Breaking News

Arya Rajendran: మమ్దానీ మెచ్చిన మన మేయర్‌

Published on Fri, 06/27/2025 - 17:14

జోహ్రాన్‌ మమ్దానీ.. ప్రపంచం మొత్తం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన భారత సంతతి వ్యక్తి. న్యూయార్క్‌ నగర మేయర్‌ పదవి రేసులో అభ్యర్థిగా నిలబడిన ఈ 33 ఏళ్ల యువ నాయకుడి ప్రచార శైలి, ఎన్నికల హామీల గురించే అక్కడి జనం చర్చించుకుంటున్నారు.  ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ యువ నేత గురించి ఆయన చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

ఆర్య రాజేంద్రన్.. ఈ పేరు గుర్తుందా?. కేవలం 21 ఏళ్ల వయసులో తిరువనంతపురం మేయర్‌ పదవి చేపట్టారు. తద్వారా దేశంలోనే అత్యంత చిన్నవయసులో మేయర్‌గా ఎన్నికైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ టైంలో తన సోషల్‌ మీడియా ఖాతాలో మమ్దానీ ఈ విషయాన్ని ప్రస్తావించడం ఇప్పుడు హైలైట్‌ అవుతోంది. 

న్యూయార్క్‌కు ఎలాంటి మేయర్‌ అవసరం?.. రాజేంద్రన్‌ లాంటి నేత అవసరం అంటూ పోస్ట్ చేశారాయన. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా మమ్దానీ ఎన్నికైన తరుణంలో ఆ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.  

👉1999 జనవరి 12వ తేదీన జన్మించిన ఆర్య రాజేంద్రన్‌..  తిరువంతపురం కార్పొరేషన్‌ మేయర్‌.  నెమోం అసెంబ్లీ నియోజకవర్గం ముడవన్ముగల్ వార్డు నుంచి ఆమె ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) – CPI(M)లో ఉన్నారు. కిందటి ఏడాది తిరువనంతపురం జిల్లా కమిటీకి కూడా ఎన్నికయ్యారు. ఈమె భర్త కేరళ అసెంబ్లీకి చిన్న వయసులో ఎన్నికైన శాసన సభ్యుడు కేఎం సచిన్‌ దేవ్‌. 

2023లో ఆమె నెల వయసున్న చంటి బిడ్డతో కార్యాలయంలో పని చేసిన వీడియో బాగా వైరల్‌ కావడంతో.. ఆమెపై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో.. కిందటి ఏడాది ఓ బస్సు డ్రైవర్‌తో ఆమెకు జరిగిన వాగ్వాదం తీవ్ర విమర్శలకు దారి తీసింది కూడా.  ఇక.. న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేస్తున్న భారతీయ మూలాల జోహ్రాన్ మమ్దానీ 2020లో ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైది. “న్యూయార్క్‌కు అవసరమైన మేయర్ ఎవరు?”అంటూ ఆమెను ఉదాహరణగా చూపించారు. ఆర్య మేయర్‌గా వేస్టేజ్‌ మెనేజ్‌మెంట్‌తోపాటు ఆరోగ్య సేవల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 24/7 ఆరోగ్య కేంద్రాలు, శాస్త్రీయ వ్యర్థాల పారవేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

👉33 ఏళ్ల వయసున్న జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్‌ మేయర్‌ పదవి రేసులో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో ఈయన జన్మించాడు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్‌ రమా దువాజీ(rama duwaji). న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల ప్రచారంలో.. ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రాసరి స్టోర్లు లాంటి హామీలతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలు కూడా ఉన్నాయి. 

బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు. అంతేకాదు.. కమ్యూనిస్ట్‌ భావజాలం ఉన్న నేత అంటూ ట్రంప్‌ సహా రిపబ్లికన్లు మమ్దానీపై దుమ్మెత్తి పోస్తున్నారు.  

అయితే జోహ్రాన్‌ మమ్దానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్‌ సాంగ్స్‌, డైలాగులతో షార్ట్‌ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాను డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడాయన. నవంబర్‌లో న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే.. న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన మొదటి ముస్లిం, భారతీయ-అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)