Breaking News

కూతుళ్లంతా అమ్మ చీర కట్టుకుంటుంటే..ఆమె మాత్రం నాన్న..!

Published on Thu, 11/28/2024 - 09:40

అబ్బాయిలు నాన్న షర్ట్‌ వేసుకుని ‘లేని మీసాలను’ మెలి తిప్పటం, అమ్మాయిలు అమ్మ చీర కట్టుకుని ‘మోయలేని పెద్దరికాన్ని’ అభినయించటం... ప్రతి ఇంట్లోనూ ఉండేదే. ఎదుగుతున్న పిల్లలకు అవి సరదాలు. పెద్దలకు తమ టీనేజ్‌ని గుర్తుకు తెచ్చే మురిపాలు. 

పెద్దయ్యాక బాయ్స్‌ నాన్న ప్యాంటూ షర్టు వేసుకోవటం కనిపించదు కానీ, గర్ల్స్‌ అమ్మ చీరను కట్టుకుని ఏ ఫంక్షన్‌లోనో బంధు మిత్రులకు సాక్షాత్కరిస్తుంటారు. వధువులు కూడా కొందరు అపురూపంగా దాచి ఉంచిన అమ్మ పెళ్లి నాటి చీరను ధరించి, పీటల మీద కూర్చుంటారు. అదొక సెంటిమెంట్‌ కూతుళ్లకు. 

కానీ నివేషి కాస్త డిఫరెంట్‌గా ఉంది! బహుశా.. నాన్నంటే అఫెక్షన్, అమ్మంటే క్రమశిక్షణలా ఉంది ఈ అమ్మాయికి. తనేం చేసిందో చూడండి! పెళ్లినాటి నాన్న సూట్‌ను బయటికి తీయించి, చిన్న చిన్న మార్పులు చేసి తను తొడుక్కుంది. భారీ బ్రౌన్‌ టూపీస్‌ పెళ్లి సూట్‌లో ఉన్న నాన్న ఫొటోను, ఆ సూట్‌ను వేసుకున్న తన ఫొటోను కలిపి ఆ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ‘‘అమ్మాయిలు తమ తల్లి పెళ్లి చీరను కట్టుకుంటారు. 

నేను మా నాన్న పెళ్లి సూట్‌ను వేసుకున్నాను’’ అని ఆ క్లిప్‌కు క్యాప్షన్‌ పెట్టింది. ఇకనేం, లైకుల మీద లైకులు. నివేషి డిజిటల్‌ క్రియేటర్‌. తండ్రి సూట్‌ను తనకు సరిపడేలా మార్చటంలోని ఆమె సృజనాత్మక నైపుణ్యాన్ని చూసి, ‘‘మీ కోసమే మీ నాన్న తన పెళ్లి సూట్‌ను ఎంపిక చేసుకున్నట్లు న్నారు..’’ అని ఒక నెటిజెన్‌  ప్రశంసించారు. మరొకరు.. ‘‘మీరు మీ నాన్నను గర్వపడేలా చేశారు’’ అని కామెంట్‌ పెట్టారు. చలువ కళ్లద్దాలు ధరించి, సూటులో రెండు చేతులు పెట్టుకుని ఠీవిగా నడిచి వెళుతున్న నివేషి రెట్రో స్టెయిల్‌ ఎవర్నీ చూపు తిప్పుకోనివ్వటం లేదు!

 

(చదవండి:
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)