Breaking News

డయాబెటిస్‌ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?

Published on Wed, 05/14/2025 - 16:37

భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమై పోతుందట. అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ అది ఏ దేవుడు ఆలయం?. ఎక్కడ కొలువై ఉంది?..ఇదంతా నిజమేనా..? వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం..!.

తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని అనే గ్రామంలో ఉంది. తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి  26 కి.మీ. మీ. అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది. చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అనిపిలుస్తారు. 

ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా, పార్వతి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడటానికి చెరకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడూ ఈ ప్రదేశం చెరకు (కరుంబు), వెన్ని(నందివర్ధనం చెట్టు) చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభేశ్వరర్ అని పిలుస్తారు.

మధుమేహం ఎలా నయం అవుతుందంటే..
ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి  తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదు వేల  ఏళ్లనాటి పురాతనమైన లింగం. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. 

నిజమేనా అంటే..?
ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే గాక, విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడకి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెబుతుంటారు. అది నిజమేనా కాదా అని పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని నిరూపితమవ్వడంతో ఇదేలా జరుగుతుందని విస్తుపోతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలయాన్ని దర్శించి..మధుమేహం వ్యాధి నుంచి బయటపడండి.

గమనిక: ఇది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం. దానినే మేము ఇక్కడ వార్తగా ఇచ్చాము. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం
 

(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర)

 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)