Breaking News

తక్కువ వ్యయం.. లోటు లేని జీవితం

Published on Sun, 02/01/2026 - 07:53

వచ్చిన ఆదాయంతో దేనికీ అంతగా ఇబ్బందులు పడకుండా, సుఖవంతమైన జీవితం గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి.. సరిగ్గా ఇలాంటివారికి అనువైన నగరాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. ఖర్చు తగ్గించుకుంటూనే.. నాణ్యమైన జీవితాన్ని గడపాలని ఆశించే వారికి ఇవి ఒక వరమని చెప్పుకోవచ్చు. సంస్కృతికి నిలయమైన జైపూర్ నుండి, ప్రకృతి ఒడిలో అలరారే డెహ్రాడూన్, ఉరుకుల పరుగుల కోల్‌కతా వరకు.. ఈ నగరాలు మీ జేబుకు చిల్లు పడకుండా సౌకర్యవంతమైన జీవనశైలిని అందిస్తాయి.

ప్రశాంతతకు తిరువనంతపురం 
దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో జీవనం సాగించగల నగరాల్లో కేరళ రాజధాని తిరువనంతపురం అగ్రస్థానంలో ఉంది. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని గడపాలనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం అని చెబుతుంటారు. ఇక్కడ నివాస ఖర్చులు చాలా తక్కువగా ఉండటమే కాకుండా, ప్రముఖ ఐటీ హబ్‌గా ఈ ప్రాంతం ఎదగడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పశ్చిమ కనుమల మధ్య, అరేబియా సముద్ర తీరాన కొలువైన తిరువనంతపురం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ, తక్కువ ఖర్చుతో నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్నదని ‘టైమ్స్‌ ట్రావెల్‌’ తన కథనంలో పేర్కొంది.

తక్కువ అద్దెలు, మెరుగైన వసతుల కోసం..
తమిళనాడులోని కోయంబత్తూర్ నగరం తక్కువ అద్దెలు, మెరుగైన వసతులకు పెట్టింది పేరుగా నిలిచింది. గృహ నిర్వహణ వ్యయం పరంగా దేశంలోనే అత్యంత చౌకైన నగరాల్లో ఒకటిగా కోయంబత్తూర్ గుర్తింపు పొందింది. ఇక్కడి వస్త్ర, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఆర్థికంగా ఈ ప్రాంతానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా, భారీగా ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.

ఇదే కోవలో డెహ్రాడూన్‌
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్  ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటుంది. తక్కువ విద్యుత్ ఛార్జీలు, స్వల్ప నీటి ఛార్జీలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రవాణా వ్యవస్థ, ఆహార ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండటం వల్ల ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ నగరంగా నిలుస్తోంది.

పరిశుభ్రతలో టాప్‌ నగరం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం అసాధారణమైన పరిశుభ్రత, భద్రత, రుచికరమైన ఆహారాల లభ్యతకు పెట్టింది పేరు. దేశంలో నివసించడానికి అత్యంత పొదుపైన నగరంగా 2023లో ఇది నిలిచింది. ఇక్కడ రవాణా, గృహ వసతి చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే..
సాంస్కృతిక రాజధాని కోల్‌కతా.. ఇక్కడ లభించే స్ట్రీట్‌ ఫుడ్‌ రుచితో పాటు చాలా చౌక ధరలకే లభ్యమవుతుంది.  ఇదొక మెట్రో నగరమైనప్పటికీ, ఇక్కడ సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతోనే మెరుగైన జీవన ప్రమాణాలను అందుకోవచ్చు.

చండీగఢ్, జైపూర్, నాగ్‌పూర్..
పదవీ విరమణ తర్వాత స్థిరపడాలనుకునే వారికి చండీగఢ్ ఒక అద్భుతమైన నగరమని చెబుతుంటారు. కాలుష్యం తక్కువగా ఉండటం, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, తక్కువ అద్దెలు మొదలైనవి చండీగఢ్ సొంతమని అంటారు.రాజస్థాన్ రాజధాని జైపూర్ సైతం వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, సామాన్యులకు పొదుపుగా జీవించే మార్గాలను అందిస్తోంది. ఇక మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరం ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. తక్కువ రియల్ ఎస్టేట్ ధరలు, అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీ, అత్యుత్తమ వైద్య సదుపాయాలతో నాగ్‌పూర్ సామాన్యులు స్థిరపడేందుకు అనువైన నగరంగా మారింది.

ఇది కూడా చదవండి: పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది?

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)