Breaking News

మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..

Published on Sun, 03/08/2026 - 07:55

‘మీరు నలభై ఏళ్ల మైలురాయిని దాటేశారా? అయితే మీ శరీరం లోపల ఒక నిశ్శబ్ద మార్పు మొదలైందని గుర్తించండి. మనం కేవలం వినడానికి మాత్రమే చెవులను వాడుతామని అనుకుంటాం.. కానీ మనల్ని భూమి మీద నిలబెట్టే అసలైన ‘బ్యాలెన్సింగ్ రిమోట్’ మన లోపలి చెవిలోనే ఉంది. అది ఒక్కసారి రిపేరుకు వస్తే, సోఫాలో నుంచి లేచి నిలబడాలన్నా ప్రపంచమంతా గిర్రున తిరుగుతుంది. ఈ ముప్పు గురించి ఆరోగ్య నిపుణులు ఇస్తున్న హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

లోపలి చెవిలో ఏం జరుగుతోంది? 
మన లోపలి చెవిలో 'వెస్టిబ్యులర్ వ్యవస్థ' అనే ఒక అత్యంత సంక్లిష్టమైన నెట్‌వర్క్ ఉంటుంది. ఇది ఒక జీపీఎస్ (GPS) లాగా పనిచేస్తూ, మనం ఎటు తిరుగుతున్నాం, ఎలా నిలబడాలి అనే సమాచారాన్ని సెకనులో వందో వంతు కాలంలో మెదడుకు పంపిస్తుంది. అయితే, 40 ఏళ్లు దాటాక ఈ వ్యవస్థలోని సూక్ష్మమైన ‘హెయిర్ సెల్స్’ (Hair Cells) చనిపోవడం మొదలవుతాయి. అంటే మీ బాడీ బ్యాలెన్సింగ్ సిస్టమ్ తన పట్టును కోల్పోతోంది. ఫలితంగా నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పక్కకు వాలిపోవడం లేదా కళ్లు బైర్లు కమ్మడం లాంటివి జరుగుతాయి.

నడక కూడా కష్టమే!
లోపలి చెవిలో రెండు విభాగాలు ఉంటాయి: ఒకటి శబ్దాలను వినే 'కోక్లియా', రెండోది బ్యాలెన్స్‌ను చూసే 'వెస్టిబ్యులర్'. విచిత్రమేమిటంటే ఈ రెండింటికీ మెదడుకు చేరే దారి (Nerve) ఒక్కటే.. అందుకే మీ చెవిలో ఏ చిన్న సమస్య వచ్చినా అది కేవలం వినికిడి లోపంతో ఆగదు. వినికిడి తగ్గడంతో పాటు తీవ్రమైన తల తిరగడం (Vertigo), చెవిలో జోరీగ రొద పెట్టినట్లు శబ్దాలు రావడం (Tinnitus) లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో శాశ్వతంగా నడవలేని స్థితికి చేరుకునే పరిస్థతి ఏర్పడుతుంది.

ఈ మూడు ‘సైలెంట్ కిల్లర్స్’ గురించి తెలుసా?
బీపీపీవీ: మీరు పడుకుని అటు ఇటు తిరిగినా లేదా పైనున్న వస్తువు కోసం తల ఎత్తినా సెకన్ల పాటు ప్రపంచమంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది లోపలి చెవిలోని కాల్షియం కణాలు స్థానభ్రంశం చెందడం వల్ల వస్తుంది.

మెనియర్స్ వ్యాధి: చెవిలో నీరు చేరినట్లు  ఇబ్బందిగా అనిపించడం. వినికిడి మందగించడం దీని ప్రధాన లక్షణం.

వెస్టిబ్యులర్ మైగ్రేన్: విపరీతమైన తలనొప్పితో పాటు కళ్లు తిరగడం. ఇది మీ దైనందిన జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.

ఆందోళన కలిగించేలా..
శరీర సమతుల్యత కోల్పోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు. ఎక్కడ పడిపోతామో అన్న భయం మనిషిని మానసిక రోగిగా మారుస్తుంది. ఒంటరిగా బయటకు వెళ్లడానికి భయపడటం, మెట్లు ఎక్కాలంటే వణుకు రావడం వల్ల చాలామంది సామాజికంగా ఒంటరి అయిపోతారు. ఇది తీవ్రమైన ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression)కు దారితీస్తుంది. ఒకప్పుడు ధైర్యంగా నడిచిన వ్యక్తి, తన ఇంట్లోనే తాను నడవడానికి ఇతరుల సాయం కోరాల్సి రావడం అత్యంత బాధాకరంగా పరిణమిస్తుంది.

ఇప్పటికైనా మించిపోయింది లేదు!
మీకు తల తిరుగుతున్నట్లు అనిపించినా, వినికిడిలో మార్పు వచ్చినా అది వయసు రీత్యా వచ్చే నీరసం అని భ్రమపడకండి. వెస్టిబ్యులర్ రీహాబిలిటేషన్ వంటి ప్రత్యేక వ్యాయామాలు, ఆహార నియమాల ద్వారా ఈ ముప్పును తప్పించుకోవచ్చు. మీ లోపలి చెవి ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను ఇప్పుడే గుర్తించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే (చెవుల్లోనే) ఉంది!

గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించండి.

ఇది కూడా చదవండి: Women’s Day: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకూ..

#

Tags : 1

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)