Breaking News

109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్‌ డాక్టర్‌..!

Published on Fri, 03/13/2026 - 13:42

సుదీర్ఘ పనిగంటలు, ఒత్తిడి, వర్కౌట్ల లేమి తదితరాల వల్ల బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు స్థిరమైన అలవాట్లతోనే బరువుకి చెక్‌పెట్టగలరు. శాశ్వత ఫలితాలు కావాలనుకుంటే క్రమశిక్షణతో కూడిన స్థిరత్వం అత్యంత ప్రధానం అని చెబుతున్నారు నిపుణుల. ఇక్కడ వృత్తిరీత్యా డాక్టర్‌ అయిన ఈ డయాబెటిస్‌ డాక్టర్‌ కూడా..సుదీర్ఘ పనిగంటలతో బిజీగా ఉంటూ..వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుక్నుఆడు. ఎందరో రోగులకు బరువు తగ్గడంపై శిక్షణ ఇస్తూ..వారికి ఆరోగ్య సూచనలిచ్చే వ్యక్తి వ్యక్తిగత హెల్త్‌, జీవనశైలి సవ్యంగా లేదు. ఫలితంగా ఊబకాయం బారినపడి ఇబ్బందిపడ్డాడు. విచిత్నం ఏంటంటే తన క్లినికల్‌ అనుభవంతో సాధ్యమైనంత తొందరగానే ఆ సమస్య నుంచి బయటపడి వెయిట్‌లాస్‌ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడు ఈ అధిక బరువుని ఎలా జయించాడంటే..

ఆ డాక్టరే న్యూఢిల్లీ చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరా. వృత్తిరీత్యా అత్యంత బిజీగా ఉండటం, లేట్‌నైట్‌ మీటింగ్స్‌ తదితరాల కారణంగా సరైన ఆహారపు అలవాట్లు ఉండేవి కావు. మద్యం సేవించడం, బయట తినడం, తీపి పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. శారీరక శ్రమ అన్నదే అతని దైనందిన జీవితంలో దాదాపుగా లేదని చెప్పొచ్చు. దాంతో అతడు దాదాపు 109 కిలోల బరువుకి చేరుకున్నాడు. అది ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసింది కూడా. దాంతో అరోరా ఎలాగైనా స్లిమ్‌గా మారాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. 

అయితే వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతుల జోలికిపోకుండా..వ్యాయామం, సక్రమమైన జీవినశైలిపై దృష్టి పెట్టాడు. ఈ పద్ధతులు అతడి బాడీలోని ఇన్సులిన్‌ స్థాయిలను నియంత్రించడమే గాక, కండర ద్రవ్యరాశిని రక్షించడం, తగినంత నిద్ర పోవడం వంటి అలవాట్లతో మెరుగైన ఫలితాలు అందుకున్నారు. ప్రభావవంతమైన మార్పుతో కొద్దికాలంలోనే స్లిమ్‌గా మారిపోయాడు. అలా 72 కిలోల ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాడు. 

ఇలా బరువు తగ్గడంతో ఏ పనైనా సునాయాసంగా చేసేలా యాక్టివ్‌గా మారింది శరీరం. ఈ వెయిట్‌లాస్‌ జర్నీలో కడరాలు కోల్పోకుండా కొలెస్ట్రాల్‌ తగ్గించుకున్నానని, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరిచానని అన్నారు. అన్నీట్లకంటే ఏ మార్పు అయినా స్వీకరించేందుకు ముందుకు వచ్చినప్పడూ..స్థిరత్వంతో కూడిన సహనం, క్రమశిక్షణ చాలా అవసరమని, అప్పుడే అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలమంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు అరోరా.  

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్‌..!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)