Breaking News

అలంకారం శరీరానికా? వ్యక్తిత్వానికా?

Published on Thu, 07/30/2026 - 08:46

అలంకారాలు అంటే కళ్ళు జిగేలుమనిపించేలా కనిపించడం కాదండోయ్‌ ఇక్కడ.. అలాగే తళుక్కుమనే ఆభరణాలు బంగారం, వెండి గూర్చి కూడా కాదు... మనిషికి సహజంగా ఉండవలిసిన నిజమైన అలంకారం ఆభరణాలు గూర్చి శతకాల్లో చెప్పిన బంగారు మాటలు నెమరువేసుకుందాం.

ఈ మాటలవిలువ ఏ మూటలతో లెక్క కట్టలేం...
భర్తృహరి రాసిన సంస్కృత శతకానికి ఎంతో దగ్గరగా స్వేచ్ఛానువాదం చేసిన ఏనుగు లక్ష్మణకవి ఒక పద్యంలో...
‘అమరుజెవి శాస్త్రమున గుండలముగాదు
వలయమున నొప్ప, దీవి చే వెలయుబాణి
యురుదయాడ్యుల మేను పరోపకార
కలన రాణించు గంధంబు వలనకాదు’.

కుండలాలు, బంగారు కడియాలు, గంధం – ఇవన్నీ అలంకారాలు కావుట. ధర్మశాస్త్ర శ్రవణమే చెవులకు అలంకారం. నిరంతరం దానం చేసిన చేసిన చేతులకు మిలమిల మెరిసే కడియాలు ఆభరణం కాదు. దయాగుణం కలవారికి సుగంధద్రవ్యాలు /గంధపు పూత అలంకారం కాదు.

ఇంకా లోతులోకి వెళ్తే సత్పురుషులకు వారి గుణాలే అలంకారాలు. బాహ్యంగా తళుకులు, మెరుపులు అక్కర్లేదు..
ఇదే కవి మరో పద్యంలో
‘కరమున నిత్యదానం, 
ముఖంబన సూనత వాణి, ఔదలం
గురుచరణాభివాదన, 
ముకుంఠిత వీర్యం దోర్యుగంబునన్‌
వరహదయంబునన్‌ విశదవర్తన, 
మంచిత వీనులన్‌
సురుచిరభూషణంబు లివి 
శూరులకు సిరి లేనియప్పుడున్‌’....

ఐశ్వర్యం లేనప్పుడు మహాత్ములకు సహజ అలంకారాలు ఏమి ఉండాలో చెప్తూన్నాడు, ఏనుగు లక్ష్మణ కవి. అవి ఏమిటంటే
దానం, సత్యాన్ని పలకడం, గురువు గారికి నమస్కరించే గుణం, ఎదురు లేని పరాక్రమం, మంచి ప్రవర్తన శాస్త్ర శ్రవణం... ఇవన్నీ... కంకణాలు, కిరీటం, కుండాలాలు బయట తాత్కాలిక సౌందర్యన్నే కలిగిస్తాయ్‌. స్థిరమైన శాశ్వతమైన అంతరమైన సౌందర్యం కలగాలంటే సద్గుణాలుండాలి.

‘నిజమైన ఆభరణాలు, అలంకారాలు’ గురించి శతక కవులు బంగారాన్ని కాదు, గుణాలనే ఆభరణాలు అని అన్నారు.
వేమన గారు బాహ్య అలంకారాలను ఖండించి, అంతరంగ శుద్ధినే అసలైన అలంకారం అన్నారు.

పసిడి కుండలములు చెవులకు
పసిడి హారములు మెడకు భాసిల్లును గాని
మంచి మాటలు లేకున్న
పశువుతో సమానమగును పార్థివా వేమా
అర్థం: చెవులకు బంగారు కమ్మలు, మెడకు హారాలు ఉన్నా, నోట మంచి మాటలు లేకుంటే పశువుతో సమానం.
మరో పద్యం చూడండి

అంగడి సరుకుల వలెనా
అలంకారములెల్ల కొనగ అందుబాటగునా
సంగతి తెలిసిన వానికే
సద్గుణమే అలంకారము సర్వజ్ఞా వేమా
అర్థం: అంగడిలో దొరికేవి ఆభరణాలు కావు. సద్గుణాలే నిజమైన అలంకారం.
బద్దెన కవి విద్య, వినయమే నిజమైన ఆభరణాలు అన్నారు.

విద్య భూషణము పురుషునకు
విద్యయె కీర్తిని తెచ్చు విశ్వమందున
విద్య లేని మనుజుండు
పశువు కంటెను హీనమగును పార్థివా సుమతీ
అర్థం: విద్యయే మనిషికి అసలైన ఆభరణం. విద్యే కీర్తిని తెస్తుంది. విద్య లేనివాడు పశువు కంటే హీనుడు.

‘సత్యము భూషణము సతికి
సత్యము భూషణము నరునకు సర్వజనులకున్‌
సత్యము లేని నరుండు
మత్యువుతో సమానమగును మేదిని సుమతీ‘
అర్థం: స్త్రీకైనా, పురుషుడికైనా సత్యమే అసలైన ఆభరణం. భాస్కరుడు అదే బాణిలో వెళ్ళాడు భాస్కరుడు శీలము, దానమే ఆభరణాలు అన్నారు.

‘దానము శీలము సత్యము
మానము విద్యయును నీతి మర్యాదయును
మేనికి భూషణములు సుమ్మీ
మేలైన గుణములు గలిగెనేని భాస్కరా‘
అర్థం: దానం, మంచి నడవడి, సత్యం, గౌరవం, విద్య, నీతి, మర్యాద – ఇవే శరీరానికి నిజమైన ఆభరణాలు.
భర్తృహరి గారు కూడా గుణాలనే ఆభరణాలు అన్నారు.

రత్నములు కావు భూషణ
రత్నములు సద్గుణములె సుమ్మీ రత్నములు
రత్నములు లేకపోయిన
రాజిల్లును సద్గుణముల రమణీయముగన్‌’
దీనికి అర్థం అక్కర్లేదు.

వినయము విద్యకు భూషణ
వినయము లేని విద్య విషముతో సమము సుమ్మీ
వినయ విద్యలు గల్గిన
వనరులెల్ల వచ్చు జగతిన.
బాహ్య అందం కోసం సాధన చేసినా ఫలితాలు తాత్కాలికం.. కనుమరుగు అయిపోతాయి... బదులుగా నిజమైన అలంకారాలు, ఆభరణాలు గుణాలు రూపంలో ఉంటే అవి సద్వినియోగం చేస్తే ఫలితాలు శాశ్వతం, లోక ప్రయోజనం, విశ్వ కళ్యాణం అవుతుంది.
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి  

నిర్వహణ: డి.వి.ఆర్‌. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)