Breaking News

'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్‌ వ్యవస్థాపకుడి పేరెంటింగ్‌ పాఠాలు..

Published on Wed, 02/11/2026 - 11:19

తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పైగా ప్రయోజకులుగా తీర్చిదిద్దడంపై సూచనలు కూడా ఇచ్చారు. అయితే థైరోకేర్‌ వ్యవస్థాపకుడు వేలుమణి చెప్పే పేరెంటింగ్‌ పాఠాలు చాలా ఆలోచనాత్మకంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలను అభ్యున్నతి మార్గంలో నడిపించే దిక్సూచిలా ఉంటాయి అవి. గతంలో దీని గురించి తన అనుభవాలను జోడిస్తూ చెప్పారు. ఈసారి పిల్లల పెంపకంపై పేరెంట్స్‌ని ఉద్దేశిస్తూ చేసిన ఆసక్తికర పోస్ట్‌ చర్చనీయాంశమై హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆయన పోస్ట్‌లో ఏ చెప్పారంటే..

తన పోస్ట్‌లో వేలుమణి పిల్లలను పెంచడాన్ని రెండు విధాలుగా పోల్చారు. టైప్‌ ఏ అని రాస్తూ..చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేషన్స్‌ జరుపుకుంటూ..పిల్లలను బహిరంగంగా అభినందించడం, పోరుగువారితో తమ పిల్లల సక్సెస్‌ని షేర్‌ చేసుకుంటుంటారు. అంతేగాదు అక్కడితో ఆగారు..అందుకుగానూ విదేశీ పర్యటనలు అంటూ వారికి సర్‌ప్రైజ్‌ గిప్ట్‌లు కూడా ఇస్తుంటారు. ఈ పేరెంటింగ్‌ విధానంలో ఇరువురు సంతోషంగా ఉంటారు. కానీ పిల్లల్లోని అసలైన ప్రతిభాపాటవాలు వెలులోకి రావని అంటున్నారు. 

మరోవైపు టైప్‌ బి అనేది తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక చిన్న సమస్యను పరిష్కరించేలా ప్రేరేపిస్తారు. దాని తర్వాత మరింత పెద్ద సమస్యను ముందుంచుతారు. అలా క్రమంగా సవాళ్లను స్వీకరించే సామార్థ్యం..అధిగమించి శక్తిని పుంజుకునేలా బలోపేతం చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే వారిలోని పూర్తి సామర్థ్యాలను వెలికితీసే యత్నం చేస్తుంటారు. ఇది పిల్లలకు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌ ఉండటాన్ని నేర్పిస్తుంది. ఫలితంగా పిల్లలు ప్రయోజకులు అవ్వడమే కాదు..బలోపేతమైన పెద్దలుగా మారేందుకు దోహదపడుతుంది. 

చాలామటుకు పిల్లల సామర్థ్యాలను వెలికితీసేలా పెంచెలాని కోరుతూ..పిల్లలను గారబం మాత్రం చెయ్యొద్దని హితవు పలికారు పోస్ట్‌లో. అయితే వేలుమణి చెప్పిన ఈ అంశం నెటిజన్లుల్లో ఒక విధమైన ఉత్సుకతను రేపి..చర్చలకు తెరలేపింది. ప్రోత్సహిస్తేనే కాదా..పిల్లలు ముందుకు పోగాలరు. దాన్నే వద్దంటున్నారు అని కొందరు, కఠినమైన ప్రేమ అనేది పిల్లవాడిలోని నిజమైన సామర్థ్యాన్ని అన్‌లైక్‌ చేస్తుందని మరొకొందరు కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఇక్కడ వేలుమణి చెబుతోంది అది కాదు. ఆయన ఎల్లప్పుడూ పిల్లలను ప్రేమించండనే అంటున్నారు. 

అయితే కాస్త తెలివిగా ప్రశంసిస్తూ..పిల్లలు బలాన్ని పుంజుకునేలా చేయాలి. కంఫర్ట్‌జోన్‌కి పరిమితం కానివ్వకుండా సవాళ్లును చలాకీగా స్వీకరించే బలోపేతమైన వ్యక్తులుగా కూడా తీర్చిదిద్దాలనే విషయం మరువకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగే పెద్దలు గారబం జోలికి పోకూడదు..అప్పుడే వాళ్లలో అపారమైన ప్రతిభపాటవాలు వెలికి తీయగలగడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.

 

(చదవండి: అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)