Breaking News

అప్పుడు శత్రువు..ఇవాళ జీవిత భాగస్వామి..! ఇంట్రస్టింగ్‌ లవ్‌స్టోరీ..

Published on Mon, 08/04/2025 - 12:57

కొన్ని ప్రేమకథలు ఫన్నీగా వెరైటీగా ఉంటాయి. అసలు వీళ్లద్దరికి ఎలా కుదిరిందిరా బాబు అనేలా ఉంటాయి వారి లవ్‌స్టోరీలు. టామ్‌ అండ్‌ జర్నీలా కొట్టుకునేవాళ్లే భార్యభర్తలైతే వామ్మో అని నోరెళ్లబెడతారు అంతా. అచ్చం అలాంటి లవ్‌స్టోరీనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఒకప్పుడు ఆమెకు అతడు పరమ శత్రువు..ఇవాళ ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు.

ఫ్రెండ్‌షిప్‌డే రోజున నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ లవ్‌స్టోరీ నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆంచల్‌ రావత్‌ ఒకప్పుటి శత్రవు తన జీవిత భాగస్వామిగా ఎలా అయ్యాడో వివరిస్తూ సోషల్‌ మీడియాలో తన ప్రేమకథను షేర్‌ చేసుకున్నారు. 

ఆ పోస్ట్‌ తన భర్తతో తన కథ ఎలా ప్రారంభమైందో చెప్పుకొచ్చారు. పాఠశాల చదువుకునే రోజుల్లో తన భర్త క్లాస్‌మేట్‌ అని తెలిపింది. అయితే తాను స్కూల్‌డేస్‌లో అబ్బాయిలంటే ఇష్టపడని అమ్మాయిని అని చెప్పుకొచ్చింది. వారితో స్నేహానికి కూడా నో ఛాన్స్‌ అన్నట్లుగా ఉండేదాన్ని అని నాటి తన బాల్యాన్ని గుర్తుచేసుకుందామె. అయితే తన క్లాస్‌లో అత్యంత సిగ్గుపడు ఒక క్లాస్‌మేట్‌ తనతో భోజనం షేర్‌ చేసుకోవడానికి ప్రయత్నించాడట. 

దాంతో తనకు చిర్రెత్తికొచ్చి తన లంచ్‌​ బాక్స్‌ని విరగొట్టేసిందట. ఆ రోజు దాదాపు అతడిని ఏడిపించేంత పనిచేశానంటూ నాటి ఘటనను గుర్తుచేసుకుంది. ఆ సంఘటనతో అతడు తనతో ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదట. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఒక మ్యారేజ్‌ వెబ్‌సైట్‌ ఆ క్లాస్‌మేట్‌ని చూసిందట. అలా ఇద్దరు కలుసుకున్నారట. అప్పుడు అతడు తన ఫస్ట్‌ మెసేజ్‌లో ఆమెకు నా టిఫిన్‌ బాక్స్‌ కొనిస్తావా అని టెక్స్ట్‌ పంపించాడట. 

అలా మళ్లీ ఇరువురు కలుసుకుని పెళ్లితో ఒక్కటయ్యారట. అలా నాటి శత్రువు తన భర్తగా మారాడంటూ తన ప్రేమకథను పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేగాదు హ్యపీ ఫ్రెండ్‌షిప్‌ డే పతి దేవ్‌ అంటూ క్యాప్షన్‌ కూడా జోడించిందామె. నెటిజన్లు కూడా నాటి వైరం ప్రేమగా చిగురించిందని మాట అంటూ ఆ జంటను ప్రశంసించగా, మరికొందరూ ఊహించని విధంగా ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో చెప్పలేం అని కొందరూ కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: ఆడేద్దామా..'అష్టాచెమ్మ'..! అలనాటి ఆటల మజా..)

 

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)