Breaking News

ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్‌లు, పేస్ట్రీలు ఉండవు..

Published on Fri, 10/17/2025 - 16:42

టెస్లా అధినేత, టెక్‌ బిలియనీర్‌ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపర కుభేరుడు, ఎలాన్‌ మస్క్‌ వ్యవస్థపక విజయాలన్నీ..కొత్త వ్యాపారం చేయాలనుకునేవారికి మార్గదర్శకం. అలాంటి టెక్‌ దిగ్గజం ఒక 'బేకరీ'ని కూడా నడుపుతున్నట్లు మీకు తెలుసా..!. అయితే ఆ బేకరీలో కేక్‌లు, పేస్ట్రీలు, బ్రెడ్‌లు ఉండవు ఉండవు. మరీ ఏం తయారవుతాయంటే..

ఈ బేకరీ స్టార్‌షిప్‌ అంతరిక్ష నౌకలో ఉపయోగించే సిరామిక్‌ హీట్‌ షీల్డ్‌ టైల్స్‌ తయారు చేస్తుంది. చలా జాగ్రత్తగా రూపొందించే ఈ టైల్స్‌ పదునైన షడ్భుజాకారాల్లో ఉంటాయి. అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండే ఉష్ణోగ్రతలో అంతరిక్ష నౌకను రక్షిస్తాయి. వీటి ష్ణోగ్రతలో కొన్నిసార్లు 1,400 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంటుందట. 

ఆ నేపథ్యంలోనే వీటికి ప్రత్యేకమైన డిజైన్ ఉంది. ఇందులో సంక్లిష్టమైన పిన్ అటాచ్‌మెంట్‌లు, చిన్న విస్తరణ అంతరాలు ఉంటాయి. ఇవి పగుళ్లు లేకుండా వంగడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తాయి. ప్రతి స్టార్‌షిప్‌కు 18,000 షడ్భుజాకార టైల్స్ అవసరం. ఇవి నల్లటి బోరోసిలికేట్ గాజుతో పొరలుగా ఉన్న అధునాతన సిలికా-ఆధారిత సిరామిక్స్‌తో నిర్మిస్తారు. దీనిలో వేసే ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తికి చేరుకునే ప్రక్రియకు సుమారు 40 గంటలు పైనే పడుతుందట. ఈ బేకరీ ప్రతిరోజు వేలాది టైల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. 

ఆ పేరే ఎందుకంటే..
ఇక్కడ టైల్స్‌ కఠినమైన బేకింగ​ ప్రక్రియకు లోనవ్వుతాయి కాబట్టి. బ్రెడ్‌ను తయారు చేసినట్లుగానే ఈ ప్రత్యేకమైన టైల్స్‌ని అధిక ఉష్ణోగ్రత వద్ద సంపూర్ణ ఏకరీతి నిర్మాణాంలోకి వచ్చేలా చేస్తారు. ఇదంతా ఎందుకంటే.. అంతలా చేస్తేనే అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైన ధరలో లభించేలా చేసేందుకు దోహదపడుతుంది 

ఇది ఎలాన్‌ మస్క్‌ కలల వెంచర్‌.  అలాగే ఈ స్టార్‌షిప్‌ని ఇంతల బేక్‌ చేయడం వల్లే చంద్రుడు, భూమి, అంగారక గ్రహాలపై బహుళ రీ ఎంట్రీలు, ల్యాండింగ్‌లు నావిగేట్‌ చేసేటప్పుడూ తీవ్ర ఉష్ణోగ్రతలను ఈజీగా తట్టుకుంటుందట. 

 

(చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సక్సెస్‌..కానీ ఐఏఎస్‌ వద్దని..)
 

 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)