Breaking News

Bangemudha: పంటినొప్పులకు విరుగుడట!

Published on Sun, 09/22/2024 - 08:19

ఈ చెట్టు కాండానికి నాణెం కొడితే పంటినొప్పులు తగ్గుతాయట! అలాగని భక్తుల విశ్వాసం. నేపాల్‌ రాజధాని కఠ్మాండూలోని దర్బార్‌ చౌరస్తా నుంచి థమేల్‌ వైపు వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ విచిత్రం. వైశాదేవ్‌ ఆలయ ప్రాంగణంలో ‘బంగెముధా’ అనే చెట్టు కాండం శతాబ్దాలుగా ఉంది. 

ఆలయాన్ని దర్శించుకునే భక్తుల్లో దంతబాధలు ఉన్నవారు ఈ కాండానికి మేకులతో నాణేలను కొట్టి తగిలిస్తారు. దీనివల్ల దంతబాధలు తగ్గిపోతాయని వారు నమ్ముతారు. నేపాల్‌ ప్రాంతాన్ని లిచ్ఛావి వంశస్థులు పాలించే కాలం నుంచి– అంటే, సుమారు క్రీస్తుశకం 400–750 మధ్య కాలం నుంచి ఈ కాండం ఇక్కడే ఉన్నట్లు చెబుతారు. ఆధునిక దంతవైద్యం ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందినప్పటికీ, ఇక్కడి జనాలు దంతబాధల నివారణకు ఇప్పటికీ ఈ చెట్టు కాండాన్నే నమ్ముకుంటూ ఉండటం విశేషం. ప్రతిరోజూ వందలాది భక్తులు ఈ చెట్టుకాండానికి నాణేలు కొట్టి మొక్కుకుని వెళుతుంటారు. 

ఈ కాండంలోని పెద్ద తొర్ర లోపల బంగారు దేవతా విగ్రహం ఉండేదని, అది చోరీకి గురైందని కూడా కఠ్మాండూ ప్రజలు చెప్పుకుంటుంటారు. అయితే, తొర్ర లోపలి విగ్రహానికి సంబంధించి ఆధారాలేవీ లేవు. వైశాదేవ్‌ ఆలయ పరిసరాల్లో డజనుకు పైగా దంతవైద్యుల క్లినిక్‌లు ఉన్నా, జనాలు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండటం చూసి విదేశీ పర్యాటకులు ఆశ్చర్యపోతుంటారు. 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)