Breaking News

ఉబర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్‌లో కోడింగ్‌..!

Published on Tue, 02/10/2026 - 12:09

మంచి కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదలుకుని నచ్చిన జాబ్‌లో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలి. తీరా మనకు నచ్చిన రంగంలో కొనసాగాక..సమస్యలు వెంటాడితే ఇక అంతే సంగతులు. అంతా సవ్యంగా ఉంటే పర్లేదు. ఏదైనా సమస్య వస్తేనే ఇబ్బంది. అందులోనూ భారీ వేతనం లభిస్తున్న ఉద్యోగం వదలాలన్న గట్స్‌ కావాలి. అయితే ఈ టెక్కీ అంత సాహసం చేశాడు. అది కూడా యూట్యూబ్‌లో కోడింగ్‌ నేర్పడం కోసం అంత పెద్ద ఉద్యోగం వదిలేశాడు. అబ్బా ఇదేంటని అడిగితే.. తాను కోరుకున్నది ఇదేనని నవ్వుతూ చెబుతాడు సదరు టెక్కీ. సోషల్‌ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్‌ వైరల్‌గా మారడమే గాక టెక్కీ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. 

ఆ వ్యక్తే అక్షయ్‌ సైనీ. సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో మాజీ ఉబర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అక్షయ్‌ సైనీ ఐదేళ్ల క్రితం సురక్షితమైన కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదులుకున్న తన జర్నీని పంచుకున్నాడు. ఈ నిర్ణయం అతడికి తన డడ్రీమ్‌ లైఫ్‌ని నిర్మించుకునేందుకు సహాయపడింది. అంతేగాదు సైనీ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో రెండు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నిజానికి తాను ఉబర్‌లో ఉద్యాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడూ..అందరు తనని మతిస్థిమితం లేనివాడిగా చూశారని చెప్పుకొచ్చాడు. 

కేవలం యూట్యూబ్‌లో బోధించేందుకు మంచి జీతం, మంచి బ్రాండెడ్‌ కంపెనీ తదితరాలన్నీ కాదనుకుంటున్నావా అని కూడా ప్రశ్నించారని రాసుకొచ్చాడు. ఇది చాలా తెలివితక్కువ నిర్ణయమని. అంతగా కావాలనుకుంటే జాబ్‌ చేస్తూనే వారాంతాలలో య్యూట్యూబ్‌ కంటెంట్‌క్రియేటర్‌గా, కోడింగ్‌ బోధించమని సలహ ఇచ్చారని తెలిపాడు. కొందరైతే ఏకంగా ఉబర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ట్యాగ్‌తో పెళ్లి అయిపోని.. ఆ తర్వాత నచ్చినదాంట్లో కొనసాగమని సూచించారు కూడా. 

అయితే నా దృష్టిలో వివాహాం పెద్ద మేటర్‌ కాదు కాబట్టి..గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం తొందరపడలేదని..జీతం లేకుండా పది నెలలకు పైగా సెలవులు తీసుకుని మరి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వివరించాడు. ఆ విరామ సమయంలో బోధన, డెవలపర్‌ విద్యపై దృష్టి సారించి నమస్తేదేవ్‌ అనే వేదికపై పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో తాను కేవలం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని మాత్రమే ఇప్పుడు..వ్యవస్థాపకుడిగా, సీఈవోగా, మార్కెటర్‌గా, సేల్స్‌గైగా, ప్రొడక్ట్‌ మేనేజర్‌గా, ఫైనాన్స్‌గైగా, కొన్నిసార్లు కస్టమర్‌ సపోర్ట్‌గా అన్ని రోల్స్‌ నిర్వరిస్తున్నా అని ఆనందంగా చెబుతున్నాడు. 

అంతేగాదు మనకు బయట స్టార్టప్‌లు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.  కానీ చాలా వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా ఎన్నో విమర్శలు, ఆన్‌లైన్‌ ద్వేషాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వెనుతిరగలేదని, ఎన్నోప్రతికూలతలను దాటుకుంటూ చాలా దూరం వచ్చానంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు సైని. అలా ఇప్పటికీ ఐదేళ్లు అయ్యిందని, స్వస్థలం డెహ్రాడూన్‌, అక్కడే ఒక చిన్న రిమోట్‌ బృందంతో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీని వల్ల కుటుంబంతో గడపగలుగుతున్నానని, పనిని ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు. 

ఈ పోస్ట్‌..అందరి మనుసుని గెలుచుకోవడమే గాక..ఇలాంటి నిర్ణయాల తీసుకునేందుకు చాలా గట్టి ధైర్యం కావాలని, ఆత్మసంతృప్తినిచ్చే పని ఎంతో నచ్చుతుందని. దానికి మించింది మరొకటి లేదని పోస్టులు పెట్టారు. అలాగే అన్నివేళలా సురక్షితమైన ఉద్యోగం కంటే..ఓర్పుతో నచ్చిన వృత్తిలో గెలుపు అందుకోవడంలో ఉన్న కిక్‌ వేరేలెవెల్‌ అంటూ మరికొందరూ పోస్టుల్లో పేర్కొన్నారు.

 

(చదవండి: ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!)

 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)