Breaking News

బీర్ బాటిళ్ల ట్రక్‌ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!

Published on Tue, 05/20/2025 - 12:44

బీర్‌ బాటిళ్ల  లోడుతో నిండిన ట్రక్కు బోల్తాపడింది. దీంతో బీర్‌ బాటిళ్లను దక్కించుకునేందుకు జనాలు ప ఓటీలుపడ్డారు. డ్రైవర్‌ను, క్లీనర్‌ ట్రక్కులో చిక్కుకుపోయారు.  ఆర్తనాదాలు చేస్తున్నారు.  వారికి సహాయం చేయడానికి బదులుగా  అయితే, బాటసారులు, స్థానికులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న బీరు బాటిళ్లను పట్టుకుని లగెత్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మీ బీర్‌  పిచ్చి తగలడ, కాస్త మారండిరా బాబూఅంటూ నెటిజన్లు కమెంట్లతో మండిపడుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో  ఈ ఘటనచోటుచేసుకుంది. కట్ని జిల్లా చాపారా గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై సవందలాది మద్యం కార్టన్‌లతో నిండిన ట్రక్కు బోల్తా పడింది.  ట్రక్కు లోపల చిక్కుకున్న డ్రైవర్ , క్లీనర్‌కు సహాయం చేయడానికి కొంతమంది మొదట ముందుకు వచ్చారు. కానీ బీరు బాటిళ్లను మర్చి మానవత్వాన్ని మర్చిపోయారు. దొరికింది దొరికినట్టు మందు సీసాలను దొరకబుచ్చుకొని  కాళ్లకు  పనిచెప్పారు.ఈ మొత్తం సంఘటన వీడియోలో రికార్డ్ చేయబడింది మరియు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రమాదంలో చిక్కుకుపోయిన డ్రైవర్‌గురించి గానీ క్లీనర్‌ గురించి గానీ ఏ మాత్రం పట్టించుకోకుండా  పట్టించుకోలేదు నెటిజన్టు కమెంట్స్‌ చేశారు.

 p;

 

కొందరు బీరును సంచులలో మోసుకెళ్లగా, మరికొందరు తమ భుజాలపై డబ్బాలను ఎత్తుకుని పారిపోయారు. డజన్ల కొద్దీ వ్యక్తులు సీసాలను దోచుకుంటున్న సంఘటన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన తీరు నెట్టింట విమర్శలకు దారి  తీసింది. ఈ  ట్రక్కు జబల్‌పూర్ నుండి భోపాల్‌లోని హజారిబాగ్‌కు వెళుతోంది. ఒక గేదె అకస్మాత్తుగా దాని ముందుకి రావడంతో ట్రక్కు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జంతువును కాపాడే ప్రయత్నంలో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు  దీంతో ట్రక్కు బోల్తా పడింది.

 

లక్షల రూపాయల  నష్టం జరిగినట్లు అంచనా

పోలీసులకు సమాచారం అందిన వెంటనే, సలీమ్నాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అఖిలేష్ దహియా నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన డ్రైవర్ , క్లీనర్‌ను చికిత్స కోసం కట్ని జిల్లా ఆసుపత్రికి పంపారు. మరోవైపు మిగిలిన మద్యంను భద్రపరచడానికి ఎక్సైజ్ శాఖ  సంఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానికులు  భారీ మొత్తంలో వాటిని ఎత్తుకుపోయారు.

ప్రమాదం, జనాల కక్కుర్తి వల్ల నష్టం లక్షల రూపాయలలో ఉందని మద్యం కాంట్రాక్టర్ పేర్కొన్నాడు.  కేసు నమోదు చేసిన అధికారులు వైరల్‌ వీడియోల ఆధారంగా  అనుమానితులను  గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  చట్టపరమైన చర్యలుతీసుకునేందుకు ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తులను గుర్తించడంలో సహాయం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)