Breaking News

'లివర్‌' అనే నేను..! జస్ట్‌ ఏడంగుళాల్లో..

Published on Sun, 04/19/2026 - 09:30

లివర్‌ చాలా కీలకం. ఇది పనిచేయకపోతే మాత్రం ఏ పరికరాలూ, ఉపకరణాలూ రక్షించలేవు. అయితే లివర్‌ (కాలేయం) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. లివర్‌ దెబ్బతిన్నప్పుడల్లా ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్‌ చేసుకుంటూ ఉండడంతో పాటు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేడు వరల్డ్‌ లివర్‌ డే. ఈ సందర్భంగా కాలేయం ఎంత కీలకమైనదో, ఎంతటి వైవిధ్యమైన పనులు చేస్తుందో చెప్పడంతోపాటు ఈ ఏడాది థీమ్‌... సాలిడ్‌ హ్యాబిట్స్‌ – స్ట్రాంగ్‌ లివర్‌ అంటే ‘దృఢమైన అలవాట్లతో – బలమైన కాలేయ రక్షణ’ పొందడం ఎలాగో తెలుసుకుందాం.

లివర్‌ పని సైలెంట్‌. కానీ దాని యాక్టివిటీస్‌ వైబ్రెంట్‌. ఎందుకంటే ఓ వ్యక్తి గోల్ఫ్‌ ఆడాలన్నా, బాల్‌ కొట్టాలన్నా, కాలు కదపాలన్నా, చెయ్యి కదిలించాలన్నా, తిన్నది అరగాలన్నా, పరుగులు తీయాలన్నా అది కాలేయం చేసే జీవక్రియల వల్లనే సాధ్యమవుతుంది. వాటిలో కొన్నింటిని చూద్దాం.

ఉన్నది ఏడంగుళాల స్థలంలోనే... 
కానీ ఎకరాల కొద్దీ కెమికల్‌ ఫ్యాక్టరీలంత పని... లివర్‌.. జస్ట్‌... ఏడంగుళాల విస్తీర్ణంలోనే... ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే కెమికల్‌ ఫ్యాక్టరీలంత సంక్లిష్టమైన పనులు చేస్తుంటుంది. 

చాలామంది అపోహ ఏమిటంటే... లివర్‌ జీర్ణక్రియలకు పనికివచ్చే ఎంజైములు విడుదల చేసి... అన్నం అరుగుదలకే పరిమితమవుతుందని. కానీ పొరబాటున ఓ వ్యక్తి వేలు తెగిందనుకోండి. అతడి రక్తస్రావం ఆగడానికి అవసరమైన రక్తం గడ్డకట్టించే ‘బ్లడ్‌ క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌’ వరకు అదే ఉత్పత్తి చేస్తుంది. 

వ్యాధులను ఎదుర్కోవడానికి కావాల్సిన యాంటీబాడీస్‌ పుట్టేందుకు తోడ్పడుతుంది. 

టాబ్లెట్‌ వేసుకుంటే వచ్చే సైడ్‌ఎఫెక్ట్‌లు ఇచ్చే చిరు విషాలను విరిచేయడం దగ్గర్నుంచి... మద్యం తాగేప్పుడు పుట్టే పెను విషాలను నిర్వీర్యం చేస్తుంది. 

గుండెకు ఓ సేఫ్టీ వాల్వ్‌లా పనిచేస్తూ... హెపాటిక్‌ వెయిన్‌ ద్వారా గుండెకు వెళ్లే రక్తం వెళ్లేటప్పుడు ఆరు నుంచి పది సెకండ్ల పాటు ఆ రక్తపు వేగాన్ని తగ్గించి, ఎక్సెస్‌ రక్తంతో గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా కానాడుతుంది.

దేహంలో తగినన్ని లవణాలు ఉంచేందుకు కిడ్నీపైనుండే అడ్రినల్‌ గ్రంథులు ప్రయత్నిస్తున్నప్పుడు... అవి పరిమితికి మించి ఉండకుండా చూసేది లివరే. 

ప్రతి ఒక్కరి ఒంట్లో ప్రతి సెకండ్‌కూ లక్షలాది ఎర్ర రక్తకణాలు పుడతాయీ, చనిపోతుంటాయి. వాటిని పుట్టించడం, గిట్టించడం కాలేయం పనే! ఎవరూ ఊహించడానికి కూడా వీల్లేని ఇలాంటి పనులెన్నో లివర్‌ చేస్తుంటుంది.

ఆ శక్తే వరమూ... శాపం కూడా! 
కాలేయంలోని 75 శాతం పనిచేయక పోయినా అది మళ్లీ రిపేర్‌ చేసుకుని మామూలుగా కాగలదు. ఇంకా అంతకంటే మించితే అది ప్రమాదకరం. అంటే కాలేయం సామర్థ్యం 25 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు ప్రమాదం ఎక్కువ. లివర్‌లో క్యాన్సర్‌గడ్డ ఏదైనా వస్తే చుట్టూ చాలావరకు తొలగించాక మనిషి మళ్లీ మామూలైనొతాడు. తీసేసిన లివర్‌ భాగం మళ్లీ పెరుగుతుంది. కానీ అంత ఎక్కువ సామర్థ్యం ఉన్నందున ఏదైనా ప్రమాదవశాత్తూ లివర్‌కు సిర్రోసిస్‌ అనే సమస్య వచ్చి పనిచేయడం మందగిస్తుంటే, లక్షణాలేవీ కనిపించవు కాబట్టి అది ఎక్కువగా పాడయ్యేవరకూ ఆ విషయమే తెలియదు. 

ఇది ఒకరకంగా శాపం. లివర్‌లో కొవ్వుకణాలు పేరుకుపోవడం వల్ల వచ్చే నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్, బాగా మద్యం తీసుకోవడం వల్ల వచ్చే ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్, సిర్రోసిస్‌ వంటి సమస్యలు లివర్‌కు వస్తుంటాయి. బాగా బరువు పెరుగుతుంటే, దాన్ని అదుపు చేసుకోవాలి. దేహంపైన రక్తనాళాలు సాలీడు ఆకృతిలో కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా నీరు పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
డాక్టర్‌ ఆర్‌.వి. రాఘవేంద్రరావు, సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ –లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ 

(చదవండి: Summer Health tips: సమ్మర్‌లో హైడ్రేషన్‌ కోసం..! కానీ ఈ పొరపాట్లు చెయ్యొద్దు..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)