వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్‌ వెల్‌నెస్‌ మంత్ర

Published on Fri, 04/24/2026 - 10:40

బరువు తగ్గడంలో పలువురు పలు విధానాలతో తగ్గించుకునే యత్నం చేస్తూ..ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నో వెల్నెస్‌ మంత్రాలు పుట్టుకొస్తున్నాయి. అలా కాంకుండా వైద్యం అందించే ఓ డాక్టరే వ్యాయామం లేకుండా 12 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సర్వసాధారణంగా డాక్టర్లు ఎంతకాదన్న చిన్నపాటి వర్కౌట్లు లేదా వాకింగ్‌ అన్న చేస్తుంటారు. కానీ ఈ డాక్టర్‌ కేలరీల బేరీజు, వ్యాయమాలతో పనిలేకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఎలా తగ్గారో తెలిపారు. అంతేగాదు అందుకోసం ఎలాంటి ఫిట్‌నెస్‌ రూల్‌ పాటిస్తే మంచిదో కూడా సవివరంగా వివరించారు. 

బరువు తగ్గడానికి సంబంధించి..డైటింగ్‌ నుంచి వర్కౌట్ల వరకు పలు టిప్స్‌ ట్రెండ్‌ అవుతున్న తరుణంలో పూణెకు చెందిన డాక్టర్ మల్హర్ గన్లా అద్భుతమైన వెల్నెస్‌ మంత్ర గురించి తెలిపారు. తాను ఆ రూల్‌ని పాటించి ఎలా 12 కిలోలు తగ్గారో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు. ఆయన తన వెయిట్‌లాస్‌ జర్నీని రక్తపరీక్షతో ప్రారంభించినట్లు తెలిపారు. 

తనకు ఫాస్టింగ్‌ ఇన్సులిన్‌ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే తనకు B12, డీ3 చాలా తక్కువగా ఉన్నాయనేది గుర్తించారు. తనకు అధికంగా ఆకలిగా ఎందుకో అనిపిస్తోంది అర్థం చేసుకోవడానికి ఈ బ్లెడ్‌ టెస్ట్‌ ఉపయోగింపడిందని చెప్పారు. ఆ వైద్యుడి మార్గదర్శకత్వంలో పోషకాహార లోపాలను సరిదిద్దుకోవడానికి సప్లిమెంట్లు, స్మూతీలు, సలాడ్లతో డైట్‌ని ప్రారంభించినట్లు తెలిపారు. 

వెయిట్‌లాస్‌ ప్లాన్‌..

జంక్ ఫుడ్ నియంత్రణ)
ఆయన పోషకాలు మెరుగుపడటం మొదలయ్యాక, ఆయన క్రమంగా ఉప్పు, చక్కెర,నూనెను మానేసినట్లు తెలిపారు. అయితే వీటన్నింటిని రాత్రికి రాత్రే మానేయలేదని, నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు బయటి భోజనంపై ఇష్టం పోవడానికి తనకు సుమారు ఒక నెల సమయం పట్టిందని కూడా అన్నారు.

కార్బోహైడ్రేట్లను తగ్గించడం
తర్వాత కార్బోహైడ్రేట్లను తగ్గించడం మొదలుపెట్టారు. ఆయన కార్బోహైడ్రేట్లను రోజుకు ఒక పూటకు (రాత్రి భోజనానికి) మాత్రమే పరిమితం చేశారు.

అల్పాహారం: ప్రోటీన్ ఆధారితం (గుడ్ల వంటివి)

మధ్యాహ్న భోజనం: పప్పు, కూర, సలాడ్ (రోటీ లేదా అన్నం వద్దు)

తాను పాటించిన డైటింగ్‌ విధానాన్ని "23-1" రూల్‌గా పిలిచారు. ఈ విధానంలో శరీరం కొలెస్ట్రాల్‌పై ఆధారపడి పనిచేస్తుందట, అలాగే ఒక గంటపాటు కార్బోహైడ్రేట్లను తీసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత తాను తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. అది కూడా స్వేచ్ఛయుతం, ఆరోగ్యప్రదంగా చేసినట్లు తెలిపారు. శరీరాన్ని కష్టపెట్టలా కాకుండా పండ్లు, ద్రవపదార్థాలపై ఆధారపడుతూ చేసినట్లు పేర్కొన్నారు. 

ఇది ఆయనకు మరింత బరువు తగ్గడానికి ఉపయోగపడిందన్నారు. కాలక్రమేణ తన ఆకలిలో పెద్ద మార్పును గమనించారు. దెబ్బకు తన నడుము చుట్టుకొలత సుమారు 29 అంగుళాలకు తగ్గిందని అన్నారు. ఇది సామాన్యులు సైతం సులభంగా అనుసరించగలిగేదని అన్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు ‍వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: వేడివేడిగా వడ్డించాలని ఎంత పనిచేశావ్‌ అమ్మ..!)

 

Videos

మా డాడీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం..

ఏకంగా 93% పోలింగ్.. రికార్డు సృష్టించిన బెంగాల్ ఓటర్లు..

సిలబస్ లో లేని ప్రశ్నలు.. లోకేష్ మళ్లీ అదే తప్పు

జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి

హార్ముజ్ లో రణరంగం.. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

మీకు గొడవలే కావాలనుకుంటే నేను రెడీ.. జక్కంపూడి మాస్ వార్నింగ్

మీకు సిగ్గనిపించడం లేదా? పోలీసులకు హైకోర్టు చీవాట్లు

RTC విలీనానికి ఓకే.. 11% పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం.. సమ్మె విరమణ

చేతికి మట్టి అంటకుండా.. మటాష్.. పెద్ద దస్తగిరి హత్యలో భారీ కుట్ర!

Photos

+5

హైదరాబాద్ : బంగారు కాంతుల్లో అందాల కాంత! (ఫొటోలు)

+5

భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)

+5

తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)

+5

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)

+5

సతీమణితో శ్రీవారిని సేవలో డైరెక్టర్ బాబీ (ఫొటోలు)

+5

రెడ్ డ్రస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ (ఫొటోలు)

+5

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

గ్లామర్‌ క్వీన్‌ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌ (ఫోటోలు)

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)