Breaking News

సర్కారీ స్కూల్‌లో చదివాడు..కానీ ఇవాళ ఏకంగా..!

Published on Tue, 01/20/2026 - 15:46

వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఎప్పటిలానే ఈసారి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకు వచ్చారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు స్ఫూర్తిని రగిలించే ప్రేరణాత్మక స్టోరీలను షేర్‌ చేసే ఆనంద్‌ మహీంద్రా ఈసారి టాలెంట్‌కి సంబంధించిన ఆసక్తికర కథను పంచుకున్నారు. కార్పోరేట్‌ స్కూల్‌లో చదివినంత మాత్రాన టాలెంట్‌ వాడి  సొత్తు కాదని..సాధారణ స్కూల్‌లో చదవిన వాడు కూడా టాలెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తారని చెప్పే గొప్ప కథ..!.

భారతదేశంలోని సవాళ్లే మనలోని ప్రతిభకు, ఆవిష్కరణలకు కేంద్రం అని చెబుతున్నారు ఆనంద్‌ మహీంద్రా. అదే మనల్ని మాత్రమే కాదు యావత్తు భారత దేశాన్ని ప్రపంచం ముందు విజేతగా నిలబెడుతోందని అంటూ ఓ మహోన్నత వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. తమిళనాడులో ఓ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదవిన వేలు సామీ ఇవాళ మహీంద్రా ఆటోమోటివ్‌ వ్యాపార టీమ్‌కి హెడ్‌గా సారథ్యం వహిస్తున్నాడు. 

అతడి ప్రయాణం తన కంపెనీలో చాలా చిన్నగా ప్రారంభమైందని..అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పుకొచ్చారు. ఆయన తన బృందంతో కలిసి కొత్త మహీంద్రా XUV 7XOలో డావిన్సీ డంపింగ్ టెక్నాలజీని పరిచయం చేశాడని, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదని అన్నారు. ఆనంద్‌ ఆప్యాయంగా 'వేలు గురు'గా పిలిచే అతడు అన్నా విశ్వవిద్యాలయం నుంచి ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ సీటుని తమిళనాడు నామక్కల్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యా నైపుణ్యంతో సాధించాడని చెప్పారు. 

మహీంద్రాలో జూనియర్‌ ఇంజనీర్‌గా చేరి..ఇవాళ ఏకంగా టెక్నాలజీ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ అయ్యాడని, అలాగే గతేడాదే ఆయన మహీంద్రాలో ఆటోమోటివ్‌ బిజినెస్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యాడని తెలిపారు. స్వదేశ ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ కంపెనీ ఆర్‌ అండ్‌ డీ బృందాలు వేలు ప్రయాణాన్ని పరిచయం చేశాయి. మన స్వదేశీ ఇంజనీర్లు నేర్చుకోవాలనే ఆకలితో ఉన్నారని, అందువల్లే నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటున్నారు, పైగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిని పరిచయం చేస్తున్నారంటూ..మనవాళ్ల టాలెంట్‌ని, ప్రతిభని కొనియాడుతున్నారు. 

అంతేగాదు భారతదేశాన్ని ఒక ప్రతిభ కర్మాగారంగా అభివర్ణిచారు కూడా. అంతేగాదు 1991లో, ఆర్థిక వ్యవస్థ తెరుచుకున్నప్పుడు ప్రపంచ కన్సల్టెంట్లు భారతీయ కంపెనీలకు "సహాయం చేయమని" ఎలా సలహా ఇచ్చారో గుర్తు చేసుకుంటూ..మహీంద్రా గ్రూప్  ఆ దిశగానే ముందుకు సాగుతోంది. ఇంకా ఇక్కడే ఉన్నాం, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ ప్రపంచ స్థాయి సాంకేతికతో సేవ చేసేందుకు సదా ఆరాట పడుతోంది మా గ్రూప్‌ అని చెప్పుకొచ్చారు.

 కాగా, వేలు సామీ 1996లో మహీంద్రాలో జాయిన్‌ అయ్యారు. పవర్‌ట్రెయిన్ అభివృద్ధిలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ..అత్యాధునిక M-హాక్ ఇంజిన్‌ల వెనుక ఉన్న దార్శనికుడిగా పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మహనీయుడు కూడా.  ది ఆల్ న్యూ థార్, XUV700, స్కార్పియోన్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ ఉత్పత్తుల ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ లీడర్‌ ఆయన.

(చదవండి: 73 ఏళ్ల​ తాత గారి సిక్స్‌ప్యాక్‌ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..)

 

Videos

TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ

సాత్విక వీరవల్లి హీరోయిన్ గా ఎంట్రీ..

జగన్ పై తప్పుడు రాతలు ఆంధ్రజ్యోతి పేపర్ ను తగలబెట్టిన YSRCP

బీఆర్ఎస్ VS పోలీస్ .. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద హైటెన్షన్

ఏ క్షణమైనా యుద్ధం.. రంగంలోకి ఫ్రాన్స్, జర్మనీ బలగాలు

అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్..

రక్తం కారేలా కొట్టుకున్న TDP, జనసేన కార్యకర్తలు

Varudu: బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యండన్న వారిని ఎందుకు నడిరోడ్డుపై నడిపించలేదు..

నీ అబ్బా సొమ్ము అనుకుంటున్నావా? లోకేష్ పై నిప్పులు చెరిగిన సతీష్ రెడ్డి

చంద్రబాబుపై కేసులు ఎందుకు కొట్టేశారు? హైకోర్టు ఆగ్రహం

Photos

+5

సీతాకల్యాణం చేసిన 'బిగ్‌బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)

+5

2016లో సారా టెండుల్కర్‌ ఇలా.. పోస్ట్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

ఫ్యాషన్ ..అదిరెన్: కనువిందు చేసిన ఫ్యాషన్ షో (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

వాఘా బోర్డర్‌లో 'ధురంధర్' బ్యూటీ (ఫొటోలు)

+5

సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న పూజిత పొన్నాడ -ఎంత బాగుందో! (ఫొటోలు)

+5

అల్లు అర్జున్ ఫ్యామిలీ.. జపాన్ ట్రిప్‌లో ఇలా (ఫొటోలు)

+5

టిల్లుగాని పోరీ.. మతిపోయే గ్లామరస్‌గా (ఫొటోలు)

+5

'శుభకృత్ నామ సంవత్సర' మూవీ ఈవెంట్‌లో పవిత్ర, నరేష్‌ (ఫోటోలు)

+5

టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)