Breaking News

భారతీయ అవుట్‌ఫిట్‌లో ఈయూ చీఫ్‌ ఉర్సులా ..!

Published on Tue, 01/27/2026 - 15:58

భాతర 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌ హాజరయ్యిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వేడుకలో తన వేషధారణతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో సిగ్నేచర్‌ టైలర్డ్‌​ ప్యాంట్‌సూట్‌లకు పేరుగాంచిన ఈయూ చీఫ్‌ ఉర్సులా మెరూన్-అండ్-గోల్డ్ బ్రోకేడ్ బంద్‌గాలా విత్‌ ఆఫ్-వైట్ ప్యాంట్‌లో కనిపించారు. భారతీయ శైలిలో వచ్చి..ఈ వేడుకను మరింత అందంగా మార్చారామె. భారతీయ సంస్కృతిపట్ల గౌరవాన్ని, అలాగే ఈ వేడుక ప్రాముఖ్యతన ఉర్సులా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. 

సాంప్రదాయపు గుర్రపు బగ్గీలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియోలస్ శాంటోస్ డా కోస్టాతో కలిసి కర్తవ్య పథ్‌కు చేరుకోవడానికి కొన్ని క్షణాల ముందు, చీఫ్ ఉర్సులా సోషల్‌ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు. "ఈ రిపబ్లిక్‌ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉండటం అనేది తన జీవితకాల గౌరవం. 

విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది. తద్వారా మనందరం ప్రయోజనం పొందుతాం." అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, 2019లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. 

ఆమె జూలై 2024లో రెండవసారి ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. 2029లో జరిగే యూరోపియన్ ఎన్నికల వరకు కమిషన్‌కు నాయకత్వం వహిస్తారు. పైగా యూరోపియన్ కమిషన్‌లో తన పదవీకాలానికి ముందు, వాన్ డెర్ లేయెన్ 2005 నుంచి 2019 వరకు జర్మనీ సమాఖ్య ప్రభుత్వంలో పనిచేశారు. ఈ సమయంలో ఆమె కుటుంబం, యువజన, కార్మిక, రక్షణ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించి, పాలన, ప్రజా సేవలో విస్తృతమైన అనుభవాన్ని పొందారు.

 

(చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..)

 

Videos

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

100 మంది 10 నిమిషాల్లో. కడపలో TDP చేసిన విధ్వంసం

Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే

YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు

నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్

Photos

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ సావిత్రి బేబీ బంప్‌ స్టిల్స్ (ఫొటోలు)

+5

మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు