Breaking News

శ్రావణం స్పెషల్‌ ఇంపాక్ట్‌ ఫెయిర్‌–మినీ ఎడిషన్‌

Published on Thu, 08/14/2025 - 10:39

హైదరాబాద్‌ నగరంలోని వీ హబ్‌ వేదికగా నిర్వహించిన వినూత్న కార్యక్రమం ‘ఇంపాక్ట్‌ ఫెయిర్‌–మినీ ఎడిషన్‌’ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంప్రదాయం, సృజనాత్మకత, మహిళా వ్యవస్థాపకత– ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వీ హబ్‌ ఆధ్వర్యంలో శ్రావణం స్పెషల్‌గా ‘ఇంపాక్ట్‌ ఫెయిర్‌–మినీ ఎడిషన్‌’ను నిర్వహించింది. మహిళా వ్యవస్థాపకులకు విలువైన అమ్మకాల అవకాశాలు, ప్రత్యక్ష మార్కెట్‌ లింకేజీలను అందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులకు తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. 

రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి దాదాపు 30 మంది మహిళా వ్యవస్థాపకులు, స్థానిక చేతివృత్తుల వారు ఒకచోట చేరి వారి కళాత్మక, సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా అద్భుతమైన చేనేత, హస్తకళలు, పండుగ దుస్తులు, నగలు, ప్రామాణికమైన తెలంగాణ ఆహారాలు, స్నాక్స్‌–స్వీట్లు, గృహాలంకరణ వస్తువులను ఇక్కడ ఉంచారు. 

వీ హబ్‌ సీఈఓ సీతా పల్లచోళ్ల మాట్లాడుతూ.. ఇది ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది మహిళల సంస్థ, మహిళా శక్తి. ఈ సంస్కృతి సమాజ స్ఫూర్తికి ఒక వేడుక అని తెలిపారు. ప్రతి మహిళా వ్యవస్థాపకురాలు తన నేపథ్యం లేదా స్థానంతో సంబంధం లేకుండా ఈ కమర్షియల్‌ మార్కెట్లకు ప్రాప్యత పొందేలా చూసుకోవడమే తమ లక్ష్యమన్నారు. 

(చదవండి: Independence Day 2025: ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)