దుబాయ్‌ బిలియనీర్‌ బంపర్‌ ఆఫర్‌..! పెళ్లికి రూ. 12 లక్షలు, పిల్లలు కంటే..

Published on Thu, 01/29/2026 - 17:57

దుబాయ్‌ షేక్‌ ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ చూస్తే షాకవ్వుతారు. జస్ట్‌ పెళ్లి చేసుకుంటే రూ. 12 లక్షలు. పిల్లలు కంటే మరో రూ. 12 లక్షలు ఇస్తామని సోషల్‌ మీడియా ఎక్స్‌లో కళ్లుచెదిరే ఆఫర్‌ ప్రకటించారు దుబాయ్‌లోని బిలియనీర్ వ్యాపారవేత్త ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూ సోషల్‌ మీడియా పోస్ట్‌లో. వివాహం, కుటుంబాన్ని పోషించడం వ్యక్తిగత విషయాలు కాదని అవి సామాజిక బాధ్యతలని పిలుపునిస్తూ..తన అల్ హబ్తూర్ గ్రూప్‌లోని ఎమిరేట్‌ ఉద్యోగులకు ఈ ఆఫర్‌ అందిస్తూ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. 

"కుటుంబాలే బలమైన దేశానికి కీలకమని, పిల్లలు దేశ భవిష్యత్తులో పెట్టుబడి అని అన్నారు. మా ప్రభుత్వాలు యువకుల కుటుంబ జీవితాలు ప్రారంభంలో మద్దతివ్వడానికి వెనకడుగు వేయవు. అందువల్ల యుఏఈ జాతీయులు వివాహం చేసుకుని కుటుంబాన్ని పెంచుకునేలా ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరి నుంచి ఆచరణాత్మక చొరవలు కూడా అవసరంర. కుటుంబాలు నిర్మించడం అనేది ఉమ్మడి బాధ్యత అని, కుటుంబం చిన్నదైనా లేదా పెద్దదైనా సమాజం, దేశం భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది." అని అన్నారు. 

కాగా,  ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్టూర్ UAE వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ అండ్‌ దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ కంపెనీకి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో దుబాయ్ కమర్షియల్ బ్యాంక్ ఛైర్మన్‌గానూ, అల్ జలీలా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్‌గా, అలాగే  UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు.

గతేడాది అక్టోబర్‌లో, అల్ హబ్టూర్ యువకులను వివాహం చేసుకోవాలని కోరారు. అంతేగాదు ఆయన యువకులు 30 ఏళ్లలోపు వివాహం చేసుకునేలా ప్రోత్సహించే చట్టం కోసం ఆశిస్తుండటం గమనార్హం. వివాహం చేసుకోకుండా ఉండిపోయిన యువకులను జవాబాదారీగా ఉంచాలని కూడా అన్నారు. ఇది సమాజంలో మనుగడకు, ఐక్యతకు సంబంధించిన విషయం అని అన్నారు. కుటుంబాలే దేశానికి కీలకం అంటూ అందర్నీ ఆలోచింపచేసేలా ఆయన ఈ షేకింగ్‌ ఆఫర్‌ ఇచ్చారు.

 

(చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?)

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)