Breaking News

Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..

Published on Mon, 06/09/2025 - 10:50

చిన్నా, పెద్దా తేడా లేకుండా  చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.  అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.  ఎత్తు,  వయసుకి తగ్గట్టుగా బరువు ఉండటం చాలా అవసరం. ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీపీ గుండె జబ్బులు, మధుమేహం  లాంటి జబ్బులను దూరంగా ఉంచుతాయి. కాబట్టి ఆరోగ్యంగా, చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయంగా ఉండాలంటే దినచర్య సవ్యంగా ఉండాల్సిందే.

 

కొన్ని ముఖ్యమైన సూత్రాలు 
సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేలేత  సూర్యకిరణాలు మన శరీరానికి తాకిడే,  చక్కటి డి విటమిన్‌ అందుతుంది.  యోగా, నడక లాంటి వ్యాయామం చేయాలి. ఇది రక్త ప్రవాహం సాఫీగా సాగిపోవడానికి మేలుచేస్తుంది. అంతేకాదు రోజంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. 

నిర్దిష్ట సమయాల్లోనే  భోజనం చేయాలి. అదీ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. 

ఉపాహారం అస్సలు వాయిదా వేయొద్దు. రాత్రి నిద్రకు ముందు అతిభోజనం వద్దు.సరిపడినన్ని నీళ్లు తాగాలి.

స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు ఎక్కువగా అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి.  

ముఖ్యంగా రోజుకు 10వేల అడుగులు  వేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. 

నిమిషానికి 80 అడుగులు నడిస్తే సాధారణం. నిమిషానికి 100 అడుగులు నడుస్తుంటే మధ్యస్థం

నిమిషానికి 120 అడుగులు నడిస్తే.. అది వేగవంతమైన చురుకైన నడక. ఇది అత్యంత ప్రభావవంతమైనది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది వారి వారి ఆరోగ్య పరిస్థితి, సామర్థ్యం ఆధారంగా నిర్ధారించుకోవాలి. 

రాత్రికి రాత్రికే బరువు తగ్గాలనే అత్యాశతో  అవగాహన లేని షార్ట్‌ కట్  పద్దతులు, లేని పోని డైటింగ్‌లను ఆశ్రయించకూడదు ఇది ఒక్కోసారి ప్రమాదం కూడా. శరీర తత్వాన్ని అవగాహన చేసుకొని ఓపిగ్గా ప్రయత్నిస్తే  విజయం సాధించడం తథ్యం. 

 నోట్‌: ఏదైనా అనారోగ్య  సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)