Breaking News

మంచు కొండలో ఈ వాల్ట్‌ ఎందుకో తెలుసా?

Published on Mon, 08/24/2026 - 08:56

మన భూమిపై పలు రకాల మొక్కలు, పంటలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా జరిగితే, వాతావరణ మార్పులు, ప్రకతి విపత్తుల వల్ల కొన్ని జాతుల పంటలు, మొక్కలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్లీ వాటిని పండించేందుకు, ఆహార పంటలు, మొక్కల వైవిధ్యాన్ని రక్షించేందుకు నార్వేలోని స్వాల్‌బార్డ్‌ అనే ప్రదేశంలో ఈ విత్తనాల బ్యాంకును ఏర్పాటు చేశారు.

ప్రపంచంలోని వేలాది పంటల విత్తనాలను బ్యాకప్‌గా భద్రపరిచే ప్రత్యేకమైన గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌ ఇది. నార్వే దేశంలోని స్వాల్‌బార్డ్‌ అనే ఆర్కిపెలాగోలోని స్పిట్స్‌బెర్గెన్‌ ద్వీపంలో ఈ సీడ్‌ వాల్ట్‌ ఉంది. ఈ వాల్ట్‌ను ఆర్కిటిక్‌ మంచు, కొండల మధ్యలో, ఒక పర్వతం లోపల నిర్మించారు. అందుకే ఇది బయట నుంచి చూస్తే మంచు మధ్య దాగి ఉన్న పెద్ద లాకర్‌లా ఉంటుంది.

సీడ్‌ వాల్ట్‌ లక్ష్యం ఏంటి?
నిజానికి ప్రపంచంలో అనేక దేశాల్లో విత్తనాల బ్యాంకులు ఉన్నాయి. మన దేశంలో కూడా విత్తనాలను భవిష్యత్తు తరాల కోసం సంరక్షించే సంస్థలు ఉన్నాయి. అలాగే స్వాల్‌బార్డ్‌ అనేది సీడ్‌ బ్యాంక్‌ కాదు.. ఇది వాల్ట్‌.

వివిధ దేశాలు, పరిశోధనా సంస్థలు, జీన్‌ బ్యాంకుల నుంచి విత్తనాలను ఇక్కడ భద్రపరుస్తారు. ఒక దేశంలో ప్రకతి విపత్తు సంభవించినా, యుద్ధం కారణంగా పంటలు లేదా విత్తనాల సేకరణలు నాశనమైనా, భవిష్యత్తులో ఈ విత్తనాలను తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

దీనిని పర్వతం లోపల నిర్మించారు. అది ఒక నేచురల్‌ ఫ్రీజర్‌గా పని చేస్తుంది. పర్వతం లోపల లోతుగా ఉండటం వల్ల బయట ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల నుంచి ఈ విత్తనాలకు ప్రొటెక్షన్‌ లభిస్తుంది. ఆర్కిటిక్‌ ప్రాంతంలోని సహజమైన చల్లని వాతావరణం కూడా ఈ సంరక్షణకు సహాయపడుతుంది.

స్వాల్‌బార్డ్‌ సీడ్‌ వాల్ట్‌ను 2008లోప్రారంభించారు. దీని నిర్మాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పర్వతం లోపలికి వెళ్లే ఒక పొడవైన టన్నెల్‌ ద్వారా సీడ్‌ స్టోరేజ్‌ చాంబర్లకు చేరుకోవచ్చు. అక్కడ మన షాపింగ్‌ మాల్‌లో ఉన్నట్టు ర్యాక్స్‌ ఉంటాయి. ఒక దేశానికి ర్యాక్‌లో కొంత ప్లేస్‌ ఇస్తారు. ఆ ప్లేస్‌లో ఆ దేశం పంపించే విత్తనాలను సేవ్‌ చేస్తారు.

ఇది సాధారణ సీడ్‌ స్టోరేజ్‌ సెంటర్‌ కాదు. భవిష్యత్‌ తరాల కోసం ప్రపంచంలోని వ్యవసాయ వైవిధ్యాన్ని కా΄ాడే ఒక గ్లోబల్‌ బ్యాకప్‌ సిస్టమ్‌. అందుకే దీనిని కొన్నిసార్లు ‘‘డూమ్స్‌డే వాల్ట్‌’’ అని కూడా పిలుస్తారు.

ఇవి చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్‌ రివర్‌’ అని ఎందుకు అంటారో తెలుసా?

Videos

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

లింగమనేని కొడుకు వీడియో తీసింది ఎవరంటే.. అది బయటపడటానికి కారణం కూడా..

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)