు వారితో  పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో టైప్‌–2 డయాబెటిస్‌ వచ్చేందుకు అవకాశాలు 30 నుంచి 40 శాతం మేరకు ఎక్కువ. 

ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్‌ యోగాసనాలు

ధూమపానం మానేస్తే కలిగే ప్రయోజనాలివి... 
 

  • ఆహారం రుచి తెలియడం 

  • వాసన గ్రహించే శక్తి సాధారణ స్థాయికి రావడం ∙చెమట, శ్వాస, జుట్టు, బట్టలు తాజా వాసనతో ఉండటం, 

  • పళ్లు, గోళ్లు పచ్చబారకుండా ఉండటం

  • మెట్టెక్కేటప్పుడు, దిగే సమయంలో, చిన్న చిన్న పనులకు ఆయాసం లేకుండా తేలిగ్గా చేయగలగడం. 

దీర్ఘకాలిక ప్రయోజనాలు...
సిగరెట్‌ మానేసిన తొమ్మిది నెలల్లో దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలపడతాయి. దేహంలో ఇన్‌ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్‌ ముప్పు తగ్గుతుంది.  పొగతాగడం మానేసిన ఏడాది తర్వాత కరోనరీ హార్ట్‌ డిసీజ్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అందుకే ఈరోజు నుంచే  పొగతాగడమే కాదు... ΄పొగాకును ఏ రూపంలో వినియోగిస్తున్నా మానేయడమే మంచిది. 

ఇదీ చదవండి: World Anti Tobacco Day: 1, 2, 3 కేన్సర్‌ దాకా అవసరమా మిత్రమా!

ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఒకరు సిగరెట్‌ తాగినా అది ఇంటిల్లిపాదీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పక్కనుండేవారు తాగే  సిగరెట్‌ పొగను ఇతరులు పీల్చాల్సి వస్తుండటాన్ని ‘ప్యాసివ్‌ స్మోకింగ్‌’ అంటారు. నేరుగా ΄ పొగతాగడం వల్ల కలిగే హాని ఎంతో ప్యాసివ్‌ స్మోకింగ్‌ వల్ల కూడా అంతే హాని జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... ప్రతి ఏడాదీ ప్యాసివ్‌ స్మోకింగ్‌ వల్ల 34వేలమంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనూ, 46,000 మంది గుండెజబ్బులతోనూ మృత్యువాత పడుతున్నారని తేలింది. అంతేకాదు... ఇంట్లో ఇతరులు తాగే సిగరెట్‌తో కలిగే ఈ ప్యాసివ్‌ స్మోకింగ్‌ ప్రభావం వల్ల ఇంట్లోని పొగతాగని ఇతర కుటుంబ సభ్యులకు... ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్, తలనొప్పి, దగ్గు వంటి అనారోగ్యాలు కలుగుతున్నా యని స్పష్టమైంది.

డా. బట్టు చైతన్య,  సీనియర్‌ కన్సల్టెంట్‌ పల్మునాలజిస్ట్‌   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)