Breaking News

జపాన్‌లో శాకాహారమా..? సలాడ్‌లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..

Published on Tue, 05/06/2025 - 13:11

అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్‌. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్‌ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్‌వెజ్‌ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్‌లు స్టోర్స్‌లో దొరికే సలాడ్‌లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్‌లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్‌ నటి బర్ఖాసింగ్‌. ఇంతకీ జపాన్‌లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..

జపాన్‌లో  ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్‌. 

చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్‌ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్‌ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్‌. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్‌ మెత్తటి చీజ్‌కేక్, కస్టర్డ్ నిండిన పాన్‌కేక్‌లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కాగా, బాలీవుడ్‌ నటి, మోడల్‌ బర్ఖాసింగ్‌ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్‌. 

 

(చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జరీ..! జస్ట్‌ 15 రోజుల్లేనే మిస్‌ వరల్డ్‌ వేదికకు..)
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)