Breaking News

జస్ట్‌ రెండు నెలల్లో 12 కేజీల బరువు..! నో స్ట్రిక్ట్‌ డైట్‌, నో చీట్‌మీల్స్‌

Published on Tue, 04/07/2026 - 12:00

బరువు తగ్గడం అనేది కొందరికి సంక్లిష్టమైనది, అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కానీ కొందరికి మాత్రం సాధారణ డైట్‌తోనే అద్భుతంగా మ్యాజిక్‌ చేస్తారు. కేవలం నిలకడ, క్రమశిక్షణతో తన ఆహార్యాన్నే మార్చుకుని..స్మార్ట్‌గా బరువు తగ్గడం ఎలాగో చూపిస్తారు. ఇక్కడ ఇషాన్ కర్దే అలానే బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అదికూడా కేవలం రెండు నెలల్లో ఏకంగా 12 కేజీలు తగ్గాడు. స్ట్రిక్ట్‌ డైట్‌, కఠినమైన వ్యాయామాలు లేవు. 

ఇషాన్‌ కర్దే బరువు తగ్గడం అనేది ప్రాథమికంగా నిలకడ, సమతుల్య పోషణ, స్థిరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు. క్రమబద్ధమైన రోజువారీ ఆహారంతో శక్తి స్థాయిలను కాపాడుకుంటూనే కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చని వెల్లడించాడు. వివిధ రకాల షార్ట్‌కట్‌ డైట్‌ల వైపుకి పరిగెట్టడం కంటే..సింపుల్‌గా, ఆరోగ్యప్రదంగా తేలికపాటి వాటితోనే స్మార్ట్‌గా బరువు తగ్గొచ్చని అంటున్నాడు. తాను నాలుగు పూటలా భోజనాన్ని ఆస్వాదిస్తూనే రెండు నెలల్లో 12 కేజీల దాక బరువు తగ్గానని చెబుతున్నాడు. 

ఇషాన్‌ కర్దే తనకు ఉపకరించిన డైట్‌ప్లాన్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్ చేసుకున్నాడు. తాను డైట్‌ని 90% క్రమం తప్పకుండా పాటించానని, తీరిక లేని రోజుల్లో మధ్యాహ్న భోజనానికి బదులుగా ప్రోటీన్‌ అధికంగా ఉండే చికెన్‌ ర్యాప్‌లు/రైస్ బౌల్స్ తీసుకున్నానని చెప్పారు. అయితే చీట్ మీల్స్, చక్కెర, చిప్స్, బిస్కెట్లు వంటివి అస్సలు తీసుకోలేదని వెల్లడించాడు.

అల్పాహారం
ఈషాన్ తన రోజును ప్రోటీన్ ఓట్స్, 150 ml పాలు,  1 స్కూప్ వే ప్రోటీన్‌తో కూడిన అల్పాహారంతో ప్రారంభించేవాడు. తన భోజనంలో పోషక విలువలను విశ్లేషించి మరి తీసుకునేవాడు. దాని ప్రకారం మొత్తం  35 గ్రాముల ప్రోటీన్, 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వులు ఉండేలా కేర్‌ తీసుకున్నారు. ప్రోటీన్‌, ఫైబర్‌ ఆకలిని అదుపులో ఉంచి మధ్యాహ్నాం పూట నీరసించపోకుండా నివారించేవని అన్నారు.

మధ్యాహ్న భోజనం
ఈషాన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మిశ్రమానికే కట్టుబడి ఉంటూ, కొవ్వు శాతాన్ని కొద్దిగా పెంచాడు. అతని భోజనంలో 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లేదా పనీర్, 2 రోటీలు, తేలికపాటి గ్రేవీ, సలాడ్‌లు ఉన్నాయి. ఈ భోజనం నుంచి 50 గ్రాముల ప్రోటీన్, 45 నుంచి 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 నుంచి 12 గ్రాముల కొవ్వు అందుతుంది.

సాయంత్రం స్నాక్స్‌..
అతను సాయంత్రం ఒక పండు, గుప్పెడు నట్స్‌, 5 గుడ్డు తెల్లసొన తీసుకునేవాడట. ఇలా తింటే  22 నుంచి 24 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు లభిస్తాయి.

రాత్రి భోజనం
రోజులో చివరి భోజనంగా, ఈషాన్ తేలికపాటి ఆహారాన్ని తీసుకున్నాడు. అతను 200 గ్రాముల చికెన్ లేదా పనీర్ సలాడ్ తీసుకున్నాడు, దీనిలో 45 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు ఉంటాయి. 

అంతేగాదు బరువు తగ్గేందుకు ఎల్లప్పుడూ కష్టతరమైన ఆహారనియమాలు, తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని ఈషాన్ వెయిట్‌లాస్‌ జర్నీ రుజువు చేస్తోంది. పైగా ఒక సాధారణ దినచర్యను క్రమంతప్పకుండా పాటించడం అనేది అత్యంత కీలకమని నొక్కి చెబుతోంది కూడా.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు)

 

 

Videos

అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?

బ్రోకర్ రాధాకృష్ణ నీకు కూతుర్లు లేరా.. RK రోజా వార్నింగ్

CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...

చెప్పుతీసి కొడతా... ABN రాధా కృష్ణపై రెచ్చిపోయిన తిరుపతి YSRCP మహిళా నేత

ఇక గ్యాస్ సిలెండర్ ధర 4000 రూపాయల పైమాటే

రేవంత్ సర్కార్‎పై IASల అసహనం

పెళ్లి పీటలు ఎక్కనున్న అనుపమ?

మహిళలని చూడకుండా... దురుసుగా ప్రవర్తించిన పోలీసులు

నిధులు అన్ని అమరావతిలో పెడితే మా ప్రాంతాల పరిస్థితేంటి..

కూటమి ప్రభుత్వం వేస్ట్.. రాజీనామాకు రెడీ

Photos

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)