Breaking News

సడెన్‌గా బరువు తగ్గడమే.. రోబో శంకర్‌ ప్రాణాలు తీసిందా?

Published on Fri, 09/19/2025 - 13:08

ప్రముఖ  తమిళ నటుడు-హాస్యనటుడు రోబో శంకర్ ఆకస్మిక మరణం  సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.  తన కామెడీ టైమింగ్‌, సిగ్నేచర్ 'రోబో-స్టైల్' డ్యాన్స్‌తో పాపులర్‌ అయ్యాడు.   సినిమా సెట్‌లో స్పృహ కోల్పోవడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. అయితే కేవలం 46 ఏళ్ల వయసులోనే  ఆయన  ఆకస్మిక మరణానికి గల కారణాలపై నెట్టింట​ తీవ్ర చర్చ  నడుస్తోంది.

రోబో శంకర్‌ మరణంపై వైద్యులు అందించిన వివరాల ప్రకారం, రోబోకు సంక్లిష్టమైన ఉదర వ్యాధి, తీవ్రమైన గాస్ట్రో ఇంటెస్టినల్‌  రక్తస్రావం కారణంగా ఆయన పరిస్థితి మరింత క్షీణించింది.  వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చాలా అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!

ఆకస్మికంగా బరువు తగ్గిన రోబో శంకర్  
అయితే అనేక నివేదికల ప్రకారం రోబోశంకర్ ఇటీవల కామెర్ల వ్యాధితో బాధపడ్డాడు. దీనికి అతను దీర్ఘకాలిక చికిత్స పొందాడు. చికిత్స తర్వాత గణనీయంగా బరువు తగ్గినట్లు గుర్తించారు.ఇది అతని స్నేహితులు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నెమ్మదిగా కోలుకున్నప్పటికీ, పూర్తిగా కుదుటపడకముందే అప్పటికే ఒప్పుకున్న బుల్లి తెర కమిట్‌మెంట్లను నెరవేర్చడానికి యాక్టింగ్‌ షురూ చేశాడు.   ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూయడం అటు శంకర్‌ కుటుంబ సభ్యులను, ఇటు సినీ పరిశ్రమ వర్గాలను విషాదంలో ముంచింది. ఎక్కువగా మద్యం తాగే అలవాటు,  కామెర్ల వ్యాధి, దీంతోపాటు ఉన్నట్టుండి గణనీయంగా బరువు తగ్గడం లాంటివి అతని ప్రాణాలకు చేటు తెచ్చాయని భావిస్తున్నారు.

చివరి రోజుల్లో రోబో శంకర్ భార్య ప్రియా శంకర్ రోబో శంకర్ భార్య ప్రియాంక శంకర్ అతని పక్కనే ఉన్నారు. రోబోశంకర్‌ కుమార్తె ఇంద్రజ శంకర్ కూడా నటి. అలాగే రోబో శంకర్ భార్యగానే కాకుండా, నటి మరియు ప్లస్-సైజ్ మోడల్ గా ప్రియా శంకర్ గుర్తింపు  పొందారు. ప్రియాంక 2020 లో కన్ని మాడంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది , కుక్ విత్ కోమలి సీజన్ 1 ,కలక్క పోవతు యారు సీజన్ 8 వంటి ప్రముఖ రియాలిటీ షోలలో పాల్గొన్నారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)