Breaking News

Ugadi 2025 అంబరాన్నంటిన ఉగాది సంబరాలు

Published on Mon, 03/31/2025 - 11:25

ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉగాది (Ugadi2025) సంబరాలు (మరాఠీ ప్రజలు జరుపుకునే పండగా గుడిపడ్వా) అంబరాన్ని అంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది వేడుకలను కనులపండువగా నిర్వహించారు. ముఖ్యంగా హిందూ నూతన సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ఇతర కార్యక్రమాల ద్వారా నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మరాఠీ ప్రజలు ఉగాది పండుగ రోజును గుడిపడ్వాగా జరుపుకుంటారు. మరోవైపు ఈ సందర్భంగా తెలుగు ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉగాది పచ్చళ్లు తయారు చేయడంతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను ఏర్పాటు చేయగా మహారాష్ట్ర ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయ పద్ధతుల్లో ఉగాది (గుడిపడ్వా)ను జరుపుకున్నారు. 

ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు గుడిపడ్వా రోజున ఓ కర్రకు రాగిచెంబును బోర్లించి దానిపై నూతన వస్త్రం, మామిడి కొమ్మలు, చక్కెర పాకంతో తయారు చేసే చక్కెర బిల్లల హారాలతో అలంకరిస్తారు. వాటిని ఇంటి ముందు, ఎత్తైన స్థలాల్లో కడతారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిని ‘గుడి’లుగా పేర్కొంటారు. ఇలాంటి ‘గుడి’లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా నూతన సంవత్సరానికి సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. ముఖ్యంగా ముంబైలోని గిర్‌గావ్, థానే, డోంబివలి, పుణే, నాగ్‌పూర్‌లతో పాటు అనేక ప్రాంతాల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు శోభాయాత్రలు ఊరేగింపులు నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సంగీత వాయిద్యాలు వాయించడంతోపాటు సంప్రదాయమైన దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు నృత్యం చేశారు. అదే విధంగా ఈ యాత్రలలో బైకులు, అశ్వాలు కూడా కని్పంచాయి. మరోవైపు భారీ రంగోళి (ముగ్గులు)లు వేశారు. రథయాత్రల ద్వారా అనేక అంశాలపై సందేశాలిచ్చే ప్రయత్నం చేశారు.  

ముంబైలో... 
ముంబైలోని గిర్‌గావ్, దాదర్, కాందివలి తదితరాలతోపాటు అనేక ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. ముఖ్యంగా గిర్‌గావ్‌లో ఉదయం నిర్వహించిన శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గిర్‌గావ్‌ శోభాయాత్రలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బైకులు, బుల్ల్‌ట్‌లపై సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు. దాదర్‌లో సంప్రదాయ దుస్తులతో మహిళలు కత్తులను తిప్పుతూ చేసిన విన్యాసాలు అందిరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ములూండ్‌లో కూడా ఈ సారి శోభాయాత్ర జరిగింది.  

థానేలో... 
థానేలో కౌపినేశ్వర్‌ ఆలయం ఆధ్వర్యంలో మాసుందా జలాశయం (తలావ్‌పాలి) వద్ద శనివారం రాత్రి దీపోత్సవం జరిగింది. దీన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు థానే, డోంబివలి ఫడ్కేరోడ్డుపై బైకుల ర్యాలీలతోపాటు బ్యాండు మేళాలతో శోభాయాత్ర జరిగింది. ముఖ్యంగా డోంబివలిలో అనేక సందేశాలతో ర్యాలీలు నిర్వహించారు.   

ఆలయాల్లో భక్తుల కిటకిట.. 
ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇదే తరహా ముంబై, థానే, డోంబివలి, పుణే, భివండీలతోపాటు రాష్ట్రంలోని మందిరాల్లో భక్తుల సందడి కని్పంచింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవుళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలోని ముంబాదేవి ఆలయంతోపాటు అనేక ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)