Breaking News

భారత్‌ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్‌ ఇంతలా మారిపోతుందా..?

Published on Tue, 09/23/2025 - 13:29

భారతీయవ్యక్తిని పెళ్లాడటంతోనే ఇంతలా మారిపోతానని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా ఈ మార్పుని అస్సలు ఊహించలేదంటోంది ఓ విదేశీ మహిళ. చాలామంది విదేశీ వనితలు భారత్‌ అబ్బాయిలను పెళ్లాడి, ఇక్కడి కట్టుబొట్టుకి ఆకర్షితులై తమ లైఫ్‌స్టైల్‌నే మార్చుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల కోవలోకి తాజాగా ఈ ఉక్రెయిన్‌ మహిళ కూడా చేరింది. ఎవరామె? అంతలా ఏం మార్చుకుందామె అంటే..

ఉక్రెయిన్‌ మహిళ విక్టోరియా చక్రవర్తి భారతీయ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టక ముందు, ఆ తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను వివరిస్తూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది. అది నెట్టింట వైరల్‌గా మారి, నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఆమె ఆ వీడియోలో తన డ్రెస్సింగ్‌ స్టైల్‌ నుంచి భారతీయ ఆహారం, స్థానిక పండుగల వరకు ప్రతీది ఎలా తన జీవితంల భాగమైందో తెలిపింది. అలాగే తన జీవింతంలోకి వచ్చిన ఈ మార్పులతో వెల్లివిరిసిన ఆనందం, జాయ్‌నెస్‌ గురించి కూడా చెప్పుకొచ్చింది. ప్రధానంగా ఆ మూడు మార్పులు తన జీవితంలోకి భాగమయ్యేలా స్వాగతించానని అంటోంది. 

అవేంటంటే..

చీర నెమ్మదిగా తన వార్డ్‌రోబ్‌లో భాగమైంది. అది లేకుండా ఏ పెళ్లికి లేదా ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటం ఊహించలేం అన్నంతగా..

చేతులతో సాంప్రదాయ ఆహారాన్ని తినడం, చాలా సహజంగా అనిపిస్తుంది. 

ఏడాదిలో నాకు కొన్ని పండుగలు ఇష్టమైనవిగా మారిపోయాయి. వేడుకల గొప్పదనం, ఆ సంబరం కలిగించే ఆనందం తన మదిలో స్థిరంగా ఉండిపోడమే కాదు సంతోషాన్ని తెచ్చిపెట్టాయని అంటోంది. 

అందుకు తగ్గట్టుగా ధరించే భారతీయ దుస్తులు అదరహో అనేలా ఉంటాయిని ప్రశంసించింది. 

అలాగే విక్టోరియాలో భారత్‌లోనే గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు చెప్పుకొచ్చింది. చాలామంది తనను భారత్‌కి వెళ్లొద్దని సూచించారని, కానీ ఇక్కడకు రావడంతో తన జీవనశైలి మారిపోవడమే కాదు, ఎన్నో ఆనంద క్షణాలకు నెలవుగా మారిపోయిందని సంతోషంగా చెబుతోందామె. నెటిజన్లు కూడా భారతీయ దుస్తులు చాలా అందంగా కనిపిస్తున్నారని, మా సంస్కృతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు. 

అలాగే దాన్ని ఇష్టపడతున్నందుకు మరింత సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, విక్టోరియా తను ఇండియాకు రావడాన్ని అందరూ వ్యతిరేకించినా..అక్కడి నుంచే మనకు కొత్త అధ్యయనం ప్రారంభమవ్వడమే కాదు, కొంగొత్త విషయాలు తెలుసుకుంటామని అంటోంది.

 

(చదవండి: భారత్‌లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు)

 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)