Breaking News

ట్రావెల్స్‌లో సరికొత్త ట్రెండ్స్‌..! ఇలాంటి టూర్స్‌ గురించి విన్నారా?

Published on Mon, 01/05/2026 - 16:17

ఏ కాలంలో అయినా ప్రయాణమంటే సంతోషం. ఉల్లాసం. ఉత్సాహం. అయితే కాలంతోటు ప్రయాణాలకు సంబంధించి అభిరుచులు, ఆసక్తులు, ట్రెండ్స్‌ మారుతున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ట్రెండ్స్‌ గురించి...

రోడ్‌ ట్రిప్‌
పదిమందితో కలిసి ప్రయాణాలను ఎంజాయ్‌ చేసే వారు ఒక రకం. ఒంటరిగా మాత్రమే ఎంజాయ్‌ చేసే వారు మరొక రకం. రెండో కోవకు చెందిన వారికి నచ్చిన ట్రెండ్‌...రోడ్‌ ట్రిప్‌. హిల్టన్‌ ‘ట్రెండ్స్‌ రిపోర్ట్‌’ ప్రపంచవ్యాప్తంగా రోడ్‌ ట్రిప్‌లకు పెరుగుతున్న ఆసక్తి గురించి వెల్లడించింది.  ‘క్లాసిక్‌ రోడ్‌ ట్రిప్‌ అనేది లగ్జరీ అనుభవం’ అంటున్నాడు డ్రైవింగ్‌ హాలిడే స్పెషలిస్ట్‌ హంటర్‌ మోస్‌. ఒకటి లేదా రెండు రోజుల ప్రయాణల పట్ల ఆసక్తి చూపే వారు రోడ్‌ ట్రిప్‌లను ఇష్టపడుతున్నారు. జెన్‌ జీలో ఎక్కువ మంది సోలో రోడ్‌ ట్రిప్‌లను ఇష్టపడుతున్నారు.

‘చే గువేరా ది మోటర్‌సైకిల్‌ డైరీస్‌ పుస్తకం చదివిన తరువాత, మోటర్‌ బైక్‌పై ప్రయాణాలు చేయాలనే ఆసక్తి మొదలైంది. మొదట్లో కష్టం అనిపించినా ఆ తరువాత ఎలాంటి సమస్య అనిపించలేదు. రోడ్డు ట్రిప్‌లతో మనసు ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ చేతన్‌.

‘ఉత్తర అమెరికా, యూరప్‌లలో కారు అనేది వాహనం మాత్రమే కాదు. అంతకుమించి. రోడ్డు ప్రయాణాలలో అది వారికి స్నేహితుడు. రోడ్డు పొడవునా కారుతో ముచ్చట్లు చెబుతూ ప్రయాణిస్తుంటారు చాలామంది’ అంటుంది ఒక ట్రావెల్‌ డిజిటల్‌ సంస్థలో చీఫ్‌ బిహేవియర్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మిలేనా నికోలోవా.

అల్ట్రా పర్సనలైజ్‌డ్‌ ట్రిప్స్‌
ప్రయాణం అంటేనే సంతోషం. అయితే విషాద సమయాల్లో చేసే ప్రయాణాలు కూడా ఉంటాయి. విషాదం నుంచి బయటి పడి మనసును తేలిక చేసుకునే ప్రయాణాలు ఇవి. ఇలాంటి అల్ట్రా పర్సనలైజ్‌డ్‌ ట్రిప్స్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఊపందుకున్నాయి.

కుటుంబ సభ్యుల మరణం, విడాకులు తీసుకోవడం... ఇలా జీవితంలోని రకరకాల విషాదాల నుంచి బయటపడడానికి ఈ స్పెషల్‌ టూర్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘గ్రీఫ్‌ టూర్స్‌ అనేవి ట్రావెల్‌ ఇండస్ట్రీకి సరికొత్త అవకాశం’ అంటుంది కల్చరల్‌ ట్రెండ్స్‌ స్పెషలిస్ట్‌ జాస్మిన్‌ బినా.

‘విషాదాల నుంచి బయటపడడానికి ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు ఏ మేరకు ఉపయోగపడతాయి?’ అని చెప్పడానికి సంబంధించి శాస్త్రీయ పరిశోధనలు పరిమితంగానే ఉన్నప్పటికీ ‘విషాదం నుంచి బయటపడే ఒక మార్గం...ప్రయాణం’ అనేదాంట్లో విభేదాలు లేవు.

న్యూరో ఇమేజింగ్‌తో దుఃఖాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త మేరీ ఫ్రాన్సిస్‌... ‘ప్రయాణం అనేది దుఃఖం నుంచి బయటపడే మార్గాలలో ఒకటి’ అన్నారు. దుఃఖం నుంచి బయటపడే ఈ మార్గాన్ని ‘వెల్నెస్‌ ట్రావెల్‌ ట్రెండ్‌’ అని కూడా పిలుస్తున్నారు. 

‘రెండు ప్రపంచాల మధ్య మనం ఊగిసలాడుతున్నప్పుడు దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయాణం ఉపకరిస్తుంది. అదుపు తప్పిన భావోద్వేగాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం ద్వారా దుఃఖభారాన్ని తగ్గించుకోవచ్చు’ అంటున్నారు డాక్టర్‌ రాబర్ట్‌ నీమెయర్‌. 

(చదవండి: జస్ట్‌ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..)


 

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)