Breaking News

అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..

Published on Fri, 12/05/2025 - 16:11

మహిళల సంఖ్య తగ్గిపోతోంది, బ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న గణాంకాలు గురించి విన్నాం. కానీ వీటన్నింటికి విరుద్ధంగా మహిళలు సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. అక్కడ మహిళల సంఖ్య ఎంతలా ఉందంటే..మొత్తం కార్యాలయాల్లో అంతా మహిళలే కనిపిస్తారు. కనీసం ప్లంబింగ్‌, వడ్రంగి పనులు వంటి వాటిల్లో కూడా మహిళలే ఉంటారు. అందుకు గల కారణం..?, ఫలితంగా మహిళలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే..

లాట్వియాలో గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది. అక్కడ పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్‌లో సగటు అంతరం కంటే మూడు రెట్లు ఎక్కువ. 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న పురుషులకు రెండింతలు మహిళలు ఉన్నారు. రోజువారి జీవితంలో పురుషుల కొరత చాలా ఘోరంగా ఉంటుందని వరల్డ్‌ అట్లాస్‌ పేర్కొంది. దాంతో అక్కడ మహిళ ఇంటి పనుల్లో సహాయం కోసం భర్తలను నియమించుకుంటున్నారట. 

అంటే అద్దెకు భర్తలను తెచ్చకుంటున్నారు. ఆ మహిళలంతా ఆన్‌లైన్‌లో ఒక గంటకు భర్తలను బుక్‌ చేసుకుంటారట అక్కడ మహిళలు. వారు ప్లంబింగ్‌, వడ్రండి,టెలివిజన్‌ ఇన్‌స్టాలేషన్‌ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అంతేగాదు పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్ వంటి ఇతర పనులు కూడా చేస్తారట. చాలామంది ఈ సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట. 

పురుషుల కొరతకు రీజన్‌
దీనికి పురుషుల తక్కువ ఆయుర్దాయమే కారణమని చెబుతున్నారు. అధిక ధూమపాన రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు లాట్వియా నిపుణులు. వరల్డ్‌ అట్లాస్‌ ప్రకారం లాట్వియన్‌ పురుషులలో 31% మంది ధూమపానం చేస్తున్నారట. అదీగాక వారిలో చాలామంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారట కూడా.

ఫలితంగా అద్దెకు భర్తల ట్రెండ్‌
ఇంతలా మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్‌వై పుకే మొగ్గు చూపుతున్నారట అక్కడ మహిళలు. ఇదేమీ కొత్తదికాదు ఎందుకంటే గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద తన భర్త జేమ్స్‌ను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. 

(చదవండి:  అమెరికా-భారత్‌కి మధ్య ఇంత వ్యత్యాసమా..!)
 

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌