Breaking News

శభాష్‌ శంకర్‌! పదిహేనేళ్ల వయస్సులోనే ఏఐ స్టార్టప్‌గా..

Published on Fri, 08/02/2024 - 09:36

ఇష్టానికి కష్టం తోడైతే చిన్న వయసులోనే పెద్ద విజయం సాధించవచ్చు... అని చెప్పడానికి ఉదాహరణ కేరళలోని ఎర్నాకుళంకు చెందిన ఉదయ్‌ శంకర్‌. పదిహేనేళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్‌ మొదలు పెట్టి ఔరా అనుకునేలా చేశాడు. ఇప్పటి వరకు 10 ఏఐ యాప్‌లు, 9 కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్, 15 రకాల గేమ్స్‌ డిజైన్‌ చేశాడు..

బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్‌ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్‌.‘ యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది. ఏఐ  స్టార్టప్‌ ‘ఉరవ్‌’తో మరో అడుగు ముందు వేశాడు.

కోచిలో జరిగిన అంతర్జాతీయ జెన్‌ఏఐ సదస్సులో ఉదయ్‌శంకర్‌ స్టార్టప్‌ ‘ఉరవ్‌’కు సంబంధించి ఎగ్జిబిషన్‌ ప్రత్యేక ఆకర్షణగా మారింది. చిన్న వయసులోనే రోబోటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు ఉదయ్‌. అది పాషన్‌గా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. కోవిడ్‌ కల్లోల సమయంలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. సమయాన్ని వృథా చేయకుండా ఆన్‌లైన్‌లో పైథాన్‌ప్రోగామింగ్‌ నేర్చుకున్నాడు. యాప్‌ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టు సాధించాడు.

ఒకరోజు తన బామ్మకు కాల్‌ చేశాడు ఉదయ్‌. ‘కొద్దిసేపటి తరువాత నీకు ఫోన్‌ చేస్తాను’ అని ఫోన్‌ పెట్టేసింది బామ్మ. అంతవరకు వేచి చూసే ఓపిక లేని ఉదయ్‌ బుర్రలో ‘బామ్మ డిజిటల్‌ అవతార్‌’ను సృష్టించాలని, ఆ అవతార్‌తో ఏఐ ఉపయోగించి మాట్లాడాలనే ఐడియా తట్టింది. ఆ ఐడియాను సాకారం చేసుకున్నాడు. బహిరంగ ప్రదేశాలలో వృద్ధులకు ఉపకరించే ‘థర్డ్‌ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్‌.‘యస్, మా వాడు సాధించగలడు’ అనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగింది.

ఏఐ స్టార్టప్‌ ‘ఉరవ్‌’ మరో అడుగు ముందు వేశాడు. ఏఐ రిమోట్‌ టీచర్‌ మిస్‌ వాణి, ఏఐ పర్సనలైజ్‌డ్‌ మెడికల్‌ అండ్‌ క్లినికల్‌ అసిస్టెంట్‌ మెడ్‌ఆల్కా, ఏఐని ఉపయోగించి ఫొటో నుంచి 3డీ ఇమేజెస్‌ సృష్టించే మల్టీటాక్‌ అవతార్‌ ఏఐ సూట్‌... మొదలైనవి కంపెనీ ్రపాడక్ట్స్‌. తండ్రి డా.రవి కుమార్, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన తల్లి శ్రీకుమారి ఉదయ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను  సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్‌ శంకర్‌.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)