Breaking News

ప్లీజ్‌ శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు..! పాపం ఆ 26 ఏళ్ల మహిళ..

Published on Tue, 07/28/2026 - 13:57

గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్‌పై అవగాహన కల్పిస్తున్న టెక్సాస్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ చివరి సందేశం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె కన్నీటి కథ నెటిజన్లను కదిలించింది. అంతేగాదు తనలా మరెవ్వరూ అలాంటి అనారోగ్య సమస్య బారిన పడకూడదని చివరి క్షణాల వరకు పడిన తపన ప్రతిఒక్కర్ని కదిలిస్తోంది. అంతేగాదు ప్రజలదర్నీ శరీరం విషయంలో బీకేర్‌ఫుల్‌గా ఉండమని కోరుతూ పంపిన సందేశం ఆ వ్యాధిపై అందరికీ అవగాహన ఉండాలనే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇంతకీ ఎవరా మహిళ?, ఏ వ్యాధి గురించి ఇంతలా ఆమె మాట్లాడారు అంటే..

గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది టెక్సాస్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ అలోండ్రా సియెర్రా. ఆమె తన మరణానికి ముందు వరకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అంతేగాదు వ్యాధిని ముందుగా గుర్తిస్తే..ఎంత బిగ్‌ రిలీఫ్‌ ఉంటుందో వివరించింది. అది మన మనుగడకు ఎంత కీలకమో కూడా నొక్కి చెప్పింది. 

సియెర్రా కేవలం 19 ఏళ్ల వయసులో నుదిటిపై మచ్చ ఏర్పడటం గమనించింది. కాలక్రమేణా, అది లేత రంగు నుంచి ముదురు రంగులోకి మారింది. కానీ అది కేన్సర్‌ కాగలదని ఎప్పుడూ ఊహించలేదు. ముఖ్యంగా మెలనోమా వచ్చే అవకాశం ఉందని కలలో కూడా ఊహించలేదని అంటోంది. కానీ ఈ ఏడాది చివరి నాటికి ఈ చికిత్స తను తీసుకున్నప్పటికీ.. విజయవంతం కాలేదని తెలిపింది. అంతేగాదు తనలా మరెవ్వరు ఈ వ్యాధి బారినపడకూడదనే ఉద్దేశ్యంతో గత నాలుగేళ్లుగా సూర్యరశ్మి నుంచి రక్షణ, క్రమం తప్పని చర్మ పరీక్షల ప్రాముఖ్యత గురించి సోషల్‌ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తోంది. 

హానికరమైన యూవీ కిరణాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రోత్సహిస్తోంది కూడా. అలాగే కృత్రిమ యూవీ మూలాలతో ఉన్న ప్రమాదాల గురించి కూడా మాట్లాడారామె. అలాగే ఇలాంటి వాటిన బారినపడకుండా తీసుకోవాల్సిన చర్చలు, ముందస్తు పరీక్షల గురించి కూడా అవగాహన కల్పించే యత్నం చేసింది. అంతేగాదు తగ మే నెలలో మెలనోమా అవగాహన మాసం పురస్కరించుకుని పంచుకున్న వీడియో ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. ఆ వీడియోలో సియెర్రా.. "నివారణ అనేది మనుగడకు సంబంధించిన విషయంగా అభివర్ణించింది. ఈ నెల వేడుకలకు ప్రతీక అయితే ఎంత బాగుండును, కానీ బదులుగా మనుగడకు ప్రతీకగా నిలుస్తోంది. 

దురదృష్టవశాత్తు, ప్రస్తుతం ఇదే నా వాస్తవికత. చాలామందికి మే 1వ తేదీ, మెలనోమా అవగాహన మాసం ప్రారంభం. అలాగే మరో నెల మాత్రమే. నాకు మాత్రం, ఇది నివారణ, ఇది ప్రచారం. ఇది జీవితం, ఇది మనుగడ అని భావోద్వేగంగా మాట్లాడింది వీడియోలో". తన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్నా..తానెలాగో ఈ వ్యాధిని ముందుగా గుర్తించలేకపోయానని..కనీసం ఇతరులకకైన సహాయపడాలని..ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. 

అన్ని వయసుల వారు తన చర్మాన్ని జాగ్రత్తగా గమనించాలని చెప్పింది. పుట్టుమచ్చ రంగు, ఆకారం, పరిమాణంలోని తేడాలను నిర్లక్ష్యం చేయొద్దని కోరిందామె. ఒకవేళ ఆలస్యం చేస్తే..తల నుంచి చెవుల వెనుక వరకు..అలాగే రొమ్ము, పాదాలు, జననాంగాల వరకు ఎలా వ్యాపిస్తుందో వివరిస్తూ..తన సంభాషణను ముగించింది. కానీ అదే ఆమె చివరి వీడియోగా మిగిలింది. ఎందుకంటే..స్టేజ్‌ 4 మెలనోమా కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసి ఈ నెల జూలె 17న మరణించింది. 

మందుగా ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటే..
ఈ మెలనోమాను ముందుగా గుర్తించే హెచ్చరిక సంకేతాల కోసం చర్మవ్యాధినిపుణులు ABCDE అనే నియమాన్ని అనుసరించమని సూచిస్తున్నారు.  

A - అసమానత

B – అంచులలో క్రమరాహిత్యం

C - రంగులో వైవిధ్యం

D - 6 మి.మీ కంటే పెద్ద వ్యాసం

E – పరిమాణం, ఆకారం లేదా రంగులో మార్పులు

కాగా సియెర్రా..అధునాతన కేన్సర్‌తో పోరాడుతున్నప్పటికీ, జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను జరుపుకుంది. ఆమె 2024లో కళాశాల నుంచి పట్టభద్రురాలైంది, అదే ఏడాది ఆ వ్యాధి తన శరీరం అంతటా వ్యాపించిందని తెలుసుకుంది. ఈ ఏడాది మార్చిలో, రేడియేషన్ చికిత్స పూర్తి చేసిన కొద్ది రోజులకే, ఆమె అమెరికా పౌరసత్వం పొంది మరో కలను నెరవేర్చుకుంది. 

అంతేగాదు తన కథ ద్వారా, ఇతరులు కూడా తమ చర్మంలో అనుమానాస్పద మార్పులను ముందుగానే గుర్తించి, ఆలస్యం కాకముందే వైద్య సలహా తీసుకోవాలని సియెర్రా ఆశించింది. చివరి వరకు ఆమె ఆ లక్ష్యం కోసమే పోరాడిందని కన్నీటి పర్యంతమైంది ఆమె కుటుంబం. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలను వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: హీర్‌ అజిత్‌ డైట్‌ సీక్రెట్‌..! ఆఖరికి పోషకాహార నిపుణుల సైతం..)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)