Breaking News

ఉల్లిపాయలు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..!

Published on Mon, 07/15/2024 - 13:03

ఉల్లి లేనిదే ఏ కూరకు రుచి రాదు. అలాంటి ఉల్లిపాయను సామాన్యుడు కొనుగోలు చేసేలా లేదు. ఏందిరా ఈ ధర అన్నట్లుగా ఉంది. ఇలాంటి టైంలో అసలు ఉల్లిపాయ లేకుండా కూరలు వండుకోవడం బెటర్‌ అనుకుంటుంటారు చాలామంది. కొందరూ ఉల్లికి దూరంగా ఉండటం లేదా వాడకం తగ్గించేస్తారు. నిజానికి ఇలా ఉల్లిపాయలు తీసుకోకుంటే ఏం జరుగుతుంది..?. మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. తదితరాలు గురించి తెలుసుకుందాం..!.

ఉల్లిపాయలకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి కంటి చూపు వరకు చాలా రకాల సమస్యలు వస్తాయంటున్ననారు నిపుణులు. సీనియర్ డైటీషియన్లు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్​లు​, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. 

ఇందులో ఎక్కువ మొత్తంలో లభించే విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్​లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, కణాల ఎదుగులకు, ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడతాయి. ఉల్లిపాయల్లో అలిసిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలతో పాటు, యాంటీ ఆక్సిండెంట్లు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా మెండుగా లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

ఉల్లిపాయలకు దూరంగా ఉంటే ఏం జరుగుతుందంటే..
ఉల్లిపాయలు తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు కనిపించకపోయినా..కొద్దికొద్ది మార్పులు కచ్చితంగా జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఉల్లిలో ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు అవసరమైన డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం వల్ల మలబద్ధకంతో పాటు జీర్ణసమస్యలు తలెత్తుతాయి.

అంతేకాదు, ఉల్లిపాయలను తినకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరిచే మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్-సీ, విటమిన్-బీ6, ఫోలేట్ లోపాలు వస్తాయి. ఫలితంగా శరీరంలో అలసట ఏర్పడి ఎర్రరక్త కణాలు పడిపోవడం, రక్తం గడ్డ కట్టడం లాంటి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కాబట్టి ఉల్లిపాయలు తినడం పూర్తిగా మానేయకుండా మితంగా తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందుకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరుకు పాటించటం ఉత్తమం. 

(చదవండి: రాధిక మర్చంట్ 'విదాయి'వేడుక..భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ!)

 

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)