Breaking News

జూనియర్‌ ఎన్టీఆర్‌ నాలుగు నెలల్లో 15 కేజీలు..! ఎలా తగ్గారంటే..

Published on Thu, 05/21/2026 - 11:54

మే 20న టాలీవుడ్‌ హీరో, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌  పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్‌ చిత్ర నిర్మాతలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. ఆయన న్యూలుక్‌కి సంబంధించిన పోస్టర్లు అభిమానులను థ్రిల్‌కి గురయ్యేలా చేసింది. ఎంత స్మార్ట్‌ లుక్‌లో కనిపించారంటే మన హీరో తారక్‌నే కదా అనే సంభ్రమాశ్చర్యాలకు లోను చేసేలా అద్భుతమైన లుక్‌లో కనిపించారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఈ మూవీలోని తన పాత్రం కోసం ఆయన కేవలం నాలుగు నెలల్లో దాదాపు 15 కేజీలు తగ్గారని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు. అందుకోసం ఆయన ఎంతలా కష్టపడ్డారో..ఎలాంటి ఫిజికల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారంటే.!

ఆ మూవీలో హంతకుడు పాత్ర కోసం ఆయన్ను మరింత సన్నగా ఉంటే బాగుంటదని చెప్పానని అన్నారు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. ఆయన తన పాత్ర కోసం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా కష్టపడతారని అనుకున్నా కానీ ఇంతలా తను రూపురేఖల్ని మార్చుకుంటారని తాము ఊహించలేదన్నారు. 

తాను అలా స్మార్ట్‌గా అవ్వడంతో ఆయన భార్య, తల్లి తనపై చాలా కోపంగా ఉన్నారని కూడా చెప్పారు. అందుకోసమే ఎన్జీఆర్‌ నాలుగు నెలలపాటు షూటింగ్‌కి కూడా రాలేదన్నారు. ఒకానొక సమయంలో దాదాపు 15 కేజీలు తగ్గారు. అది చూసి మధ్యలోనే చాలు ఆపేయండని కోరినా..ఆయన ఆపలేదంటూ నాటి సంఘటనలు గుర్తు తెచ్చుకున్నారు. ఆ హీరో మరీ అంతలా కష్టపడటం కూడా చాలా బాధగా అనిపించిందన్నారు.

అందుకోసం ఏం చేశారంటే..
ట్రైనర్‌ డెక్కన్‌ క్రానికల్‌ ప్రకారం..స్మార్ట్‌ చురుకైన శరీరాకృతి కోసం కార్డియో- వ్యాయామాలు, రెసిస్టెన్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఉదయం 45 నుంచి 90 నిమిషాల సెషన్‌లు ఇవే చేసినట్లు తెలిపారు. అలాగే ఆహార పరంగా సాధారణంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించడానికి బదులుగా, తక్కువ ప్రోటీన్‌తో  కూడిన ఆహారాన్ని ఎంచుకున్నట్లు డైట్‌ ట్రైనర్‌ కుమార్‌ మన్నవ తెలిపారు. 

ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని ఈ విధానం సులభంగా తగ్గేలా చూసి సరికొత్త లుక్‌తో కనిపించేలా చేసిందన్నారు. ముఖ్యంగా డ్రాగన్‌ పాత్రకు అనుగుణమైన ఆహార్యంతో అందర్నీ ఆశ్చర్యపరిచారని చెబుతోంది చిత్ర బృందం. తామెవ్వరూ ఇంతలా మార్చుకుంటారని గానీ, ఇంత స్పీడ్‌గా బరువు తగ్గి స్మార్ట్‌గా మారిపోతారని ఊహిచలేదని చెబుతోంది మూవీ బృందం. 

(చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్‌ మంచిదంటే..!)
 

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్సీబీ ప్లేయర్ల ప్రాక్టీస్‌.. ఉప్పల్‌లో లాస్ట్‌ పంచ్‌ ఎవరిది (ఫొటోలు)

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)