Breaking News

WE Reach వినూత్నంగా వీ రీచ్‌

Published on Fri, 06/20/2025 - 15:33

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఉన్న వ్యాపార సామర్థ్యాన్ని వెలికితీయడం, దానిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నగరంలోని ‘వీ హబ్‌’ (ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ హబ్‌) మరో సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా వ్యాపారం నిర్వహించాలనుకునే మహిళల స్టార్టప్‌ ప్రయాణానికి దోహదపడే ప్రీ–ఇంక్యుబేషన్‌ ప్రోగ్రామ్‌ ‘వీ రీచ్‌’ గురువారం హబ్‌ వేదికగా అధికారికంగా ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హరి చందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీ రీచ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార ఔత్సాహికులైన మహిళలకు ఈ ఆధునిక వ్యవస్థకు అనుగుణంగా విభిన్న అంశాల్లో అవగాహన కల్పించనున్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా టైర్‌–2, టైర్‌–3 ప్రాంతాల్లో నిర్వహించిన  డిస్ట్రిక్ట్‌ బూట్‌ క్యాంప్‌ల ద్వారా 120 మంది మహిళలను ఎంపిక చేసి పారిశ్రామికవేత్తలుగా రెండు బ్యాచ్‌లుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం వ్యాపార ఆలోచనకు అంకుర దశ నుంచీ వ్యాపారం స్థాపించే దశ వరకూ సమగ్ర మద్దతు అందించేందుకు రూపొందించారు. ఇందులో బిజినెస్‌ స్కిల్స్‌పై శిక్షణ, ఆర్థిక–డిజిటల్‌ లిటరసీ, మెంటార్‌íÙప్, ఎక్స్‌పోజర్‌ విజిట్‌లు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ఫార్మలైజేషన్‌కు అవసరమైన సహకారాన్ని అందించడం వంటి కార్యక్రమాలుంటాయి. వీటివల్ల మహిళలు తమ సొంత వ్యాపారాన్ని స్థాపించి దాన్ని స్థిరంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు పొందుతారు. 

ఇదీ చదవండి: నో డైటింగ్‌, ఓన్లీ జాదూ డైట్‌ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!

దీర్ఘకాలిక మార్పుకు నాంది.. వీ రీచ్‌
వీ రీచ్‌ కార్యక్రమ ప్రారభోతవం సందర్భంగా కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కలిగించడం, వారి సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. ‘వీ రీచ్‌’ వంటి కార్యక్రమాలు మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడమే కాకుండా, సమాజంలో దీర్ఘకాలిక మార్పుని తీసుకురాగల సామర్థ్యం కలవని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి సహకార కార్యక్రమాలు పెరగాల్సిన అవసరముందన్నారు. 

ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్‌ హీరో

వీహబ్‌ సీఈఓ సీత పల్లచొల్ల మాట్లాడుతూ.. ఈ మూడు నెలల ప్రోగ్రాంలో వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకున్న మహిళలు అవసరమైన బిజినెస్‌ రిజి్రస్టేషన్లు సమకూర్చుకొని తమ వ్యాపార యూనిట్లను లాంఛనప్రాయంగా ప్రారంభించి ఆర్థిక పరిపుష్టి వైపు బాటలు వేస్తారని పేర్కొన్నారు. వీ హబ్‌ దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన మొట్టమొదటి ఇంక్యుబేటర్, నోడల్‌ సంస్థ అని అన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)