Breaking News

'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!

Published on Wed, 08/26/2026 - 12:10

మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే ఆగస్టు 23న జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో జరిగిన సంగతి విధితమే. ఈ అందాల పోటీకి మాజీ మిస్‌ యూనివర్స్‌​ ఇండియా ఊర్వశి రౌతేలా, భారత్‌ తొలి మిస్‌ యూనివర్స్‌ సుష్మితా సేన్‌, మిస్‌​ యూనివర్స్‌ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త, చిత్ర నిర్మాత ప్రజ్ఞా కపూర్‌, మిస్‌ యూనివర్స్‌ రన్నరప్‌ సెలీనా జైట్లీ తదితదరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఊర్వశి త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న దుస్తులను ఎంచుకుందామె. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 

పలువురు భారత జెండాను దుస్తులుగా ధరించడం లేదా జెండాను నేరుగా దుస్తులపై ముద్రించడం వంటివి జాతీయ జెండా నియమావళిని ఉల్లఘించినట్లే అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. అంతేగాదు చాలామంది ఇలా చేసి ఉండకూడదు, ఇది సరైనది కాదంటూ తిట్టిపోశారు కూడా. మరికొందరైతే...భారత జెండా నియమావళి గురించి ప్రస్తావిస్తూ.. దాన్ని ఉల్లంఘిస్తే పడే శిక్షలు, చట్టం గురించి కూడా మాట్లాడారు. మరి ఆ వ్యాఖ్యలపై మాజీ మిస్‌ యూనివర్స్‌ ఇండియా ఊర్వశి రౌతేలా ఏమన్నారంటే. 

అది యథావిధి ప్రతిరూపం కానే కాదు..
తను తన దేశాన్ని కేవలం ఒక జాతీయతగా మాత్రమే కాకుండా, గుర్తింపులో భాగంగా భావిస్తాను. తాను ఎక్కడ నుంచి వచ్చానో ప్రజలకు తెలియజేయడానికే ఈ కౌచర్‌ని ఎంచుకున్నట్లు తెలిపారు. "దీని ఆకృతి, రంగుల కలయిక, అందులో వివరాలు కేవలం ఫ్యాషన్‌గా రూపొందించినవే. ఇది ఒక జాతీయ భావనను కళాత్మక వ్యక్తీకరణగా మార్చడం గురించి. అలాగే ఈ గౌనుకి భారత జాతీయ పతాకానికి చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి. 

నిజానికి ఈ గౌను ఏమి జాతీయ పతాకానికి ఏమి యథాతథ ప్రతిరూపం మాత్రం కాదు. ఇది జస్ట్‌ త్రివర్ణ పతాకం నుంచి ప్రేరణ పొందిన అంశాలను ఉపయోగించి డిజైన్‌ చేసిన గౌను మాత్రమే". అని నొక్కి చెప్పారు ఊర్వశి. ఈ గౌనులోని మూడు రంగులు, మధ్యలోని చక్రం వంటివి జాతీయ జెండాలోని మూలాంశాలతో ఫ్యాషన్‌ని చూపించే ప్రయత్నం చేశామే తప్ప జెండా నియమావళిని అస్సలు ఉల్లంఘించలేదని కరాఖండీగా చెప్పారు. 

పైగా ఇవి నిలువు రంగులు, మధ్యలో ఉన్న చక్రం ఒక ఆభరణంలా మాత్రమే ధరంచానని అlhleరు. ఇది జాతీయ పతాకంలా కాకుండా స్టేజ్ లైట్ల కింద ఒక ఆకర్షణీయమైన ఫ్యాషన్ వేర్‌లా ప్రజెంట్‌ చేశానని అంటోంది. అలాగే ఈ గౌనులోఉన్నది అసలైన కాషాయరంగు కాదు, అలాగే ఆకుపచ్చరంగు కూడా వేరొక ఛాయలో తీసుకున్నార. అలాగే మధ్యలోని చిహ్నం అధికారిక నిర్దేశాలను అత్యంత భిన్నం అని వివరించారు. కాగా, ఈ డిజైనర్‌వేర్‌ని డాషా ఫ్యాషన్ కౌచర్‌కు చెందిన బెలారసియన్ డిజైనర్ డార్యా చెర్మాషెంట్సేవా రూపొందించారు.

జాతీయ  జెండా నియమావళి..

2002, జాతీయ జెండా వినియోగానికి సంబంధించిన నియమ నిబంధనలను వివరిస్తుంది.

జాతీయ గౌరవానికి అవమానాలను నివారించే చట్టం, 1971 ప్రకారం, జెండాను ఏ విధమైన దుస్తులు లేదా యూనిఫాంలో భాగంగా ఉపయోగించరాదు, అలాగే దానిని కుషన్లు, చేతి రుమాళ్లు, నాప్‌కిన్‌లు లేదా ఏ ఇతర వస్త్ర సామగ్రిపైన ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్ చేయరాదు.

ఈ చట్టం ఇంకా ఇలా పేర్కొంటుంది, జెండాని ఉద్దేశపూర్వకంగా నేలను తాకడానికి లేదా నీటిలో ఎగరడానికి అనుమతించరాదు.

జాతీయ జెండాను కట్ చేసి కుట్టకూడదు.

జాతీయ జెండాను నడుము కింది భాగంలో చుట్టుకోవద్దు. 

జెండాను అలంకరణ కోసం ఉపయోగించకూడదు. చేతులు తుడుచుకోవడం లాంటివి చెయ్యకూడదు. 

జాతీయ పతాకాన్ని ఏ వస్తువు మీదా కప్పవద్దు. దేశం కోసం ప్రాణాలు విడిచిన వారిపై కప్పడానికి జాతీయ జెండా అంత గౌరవాన్ని జవాన్ కు దక్కడానికే ఇలా చేస్తారు.

చిరిగిన, నలిగిన, తిరగబడిన జెండాలను ఎగురవేయొద్దు.

జాతీయ పతాకాన్ని ఎగరేసినప్పుడు.. అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు.

అలాగే వేదికపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేటప్పుడూ..జెండా ఎగురవేసే వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు, త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతడి కుడివైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

(చదవండి: సుస్మితా సేన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు..! ఊర్వశి రౌతేలా అలా కనిపించడానికి రీజన్‌)

Videos

నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?

మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు

నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు

జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి

"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!

కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్

బ్యాంక్‌ అకౌంట్‌లో పొరపాటున రూ.68 కోట్లు జమ.. ఖాతాదారునికి షాకిచ్చిన బ్యాంక్

నేపాల్ వరదలు.. AIలో చూడండి!

రవితేజ సార్ ఒక బాహుబలి.. నక్షత్ర క్యూట్ పొటాటో... Teacher అంటే స్వాసికానే..!

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)