Breaking News

'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్‌ బోర్డుల నుంచి...

Published on Mon, 06/30/2025 - 15:58

ఎన్నో విలాసవంతమైన భవనాలను చూసి ఉంటారు. ానీకానీ ఇలాంటి విలాసవంతమైన ఇంటిని మాత్రం చూసుండరు. మహా అయితే ఇన్ని అంతస్థుల భవనం, కట్టిపడేసే లగ్జరీయస్‌ ఫర్నీచర్‌లు తదితర విశేషాలతో ఉన్న బంగ్లాలనే ూచూశాం. కానీ ఈ ఇల్లు వాటన్నింటిని తలదన్నేలా అత్యంత విలాసవంతంగా అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఆ ఇంటిని తిలకిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. 

కంటెంట్‌ క్రియేటర్‌ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక విలాసవంతమైన బంగారంతో అలకరించి ఉన్న లగ్జరీయస్‌ ఇంటిని సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ ఇంటి లోపల ఫర్నిచర్‌ నుంచి ఎలక్ట్రిక్‌ స్విచ్‌బోర్డుల వరకు ప్రతీది స్వచ్ఛమైన బంగారంలా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసినవే అట. 

కంటెంట్‌ క్రియేటర్‌ సరస్వత్‌ అంతటి ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యంగా తిలకిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.  ఆ భవనంలో మొత్తం పది బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఇంటి ప్రాంగణంలో గోశాల నుంచి మొదలై.. ఎంట్రన్స్‌లో 1936 వింటేజ్ మెర్సిడెస్ కారు నుంచి పలు విలాసవంతమైన కార్ల సేకరణ కనిపిస్తుంది. అంతేగాదు ఆ ధనవంతుడి సక్సెస్‌ జర్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 

తమ కుటుంబంలో మొత్తం 20 మంది సభ్యులం ఉండేవాళ్లమని, అందరికీ ఒకే ఒక పెట్రోల్‌ బంక్‌ ఆధామని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆ ధనవంతుడికి అర్థమైపోయిందట ఏదోరకంగా కష్టపడకపోతే తన మనుగడ ప్రశ్నార్థకమై పోతుందని. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ కాంట్రాక్టర్‌షిప్‌లోకి ప్రవేశించారట. అలా ప్రభుత్వ రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మించే తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 

ప్రస్తుతం సుమారు 300 గదుల హోటల్‌ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, అందుకు సంబంధించిన వీడియోకి "భారతదేశంలోని ఇండోర్‌లో బంగారంతో అలంకరించబడిన ఇల్లు" అనే క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశారు కంటెంట్‌ క్రియేటర్‌ సరస్వత్‌. నెటిజన్లు అంతటి విలాసవంతమైన ఇంటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరూ లక్ష్మీపుత్రుడు, అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: 'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)