Breaking News

షోయబ్‌ మూడో పెళ్లి: ఇంతకీ ఎవరీ సనా? అపుడు ఆయేషా, ఇపుడు సానియా

Published on Sat, 01/20/2024 - 15:12

పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్‌ దిగ్గజం సానిమా మీర్జాను మోసం చేశాడా? ఆమెకు అన్యాయం చేసి మూడోపెళ్లి చేసుకున్నాడా? అసలు సానియాకు విడాకులిచ్చాడా? నటి సనా జావేద్‌తో షోయబ్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌ కావడంతో ఇవే ప్రశ్నలు,చర్చలు జోరుగా నడుస్తున్నాయి.
  

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేర్లు క్రీడా ప్రపంచంలో తెలియను వారుండరు. అయితే పెళ్లిళ్ల విషయంలోవివాదంలో చిక్కుకోవడం షోయబ్‌కు ఇదే మొదటిసారికాదు.  మొదటి భార్యకు విడాకులివ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో  షోయబ్‌ మొదటి భార్య  కోర్టు కెక్కింది. 

అయేషా సిద్ధిఖీ 
సానియాతో పెళ్లికి కొన్ని రోజుల ముందు తనను మోసం చేశాడంటూ షోయబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షోయబ్‌ వ్యవహారం వెలుగులో  వచ్చింది. 2002లో పెళ్లి చేసు కున్నాడంటూ  “నిఖాహనామా” కాపీలను మీడియాకు  చూపడంతో వివాదం రాజుకుంది.  దీంతో తొలుత ఆమె వాదనను  తిరస్కరించిన షోయబ్ చివరకు ఆయేషాను వివాహం చేసుకున్నట్లు అంగీకరించాడు.  2010, ఏప్రిల్ 7న ఆమెకు విడాకులు ఇచ్చాడు.  రూ.15కోట్ల భరణం ఇచ్చినట్టు కూడా సమాచారం.  తాజాగా  శనివారం (జనవరి 20, 2024)  పాపులర్‌ పాక్‌ నటి సనా జావేద్‌తో  నిఖా చేసుకున్నట్టు షోయబ్‌ సోషల్‌ మీడియాలో  ఫోటోషేర్‌ చేయడం అందర్నీ విస్మయపర్చింది. షోయబ్‌, సనా పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

సనా జావేద్ ఎవరు?
సనా జావేద్ కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.  2012లో గ్లాయర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సనా షెహర్-ఎ-జాత్, ప్యారే అఫ్జల్, జరా యాద్ కర్, రుస్వాల్, డంక్, ఇంతేజార్ వంటి అనేక సీరియల్స్‌లో పనిచేసింది. రొమాంటిక్ డ్రామా 'ఖానీ'లో టైటిల్ రోల్‌ద్వారా బాగా  పాపులర్‌ అయింది.  సనా ప్రస్తుతం ARY డిజిటల్ డ్రామా, సుకూన్‌లో యాక్ట్‌ చేస్తోంది. 

షోయబ్ మాలిక్‌తో పెళ్లికి ముందు,  పాకిస్తానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను 2020లో వివాహం చేసుకుంది.  ఒకరికొరు 'ఖుబూల్ హై' అని చెప్పుకున్నది మొదలు వరుసగా   బ్యూటిఫుల్‌ పిక్స్‌, నిరంతరం  సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌తో  బ్యూటిఫుల్‌ కపుల్‌గా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. కొన్ని రోజులకే సడెన్‌గా వీరి పోస్ట్‌లు ఆగిపోవడం, ఆ తరువాత   2023లో   ఇన్‌స్టానుంచి   వెడ్డింగ్‌, ఈద్‌ తదితర వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇద్దరూ తొలగించడంతో  వీరు విడిపోయారనే పుకార్లు మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

అప్పుడే హింట్‌
గత ఏడాదినుంచి వీరిద్దరూ రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు ఊహాగానాలున్నాయి.  ఈ  పుకార్లు మార్చి 25, 2023న సనాకు పుట్టినరోజు సందర్భంగా మరింత ఆజ్యం పోశాడు షోయబ్‌. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో "హ్యాపీ బర్త్‌డే, బడ్డీ" అంటూ ఇద్దరు  కలిసి  ఉన్న ఫోటోలను షేర్‌ చేశాడు.  అలా షోయబ్‌ తమ ప్రేమ, పెళ్లిపై తొలి హింట్‌ ఇచ్చాడు.

సానియా ఆవేదనకు అద్దం లేటెస్ట్‌  పోస్ట్
బహుశా తన గుండె పగిలే షోయబ్‌ పెళ్లి వార్త ముందే తెలుసో ఏమో.. జీవితం అంటే అంత ఈజీ కాదు. జీవితంలో పెళ్లి, విడాకులు రెండూ కష్టమే. ఈరెండు దారుల్లో ఒకదానికి ఎంచుకోవడం మరీ  కష్టం అంటూ ఆవేదనతో ఒక పోస్ట్‌ను షేర్‌  చేసింది.

 సానియాతో పెళ్లి 
సానియా, షోయబ్‌ 2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో  పెళ్లి చేసుకున్నారు.  వీరికి  2018లో   కుమారుడు ఇజాన్  పుట్టాడు.

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)