Breaking News

లక్షల జీతం వదులుకుని వెయిటర్‌గా..! ఎందుకంటే..

Published on Thu, 07/02/2026 - 11:22

కార్పొరేట్‌ ఉద్యోగాలు అంటే ఏ రేంజ్‌లో వర్క్‌ టెన్షన్స్‌ ఉంటాయో తెలిసిందే. చాలామంది ఆ ఒత్తిడి తట్టుకోలేక రిజైన్‌ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ అమ్మాయి నెట్టింట షేర్‌ చేసిన పోస్ట్‌ అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఆ కార్పొరేట్‌ ఉద్యోగం వదిలేశాక హాయిగా ఆరోగ్యంగా ఉన్నానని చేసిన పోస్ట్‌ అందరిలో తీవ్ర ఆందోళనలు లేవనెత్తింది. 

వివరాల్లోకెళ్తే..33 ఏళ్ల మహిళ మంచి కార్పొరేట్‌ జీతాన్ని వదిలి వెయిటర్‌గా మారానంటూ పెట్టిన వీడియో నెట్టింట్‌ చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్‌ ఉద్యోగం తన ఆరోగ్యాన్ని ఎలా హరించేసిందో పంచుకుంది. అంతులేని వైద్య పరీక్షలతో ఆస్పత్రులు చుట్టూ ఎలా తిరింగిందో వెల్లడించింది. తన అనారోగ్యానికి మూలం ఆ ఆరు అంకెల జీతం ఆర్జించే ఉద్యోగమే అని అనిపించి తక్షణమే మానేసి వెయిటర్‌ మారానని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. 

కానీ అంతకమునుపు ఆ కార్పొరేట్‌ ఉద్యోగం కారణంగా చివరి ఆరు నెలలు తీవ్రమైన ఐబీఎస్ (IBS - Irritable Bowel Syndrome) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే వ్యాధితో బాధపడ్డానని, దానికోసం ఆస్పత్రులు చుట్టూ ఎంతలా తిరిగిందో పేర్కొంది. చివరికి ఈ సమస్యకు ప్రధాన కారణం కార్పొరేట్‌ ఒత్తిడేనని అని తేలడంతో తక్షణమే ఉద్యోగానికి రిజైన్‌ చేశానని చెప్పింది.   ఎప్పుడైతే ఉద్యగోం మానేసానో ఆ తదనంతరం తన అనారోగ్య సమస్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. 

అంతేగాదు ఆరు అంకెల జీతాన్ని ఎప్పుడైతే వదులుకున్నానో ఆ తదనంతరం ఐబీఎస్‌ సమస్య పూర్తిగా తగ్గిందని పేర్కొది. పైగా ఆ సమస్య మళ్లీ రాకూడదనే.. ఈ ఉద్యోగంలోనే కొనసాగుతానని అంటోంది. అంతేగాదు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని తెలసుకున్నా అంటూ నవ్వుతూ నేలను తుడుస్తూ వీడియోలో కనిపించడం చూడొచ్చు. అయితే నెటిజన్లు..ఫ్యామిలీ ఉంటే కచ్చితంగా వెయిటర్‌గా బతకడం అంత సులభం కాదు. 

పైగా అక్కడున్న వారికి సర్వ్‌ చేస్తున్నప్పుడూ కూడా కస్టమర్ల నుంచి వచ్చే చీత్కారాలు, సమస్యలు ఒత్తిడికి గురిచేస్తాయని..అది కూడా ఏమంత ఆరోగ్యదాయకమైన ఉద్యోగం కాదంటూ పోస్టులు పెట్టారు. కానీ కొందరు మాత్రం నచ్చిన ఉద్యోగంలో కొనసాగితే..సంతోషం, ఆరోగ్యం రెండూ ఉంటాయంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.  

 

(చదవండి: జేఈఈ ఫెయిల్యూర్‌..ఇవాళ ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌)

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)