Breaking News

ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..!

Published on Thu, 06/26/2025 - 12:52

వెయిట్‌ లాస్‌ జర్నీలలో చాలామంది తమ కిష్టమైన హాబీలతోనూ..ఇతరులను స్ఫూర్తిగా చేసుకుని తగ్గారు. కొందరూ ప్రోటీన్‌ డైట్‌ ఫాలో అయితే..మరికొందరు అనారోగ్య భయంతో బరువు తగ్గారు. కానీ ఈ న్యూట్రిషన్‌ కోచ్‌ తాను ఎందువల్ల బరువు పెరిగానో కారణాలను విశ్లేషించి ఆ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ బరువు తగ్గింది. పైగా తనలా ఎవ్వరూ ఆ తప్పులు చెయ్యొద్దని, దాని వల్ల కలిగే అనర్థాలేంటో వివరిస్తూ..ప్రేరణగా నిలిచింది. ఆమె కొన్ని నెల్లల్లోనే స్లిమ్‌గా మారి బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించింది. 

ISS సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్ కోచ్ రక్షా భలవి  ఒకప్పుడామె దాదాపు వంద కిలోలు పైనే బరువు ఉండేది. ఊబకాయం సమస్యతో చర్మం, జుట్టు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం ఆమెకున్న జంక్‌ఫుడ్‌ వ్యనసం. దాదాపు ప్రతిరోజు చిప్స్‌, చాక్లెట్లు లేకుండా ఆమె రోజు ఉండేది కాదు. అలా ఆమె 116 కిలోలు బరువుతో ఇబ్బందులు పడింది. 

తన ఆకృతి కారణంగా ఎదుర్కొన్న బాడీ షేమింగ్‌లు, మరోవైపు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలతో బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యింది. ఎలాంటి క్రాష్‌డైట్‌లు జోలికిపోకుండా పోషకాహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. ముందుగా ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ.. తన బరువులో వస్తున్న మార్పులను గమనించింది. అలాగే తాను స్కూల్‌ డేస్‌లో మధ్యాహ్న భోజనానికి పరాఠాలు తినడంతో ఎలా తాను బరువు పెరిగింది అర్థం చేసుకుంది. 

దానిలో ఉండే అధిక కార్బ్, అధిక కొవ్వు గలిగిన ఆహారం బొడ్డు కొవ్వుకు కారణమవుతుందని తెలుసుకుంది. అందుకనే తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. సమతుల్య ఆహారాలకే పెద్దపీటవేసి..ఫైబర్ కోసం పండ్లు, ప్రోటీన్ కోసం గుడ్లు లేదా పనీర్, కార్బ్‌ల కోసం గోధుమ రోటీ లేదా బ్రెడ్‌ వంటివి తీసుకునేది. అలాగే తాను చదువుతున్నప్పుడూ బాగా ఒత్తిడికి గురయ్యేది. అందువల్ల తాను తెలియకుండా ఎలా ఎక్కువగా ఫుడ్‌ తీసుకుందో కూడా చెప్పుకొచ్చింది రక్ష. 

అలాగే అధిక ఉప్పు, చక్కెరతో ఉండే స్నాక్స్‌కి దూరంగా ఉండేది. వాటి బదులు మఖానా, తాజా పండ్లతో స్నాక్స్‌ని భర్తీ చేసింది. అలాగే రోజంతా శారీరక శ్రమ లేకుండా ఉండటాన్ని నివారించింది. స్క్రీన్‌ సమయాన్ని తగ్గించుకుని.. ఆటలు లేదా వ్యాయామాలకు సమయం కేటాయిస్తూ..మానసికంగా ఉల్లాసంగా ఉండేలా చూసుకునేది. 

చివరగా తాను చెడ్డ ఆహారపు అలవాట్ల వల్లే బరువు పెరుగుతున్నానని చాలా ఆలస్యంగా గ్రహించానని, తనలా మరెవ్వరూ చెయ్యొద్దని సూచిస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తి శాకాహారి. అలాగే తన డైట్‌ప్లాన్‌ని కూడా షేర్‌ చేసుకున్నారామె.

(చదవండి: Nozempic Diet: 130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్‌చేస్తే..)

ఆ కోచ్‌ ఏమి తీసుకునేదంటే..

ఉదయం: చియా సీడ్ నీరు

వ్యాయామం చేయడానికి ముందు: 7 నానబెట్టిన బాదం, 10 గ్రా వేరుశెనగ 

వ్యాయామం తర్వాత: ప్రోటీన్ పౌడర్ పానీయం (1 స్కూప్),  1 గిన్నె మస్క్మెలోన్ 

భోజనం: స్టైర్-ఫ్రైడ్ క్యాప్సికమ్‌తో గిన్నె క్వినోవా టోఫు

రాత్రి భోజనం: 2 బేసన్ చీలాస్, 1 కప్పు పప్పు, 100 గ్రా క్యాబేజీ సబ్జీ, 1 ప్లేట్ దోసకాయ-క్యారెట్ సలాడ్, 30 గ్రా కాల్చిన సోయా ముక్కలు 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఏకంగా..!)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)