Breaking News

బాడీషేమింగ్‌ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!

Published on Thu, 11/06/2025 - 10:26

మామూలుగానైతే భార్య మొబైల్‌ నంబరును సేవ్‌ చేసుకోడానికి ‘జానూ’, ‘సోనా’ అనో లేదా ‘బంగారం’ అనో... ఇలా రకరకాల ముద్దు పేర్లు పెట్టుకుంటుంటారు. మరికొందరు శిరీషకు ‘సిరి’ అనీ, దీపికకు ‘దీపూ’ అంటూ షార్ట్‌కట్‌లో షార్ట్‌ పేర్లూ పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. 

కాపురంలో కొద్దికాలం గడిచాక ఆమెలో నచ్చని అంశాలేవైనా కనిపించినా సదరు  ముద్దుపేర్లకు బదులుగా తన కోపాన్నీ, కసినీ సైలెంటుగా వెల్లడించుకునేలా ‘దెయ్యం’ అనో, ‘రాక్షసి’ అంటూ వయొలెంటు పేర్లు పెట్టుకోవాలనుకున్నా అలా చేయకపోవడమే మంచిదంటూ టర్కీలో జరిగిన ఓ ఉదంతం తెలుపుతోంది. 

టర్కీలో ఓ ప్రబుద్ధుడికి భార్య మీద కోపం వచ్చింది. ఆమె కాస్తంత లావుగా ఉండటంతో ఆమె పేరును ‘టాంబిక్‌’ అంటూ సేవ్‌ చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అంతే... ఆ అంశం మీద అతడికి జరిమానా విధిస్తూ... అతడి వల్ల తన భార్యకు కలిగిన మనోవేదనకు గాను పరిహారం, విడాకులూ మంజూరయ్యాయి. 

ఇంతకీ ‘టాంబిక్‌’ అంటే టర్కీలో స్థూలకాయాన్ని (ఛబ్బీ) తెలిపే పదం. ఇది కేవలం స్థూలకాయాన్ని సూచించే పదం మాత్రమే కాదు... ఏ ‘బండ’దనో, ‘మొద్దు’దనో, ‘లడ్డు’దనో... ఇలా కాస్తంత దురర్థమో, నిందార్థమో ఇచ్చేలాంటి వాడుక మాట కావడంతో... అలా సేవ్‌ చేసుకున్న ఆ భర్తకు కోర్టులో మొట్టికాయలు తప్పలేదు. పైగా ఓ అమ్మాయి స్థూలకాయాన్ని ఎగతాళి చేసేలా ఆమె పేరును అభ్యంతరకరమైన పదాలతో సేవ్‌ చేసుకున్నందుకు ఆ భర్తకు భారీ జరిమానా విధించింది అక్కడి కోర్టు. 

అంతేకాదు.. పరోక్ష దూషణే అయినా... ఫోన్‌లో అలాంటి అభ్యంతరకరమైన మాటతో భార్యపేరు సేవ్‌ చేసుకున్నందున ఆమెకు కలిగిన మనోవేదనను పరిగణనలోకి తీసుకుని వెంటనే విడాకులు సైతం మంజూరు చేసింది టర్కీ కోర్టు.  

(చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!)

#

Tags : 1

Videos

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

చంద్రబాబు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు కరకట్టపై యాంకర్ ఈశ్వర్ సంచలన నిజాలు

బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్

KGH: విద్యుత్ సరఫరా నిలిచిపోయి పనిచేయని వైద్య పరికరాలు

భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలప డానికి సిద్ధం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?

"పుష్ప ది ఎపిక్" కమింగ్ సూన్..

Disha: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. ప్రభాస్ వల్ల నేను కంట్రోల్ తప్పా..!

ఆ ఒక్క మాటతో బండ్ల గణేష్ కు ఇచ్చి పడేసిన అల్లు అరవింద్..!

Photos

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)