Breaking News

144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్‌, నో ట్రైనర్‌ జస్ట్..

Published on Mon, 06/22/2026 - 17:32

ఒక పారిశ్రామిక వేత్త అత్యంత అధిక బరువుతో నరకం చూశాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఒక రోజు తీవ్ర అనారోగ్యం పాలవ్వడమే మేల్కోలుపుగా మారి..అతడి వెయిట్‌లాస్‌ పరివర్తను నాంది పలకింది. అలా ఓపికతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి సఫలమవ్వడమే గాక తనలా ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా స్లిమ్‌గా మారాలని '3ఈ' ఫిట్‌నెస్‌ సెంటర్‌ని కూడా స్థాపించాడు. అంతేగాదు అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటూ తన వెయిట్‌లాస్‌ స్టోరీని షేర్‌ చేస్తూ..ఆరోగ్య స్పృహ కలిగిస్తున్నాడు.

అతడే 'ADSMITH' వ్యవస్థాపకుడు నీరజ్‌ ఝూ. తన సంస్థ బాధ్యతలతో తలామునకలవ్వుతూ ఆరోగ్యాన్ని  నిర్లక్ష్యం చేశారు. దాంతో అతడు ఏకంగా 144 కిలోల బరువుతో ఊబకాయంతో ఇబ్బందిపడేవాడు. అలాంటి వ్యక్తి కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 65 కిలోలు తగ్గి.. సుమారు 79 కిలోల బరువుకు చేరుకున్నాడు. అయితే దీని కోసం ఎలాంటి వెయిట్‌లాస్‌ మందులు, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, జిమ్‌ వంటి వాటి జోలికి పోకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తన బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలిచాడు. అతడు తన పాత అలవాట్లకు స్వస్తి పలకాలనే దృఢమైన సంకల్పంతోనే స్లిమ్‌గా మారానని చెబుతున్నాడు. 

తాను వృత్తిపరంగా సక్సెస్‌ అందుకున్నా..అందుకు మూల్యం తన శరీరం చెల్లించాల్సి వచ్చిందంటాడు. తనకు ఆ అధిక బరువుతో అస్సలు నిద్ర పట్టేది కాదని, పైగా వొంట్లో అస్సలు శక్తి ఉండేది కాదని, చాలా ఆయాసంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే తాను కూడా అందరిలా బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు. శరీరం బాగా అలిసిపోయినట్లుగా అనిపించి, మధ్యలో స్కిప్‌ చేసేవాడినని అన్నాడు. కానీ బయట వాళ్ల నుంచి వచ్చే ఛీత్కారాలకు భయపడి మళ్లీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. 

ఐసీయూ తెచ్చిన మేల్కొలుపు..
ఒకరోజు తీవ్రం అనారోగ్య బారినపడి, ఆస్పత్రిలో చేరినప్పుడు నరకం చూశానని, నాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు. చాలాసార్లు ఆస్పత్రిలో చేరాను కానీ ఆవేళ మాత్రం​ తన పరిస్థితి ఘెరంగా ఉందని, తీవ్రమైన ఎల్‌ఆర్‌టీఐ(దిగువ శ్వాసకోశ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) కారణంగా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. 

వైద్యులు బైపాప్‌ యంత్రాన్ని అమర్చారు. అది తనకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలనే కనువిప్పుని కలగజేసిందన్నారు. అంతేగాదు చాలా ఏళ్ల తర్వాత హాయిగా నిద్రపోయినట్లు పేర్కొన్నారు. అ‍ప్పుడే తెలిసింది ఏళ్లుగా తాను ఊపిరాడక సతమతమయ్యాననని తెలుసుకున్నానని అన్నాడు. అసలు బరువు తగ్గించుకుంటే తనకు ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని తెలిసి వచ్చిందని అంటాడు నీరజ్‌. 

అయితే అందరిలా జిమ్, ట్రైనర్ల జోలికిపోకుండా ..
చాలామందిలా జిమ్‌లో జాయినవ్వడం, ఫిట్‌నెస్‌ ట్రైనర్లను పెట్టుకోవడం వంటివి చేయకుండా..ప్రాథమికంగా తాను చేయగలిగే వాటిపై దృష్టిపెట్టాడు. ముందు నిలకడగా వ్యాయామాలు చేసేలా చిన్నగా ప్రారంభించాడు. అలాగే ఆహారపరంగా కేలరీలోటు మంత్రని అనుసరించాడు. 

చిన్నగా వాకింగ్‌ మొదలుపెట్టి..నెమ్మదిగా అధిక దూరాలకు నడిచేలా కేర్‌ తీసుకున్నాడు. అలాగే పదే పదే వెయిట్‌ చెక్‌  చేయడం వంటివి కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఒత్తిడి మనల్ని ఆహారం తినేలా ప్రోత్సహిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేసినట్లు తెలిపాడు. మంచి లేదా చెడు జరిగినా కూడా..నిశబ్దంగా పరిస్థితిని అంగీకరిస్తూ..ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు. దాంతో దాదాపు 120 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు నీరజ్‌. 

అయితే ఆ తర్వాత మాత్రం తన శరీరంలో అంగుళం కడా మార్పు రాకపోవడంతో షుగర్‌కి సంబంధించిన వాటన్నింటిని దూరం పెట్టి,  అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నట్లు తెలిపాడు. అలా గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, గ్రీక్ యోగర్ట్, కూరగాయలు తీసుకోవడం వంటి మార్పులు చేసినట్లు తెలిపాడు. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించి రెండు పుల్కాలు వంటివి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే బిస్కెట్లు, అధిక చక్కెర ఉండే పండ్లకు, మద్యంకు  దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలా 18 నెలలు కష్టపడగా చివరకు 79 కేజీల బరువుకి చేరుకున్నట్లు తెలిపారు. తాను పూర్తిగా ఇదివరకటి నీరజ్‌లా రూపుదిద్దుకున్నట్లు చెప్పుకొచ్చారు 

ఆ మూడు సూత్రాల ఆధారంగా..
అలా తనలా మరింత మంది చక్కగా స్లిమ్‌గా అవ్వాలనే ఉద్దేశ్యంతో 3E ఫిట్‌నెస్‌ను స్థాపించాడు. తన జీవితాన్ని మార్చిన మూడు సూత్రాలపై ఈ వెల్‌నెస్‌ ఫ్లాట్‌ఫామ్‌ని ప్రారంభించాడు. ఆ మూడు Eలు – చెప్పేది..సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండటం. వైద్యులు సైతం ఆయన అనుసరించిన వెయిట్‌లాస్‌ జర్పీపై ప్రశంసల జల్లులు కురిపించారు. నెమ్మదిగా, స్థిరంగా బరువు తగ్గడం వల్ల శరీరం జీవక్రియ, హార్మోన్ల స్థాయి మెరుగ్గా ఉండటమే కాకుండా కండర ద్రవ్యరాశిని నిలుపుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. 

అలాగే మళ్లీ తిరిగి బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. ఎప్పుడైనా బరువు తగ్గడం అనేది మానసిక భారంలా కాకుండా..చిన్నగా వాకింగ్‌, తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెడితే సునాయాసం బరువు తగ్గగలరని చెబుతున్నాడు నీరజ్‌. ఇక్కడ కేవలం వదులుకోకుండా నిలకడతో క్రమం తప్పకుండా చేస్తే.. తప్పక సత్ఫలితాలను అందుకోగలమని, అందుకు నిదర్శనం తానేనని చెబుతున్నాడు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)